Breaking News

రక్తదానం చేస్తే మనిషికి ప్రాణదానం చేసినట్లే…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రక్తదానం చేస్తే మనిషికి ప్రాణదానం చేసినట్లేనని రక్తదానమనే పవిత్రమైన కార్యక్రమంలో యువత స్వచ్ఛందంగా ముందుకు వచ్చి రక్తదానం చేయడం అభినందనీయమని జిల్లా కలెక్టర్‌ యస్‌ డిల్లీరావు అన్నారు. రెడ్‌క్రాస్‌ డే సందర్భంగా శనివారం జిల్లా రెడ్‌క్రాస్‌ సోసైటీ సహకారంతో విజయవాడ పాతబస్తీలో గల పొట్టి శ్రీరాములు చలువాది మల్లికార్జునరావు ఇంజనీరింగ్‌ కళాశాలో ఎన్‌ఎస్‌ఎస్‌ యూనిట్‌ ఆధ్వర్యంలో నిర్వహించిన రక్తదాన శిభిరానికి జిల్లా కలెక్టర్‌ యస్‌డిల్లీరావు ముఖ్య అతిధిగా హాజరై రక్తదాన కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ అన్నిదానాలలో కన్నా రక్తదానం గొప్పదనే విషయాన్ని ప్రతీ ఒక్కరూ గుర్తించి రక్తదానం చేసేందుకు ముందుకు రావాలన్నారు. మనం ఒక సారి రక్తదానం చేస్తే మరొకరి ప్రాణాన్ని కాపాడుతుందన్నారు. మనం చేసే రక్తదానం అత్యవసర సమయంలో క్షతగాత్రులకు, ప్రాణాపాయ పరిస్థితుల్లో ఉన్న రోగుల ప్రాణాలు కాపాడేందుకు ఎంతో దొహదపడుతుందన్నారు. సకాలంలో రక్తం అందక అనేక మంది రోగులు మరణాలకు గురి అయిన సందర్భాలు ఉన్నాయన్నారు. సమాజం గురించి ఆలోచించాల్సిన భాధ్యత యువతపై ఉందన్నారు. ప్రపంచంలో ప్రముఖ వ్యక్తులైన బిల్‌గ్రేట్స్‌, రతన్‌ టాటా, అదిత్యబిర్లాల వంటి వారు ఉన్నత శిఖరాలు చేరుకున్నపట్టికి సమాజ సేవపై ఆలోచన చేసేవారన్నారు. వారిని ఆదర్శంగా తీసుకుని ప్రతీ వ్యక్తి కొంత సమయాన్ని సమాజ సేవకు వినియోగించాలన్నారు. ప్రతీ ఒక్కరూ మూడు నెలలకు ఒక సారి రక్త దానం చేయవచ్చునని, రక్తదానం చేయడం ద్వారా కొత్త రక్తం ఏర్పడి మరింత ఆరోగ్యవంతులవుతారన్నారు. విద్యార్థిని విద్యార్థులు రక్తదాన కార్యక్రమంలో పాల్గొన్ని ఇతరులకు స్పూర్తి దాయకంగా నిలవాలని జిల్లా కలెక్టర్‌ పిలుపు నిచ్చారు. జిల్లా ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సంస్థ ఆధ్వర్యంలో రక్తదాన శిభిరాలను నిర్వహించడమే కాకుండా బ్లెడ్‌బ్యాంకు ద్వారా ఆపదలో ఉన్న వారికి అవసరమైన రక్తాన్ని సకాలంలో అందించడం అభినందనీయమన్నారు. ప్రకృతి వైపరిత్యాలు, విపత్కర పరిస్థితులు సంభవించినప్పుడు ప్రజలకు సహాయ సహకారాలు అందించడంలో ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ సభ్యులు, ఎన్‌ఎస్‌ఎస్‌ వాలంటీర్ల సేవలు జిల్లా యంత్రాంగానికి ఎంతో దొహదపడుతున్నాయని అన్నారు. ‘‘రెడ్‌ క్రాస్‌ అంటేనే సేవ’’ ‘‘సేవ అంటే రెడ్‌ క్రాస్‌’’ అనే భావం ప్రజల్లో నాటుకుపోవడం సంస్థ అందిస్తున్న సేవలకు నిదర్శనమన్నారు. రక్త దాన శిభిరం నిర్వహిస్తున్న జిల్లా రెడ్‌క్రాస్‌ అధ్యక్షులు డా. జి సమరం, సహకరిస్తున్న కళాశాల యాజమాన్యాన్ని అభినందిస్తున్నానని కలెక్టర్‌ అన్నారు.
ఈ కార్యక్రమంలో ఇండియన్‌ రెడ్‌క్రాస్‌ ఎన్‌టిఆర్‌ జిల్లా అధ్యక్షులు డా. జి సమరం, కృష్ణాజిల్లా ఉపాధ్యక్షులు వి. శేషగిరిరావు, కళాశాల ప్రిన్సిపల్‌ శ్రీరామకృష్ణ, ఫ్యాకల్టిస్‌ శ్రీకాంత్‌రెడ్డి, నవీన్‌కుమార్‌, రెడ్‌క్రాస్‌ సోసైటీ ప్రతినిధులు సిహెచ్‌ శ్రీనివాస్‌రావు, సునీత, విద్యార్థిని విద్యార్థులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *