Breaking News

కార్పొరేట్‌ ఫ్రీ స్కూల్స్‌కి థీటుగా అంగన్‌వాడీ కేంద్రాలు…

-చిన్నారుల్లో శారీరక మానసిక భాషా సృజనాత్మక సాంకేతిక అభివృద్దే లక్ష్యం
-జిల్లా కలెక్టర్‌ యస్‌ డిల్లీరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కార్పొరేట్‌ ఫ్రీ స్కూల్స్‌కు ధీటుగా అంగన్‌వాడీ కేంద్రాలను నిర్వహించి జీరో నుండి 8 సంవత్సరాల వయస్సు పిల్లలకు శారీరక మానసిక భాషా సృజనాత్మక సాంకేతిక అభివృద్ధికి కృషి చేస్తున్నట్లు జిల్లా కలెక్టర్‌ యస్‌ డిల్లీరావు తెలిపారు. జిల్లా స్త్రీ శిశు సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో స్థానిక తుమ్మలపల్లి కళాక్షేత్రంలో నిర్వహించిన జిల్లా స్థాయి అంగన్‌వాడీ కేంద్రాల వార్షికోత్సవ కార్యక్రమాన్ని స్త్రీ శిశు సంక్షేమ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరి ఎ అనూరాధ, సబ్‌ కలెక్టర్‌ ఎస్‌ ఎస్‌ ప్రవీణ్‌చంద్‌లతో కలిసి జిల్లా కలెక్టర్‌ యస్‌ డిల్లీరావు జ్వోతిప్రజ్వలన చేసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో 1475 అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా 48 వేల మందికి పైగా చిన్నారులకు ఆటపాటలతో కూడిన విద్యాబుద్దులను నేర్పిస్తున్నట్లు తెలిపారు. అంగన్‌వాడీ కేంద్రాల వార్షికోత్సవాలను జరుపుకోవాలనే మంచి సాంప్రదాయానికి తొలిసారిగా ఎన్‌టిఆర్‌ జిల్లాలో శ్రీకారం చుట్టడం అభినందనీయమన్నారు. కార్పొరేట్‌ ఫ్రీ స్కూల్‌కి ధీటుగా అంగన్‌వాడీ కేంద్రాల చిన్నారులకు అధునాతన మౌలిక వసతులను కల్పించడంతోపాటు మంచి పౌష్టికాహారం అందించడం జరుగుతుందన్నారు. చిన్నారుల్లో ఊహా తెలిసినప్పటి నుండి 8 సంవత్సాలలోపు పాకడం, నడక నేర్వడంతో పాటు శారీరక మానసిక భాషా సృజనాత్మక సాంకేతిక వంటి అంశాలపై అభివృద్ధి కల్పించగలిగితే వారు పరిపుష్టమైన ఆరోగ్యవంత ఆలోచనలతో పెరుగుతారన్నారు. ఇందుకు అంగన్‌వాడీ కేంద్రాలు ఎంతగానో దోహదపడుతున్నాయనడంలో ఎటువంటి సందేహాం లేదన్నారు. న్యూఎడ్యుకేషన్‌ పాలసీ `2020 లో ఎరైవల్‌ చైల్డ్‌ హుడ్‌ కేర్‌కి ఎంతో ప్రాధాన్యత ఇవ్వడం వలన మంచి సత్ఫలితాలు వస్తున్నాయని కలెక్టర్‌ తెలిపారు. కార్పొరేట్‌ స్కూల్‌లో కేవలం విద్యా బోదనకు మాత్రమే ప్రాధాన్యత ఇస్తారని అంగన్‌వాడీ కేంద్రాలలో అంగన్‌వాడీ టీచర్లు చిన్నారులతో మమేకమై వారితో కలిసి ఆడుతూ పాడుతూ చదువుపై ఆసక్తి కలిగించేలా కృషి చేస్తారన్నారు. అంగన్‌వాడీ నిర్వహణలో తల్లిదండ్రులు ప్రోత్సహాం సహకారం ఎంతో అవసరమన్నారు. అంగన్‌వాడీ టీచర్లు, కార్యకర్తలు, ఆశా కార్యకర్తలు ప్రభుత్వ లక్ష్యాలకు అనుగుణంగా సేవలందించి అంగన్‌వాడీ కేంద్రాలకు మరింత వన్నెతీసుకురావడం ద్వారా రాష్ట్రంలోనే మన జిల్లాను అంగన్‌వాడీల నిర్వహణలో అగ్రగామిగా నిలపాలని కోరారు.
స్త్రీ శిశు సంక్షేమ శాఖ ప్రిన్సిపల్‌ సెక్రటరి ఎ అనూరాధ మాట్లాడుతూ బాల్యం నుండి చిన్నారులపై పడే మంచి లక్షణాలే వారి భవిష్యత్‌ను ప్రభావితం చేస్తాయన్నారు. జీరో నుంచి 8 సంవత్సరాల లోపు శాస్త్రీయపరంగా ఎంత విజ్ఞానం అందిస్తే అంత ఫలితాలు పొందగలుగుతామన్నారు. అందుకే ప్రభుత్వం అంగన్‌వాడీ కేంద్రాల్లో పిపి`1, పిపి`2 ల ద్వారా వర్క్‌ బుక్‌ను రుపొందించి విద్యా బోదన అందిస్తున్నామన్నారు. బాల్య దశలోనే పిల్లలకు నేర్పించే విద్యాబుద్దులు వారి భవిష్యత్‌ను నిర్ణయిస్తుందన్నారు. ఈ దశలో తల్లిదండ్రులు పిల్లల పెంపకంపై ప్రత్యేక దృష్టి పెట్టాలన్నారు. పిల్లల ఎదుగుదలతోపాటు నడవడిక ప్రవర్తనను ఎప్పుడుకప్పుడు గమనించాలన్నారు.
ఆకుకూరలు, పండ్లు, గుడ్లు వంటి ఆరోగ్యవంతమైన పౌష్టిక ఆహారం అందింస్తే మానసిక వికాసానికి ఎంతో దోహదపడతాయన్నారు. అంగన్‌వాడీ కేంద్రాల వార్షికోత్సవాలను జరపాలనే ఆలోచన తీసుకువచ్చిన సబ్‌ కలెక్టర్‌ జి సూర్యసాయి ప్రవీణ్‌చంద్‌ను, ఆచరణలో పెట్టిన స్త్రీ శిశు సంక్షేమ శాఖ అధికారులను, సిబ్బందిని ప్రత్యేకంగా అభినందిస్తూన్నట్లు ప్రిన్సిపల్‌ సెక్రటరి అన్నారు.

ఆహుతులను అబ్బురపరచిన అంగన్‌వాడీ చిన్నారుల కళాప్రదర్శనలు
8 సంవత్సరలోపు అంగన్‌వాడీల చిన్నారులు అసతోమా సద్గమయ సరస్వతి నమస్తుభ్యం అంటూ ప్రార్థన గీతాలతో కళాప్రదర్శనలు ప్రారంభించి, ఉట్టిమీదకూడు ఉప్పుచాప తోడు అని, డుగుడుగు మని నీ బుల్లేట్టు బండి ఎక్కి వచ్చేదనా అంటూ, సారంగదరియా వంటి జానపద నృత్యాలు చేసి అమ్మని అనుకరించటం అమ్మకి వందనం బాల్య వివాహల పై లఘ ప్రదర్శనలు ఇచ్చి భారతనాట్యం, ఫ్యాన్సీ డ్రస్స్‌ ప్రదర్శనలు అహుతులను ఎంతగానో ఆలరించి మంత్రముగ్దులను చేశాయి. కార్యక్రమంలో స్థానిక శాసనసభ్యులు మల్లాదివిష్ణువర్థన్‌, సబ్‌ కలెక్టర్‌ జి. ఎస్‌ ఎస్‌ ప్రవీణ్‌చంద్‌, స్త్రీ శిశు సంక్షేమ శాఖ ప్రాజెక్టు డైరెక్టర్‌ జి.ఉమాదేవి, జిల్లాకు చెందిన సిడిపివోలు జి. మంగమ్మ, నాగమణి, రేణుక, గ్లోరి, సత్యవతి, లలిత, దీప్తి, అంగన్‌వాడీ సూపర్‌వైజర్లు కార్యకర్తలు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *