Breaking News

చెత్త నుండి సంపద తయారీ కేంద్రాలన్నీ వినియోగం లోకి తీసుకురావాలి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
చెత్త నుండి సంపద తయారీ కేంద్రాలన్నీ వినియోగం లోకి తీసుకురావాలని జిల్లా కలెక్టర్ యస్. డిల్లీ రావు అధికారులను ఆదేశించారు. నగరంలోని కలెక్టరేట్ నుండి శుక్రవారం జిల్లా కలెక్టర్ యస్. డిల్లీ రావు జిల్లాలోని పంచాయతీరాజ్ ఇవోపిఆర్డిలతో సాలిడ్ వేస్ట్ ప్రాసెసింగ్ సెంటర్ల నిర్వహణపై టెలికాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని 16మండలాలలో288 గ్రామ పంచాయతీలు ఉన్నాయని వీటిలో 257కు పైగా చెత్త నుండి సంపద తయారీ కేంద్రాల నిర్మాణాలు పూర్తి అయ్యాయన్నారు. వీటిలో 135కు పైగా కేంద్రాలలో కార్యకలాపాలు జరుగుతున్నాయన్నారు. మిగిలిన వాటికి కూడా అవసరమైన అన్ని మౌలిక వసతులు కల్పించాలని, వాటి నిర్వహణలో స్థానికంగా ఎదురవుతున్న ఇబ్బందులను పరిష్కరించి వాడుకలోకి తీసుకురావాలన్నారు. గ్రామాల్లోని ప్రతి ఇంటి నుండి తడి, పొడి చెత్త సేకరించి చెత్త నుండి సంపద తయారీ కేంద్రాలకు తరలించాలన్నారు. ప్రతీ వాలంటీరు తన పరిధిలోని 50 గృహాలను మ్యాపింగ్ చేసి క్లాప్ మిత్రలతో సమన్వయం చేసుకోవాలన్నారు. గ్రామాల్లోని అన్ని చోట్ల నూరు శాతం చెత్త సేకరణ జరగాలని, సేకరించిన తడి, పొడి చెత్తను కేంద్రాలకు చేర్చాలని అధికారులను ఆదేశించారు. దీనిపై ప్రతి వారం పర్యవేక్షణ ఉంటుందని గ్రామాల్లో ఎక్కడా చెత్త లేకుండా చూసి ఆహ్లాదకర గ్రామాలుగా తీర్చిదిద్దే బాధ్యత పంచాయతీ రాజ్,ఈ ఓ పి ఆర్ డి లు తీసుకోవాలని కలెక్టర్ అన్నారు. ఈ సందర్భంగా వత్సవాయి, పెనుగంచిప్రోలు ఈఓపిఆర్ డి లను చెత్త సేకరణ పై వారు పరిశీలించిన గ్రామాలను, నిర్వహణ తీరును కలెక్టర్ అడిగి తెలుసుకున్నారు.

చెత్త నుండి సంపద సృష్టించే కేంద్రాలుగా సాలిడ్ వేస్ట్ ప్రాసేసింగ్ సెంటర్లు ఉండాలి..
క్లీన్ ఆంధ్రప్రదేశ్ లక్ష్యంగా జరుగుతున్న జగనన్న స్వచ్ఛ సంకల్పంలో భాగంగా గ్రామాలు లు చెత్త సేకరణ ప్రక్రియ జరిపి వర్మి కంపోస్ట్ ఉత్పత్తులతో ఆదాయాన్ని సమకూర్చే విధంగా తయారు చేయాలని పంచాయతీరాజ్ శాఖ అధికారులు దృష్టి పెట్టాలని కలెక్టర్ ఆదేశించారు. టెలీ కాన్ఫరెన్స్ లో డిపిఓ కె.పూర్ణ చంద్ర శేఖర్, పంచాయతీరాజ్ ఈఓపిఆర్డిలు ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *