Breaking News

జిల్లాలో ప్రశాంతంగా ఇంటర్మీడియట్ పరీక్షలు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఇంటర్మీడియట్ పరీక్షలు జిల్లాలో ప్రశాంతంగా ప్రారంభమయ్యాయని జిల్లా కలెక్టర్ యస్.ఢిల్లీ రావు అన్నారు. లబ్బీపేట లోని శ్రీ దుర్గా మల్లేశ్వర స్వామి మహిళ కళాశాలలో జరుగుతున్న ఇంటర్ పరీక్షా కేంద్రాన్ని శుక్రవారం కలెక్టర్ ఢిల్లీ రావు పరిశీలించారు. పరీక్షా కేంద్రంలో విద్యార్థులకు కల్పించిన ఏర్పాట్లను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. అనంతరం కలెక్టర్ మాట్లాడుతూ నేటి నుండి ప్రారంభమైన పరీక్షలు ఈనెల 24వ తేదీ వరకు జరగనున్నాయన్నారు. జిల్లాలో 70 పరీక్షా కేంద్రాలు ఏర్పాటు చేశామని, ఈ పరీక్షలకు మొత్తం 55,076 మంది హాజరు కానుండగా వీరిలో మొదటి సంవత్సరం 27,927మంది, రెండవ సంవత్సరం 27,149 మంది హాజరవుతున్నారన్నారు. ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేలా పరీక్షా కేంద్రాల్లో అన్ని సౌకర్యాలు కల్పించామన్నారు.ఎండ తీవ్రత దృష్ట్యా ఓఆర్ఎస్ ప్యాకెట్లను అందుబాటులో ఉంచి ఏఎన్ఎం, ఆశ కార్యకర్తతో అన్ని పరీక్షా కేంద్రాల్లో వైద్య శిబిరాలను ఏర్పాటు చేశామన్నారు. మాస్ కాపీయింగ్ కు తావులేకుండా ప్రత్యేక పర్యవేక్షణ చేసెలా ప్రత్యేక బృందాలను నియమించామని అన్నారు. అన్ని పరీక్షా కేంద్రాల్లో సీసీ కెమెరాలు ఏర్పాటు చేశామన్నారు.విద్యుత్ కు ఎటువంటి అంతరాయం లేకుండా పరీక్ష సమయంలో నిరంతర విద్యుత్ సరఫరా, అన్ని పరీక్షా కేంద్రాలకు విద్యార్థులు సకాలంలో చేరుకునేలా ఏపీఎస్ఆర్టీసీ బస్సు రూట్ లను మ్యాపింగ్ చేసిందన్నారు. పరీక్ష కేంద్రాల్లోకి ఇన్విజిలేటర్లు, చీఫ్ సూపరిండెంట్ లు, ఫ్లయింగ్ స్క్వాడ్ అధికారులు కూడా సెల్ పోన్లతో అనుమతి లేదన్నారు. పరీక్షా కేంద్రాల వద్ద144వ సెక్షన్ అమలుచేసి, పటిష్ఠ బందోబస్తు ఏర్పాటు చేశామన్నారు. విజయవాడలోని రాష్ట్ర ఇంటర్మీడియట్ బోర్డ్, రీజినల్ ప్రాంతీయ పర్యవేక్షణాధికారి కార్యాలయాల్లో ఏర్పాటుచేసిన కంట్రోల్ రూమ్ లకు సీసీ కెమెరాలను అనుసంధానించి ఎప్పటికప్పుడు పర్యవేక్షణ చేస్తున్నామన్నారు. జిల్లా స్థాయిలో ఆర్జెడి , డివీఈఓ, ఒక సీనియర్ ప్రిన్సిపాల్ తో కూడిన కమిటీ పూర్తి పర్యవేక్షణ చేస్తుందని కలెక్టర్ ఢిల్లీ రావు అన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *