విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
వేసవి కాలంలో ప్రజల దాహార్తిని తీర్చేందుకు చలివేంద్రాలు దోహదం చేస్తాయని సెంట్రల్ నియోజకవర్గ శాసనసభ్యులు మల్లాది విష్ణు అన్నారు. సత్యనారాయణపురంలోని శివాజీ కేఫ్ సెంటర్ వద్ద ఏర్పాటు చేసిన మజ్జిగ చలివేంద్రాన్ని స్థానిక కార్పొరేటర్ శర్వాణీ మూర్తితో కలిసి శుక్రవారం ఆయన ప్రారంభించారు. ప్రజల దాహార్తిని తీర్చేందుకు పార్టీ శ్రేణులు చలివేంద్రాలు ఏర్పాటు చేయడం హర్షణీయమని మల్లాది విష్ణు అన్నారు. వేసవి తీవ్రత అధికంగా ఉన్నందున చల్లని మంచినీరు, మజ్జిగను అందించడం ద్వారా బాటసారులు ఎంతో ఉపశమనం పొందుతారన్నారు. ముఖ్యంగా వివిధ పనులపై నగరానికి వచ్చే వారికి ఈ చలివేంద్రాలు ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. కార్యక్రమంలో డివిజన్ కోఆర్డినేటర్ దోనేపూడి శ్రీనివాస్, నాయకులు చాంద్, కోలవెన్ను కొండ, సనత్, కూనపులి ఫణి, పింగళి రాయులు, రవిశంకర్, తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News