విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ యస్ డిల్లీరావు అధికారులను ఆదేశించారు. నగరంలోని భవానిపురం ఐరన్‌యార్డ్ వద్ద శనివారం హోమ్ మంత్రివర్యులు తానేటి వనిత బిటి రహదారుల ప్రారంభోత్సవ కార్యక్రమంలో పాల్గొన్న అనంతరం కలెక్టరేట్‌కు వస్తూ జిల్లా కలెక్టర్ యస్ డిల్లీరావు ప్రయాణంలోనే ేమున్సిపల్ కమీషనర్ స్వప్నిల్ దినకర్ పునకర్, సబ్ కలెక్టర్ జి. ఎస్‌ఎస్ ప్రవీణ్‌చంద్, కెసి డివిజన్ ఇఇ స్వరూప్ కుమార్, వియంసి ఇఇ ఏఎస్ ఎన్ ప్రసాద్, డిప్యూటి సీటీ ప్లానర్ జూబెన్, తూర్పు, సెంట్రల్ తహాశీల్థార్లతో కృష్ణా నదీ పరివాహక ప్రాంతంలో నిర్మిస్తున్న రిటైనింగ్ వాల్ నిర్మాణ పనుల ప్రగతిని గూగుల్ కాన్ఫరెన్స్ ద్వారా సమీక్షించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ రిటైనింగ్ వాల్ నిర్మాణ పనులను మరింత వేగవంతం చేయాలని ఆగస్టు మాసం నాటికి 6 మీటర్లు ఎత్తు గోడ నిర్మాణం పూర్తి చేయాలన్నారు. తద్వారా ప్రకాశం బ్యారేజ్ నుండి8 లక్షల క్యూసెక్కుల వరద నీరు దిగువకు విడుదలచేసినప్పటికి ఈ ప్రాంతంలో ఉంటున్న 30 వేల కుటుంబాలకు ఎటువంటి ముంపు సమస్య ఉండదన్నారు. అనంతరం మిగిలిన మొత్తం 8.9 మీటర్ల ఎత్తుతో కాంక్రీట్ గోడ నిర్మాణం పూర్తి చేసేలా లక్ష్యాన్ని నిర్థేశించుకోవాలన్నారు. కృష్ణానదీ పరివాహక ప్రాంతంలో సుమారు 123 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మిస్తున్న రిటైనింగ్ వాల్ పనులను ఇరిగేషన్, మున్సిపల్, రెవెన్యూ అధికారులు సమన్వయంతో ప్రాణాళికాబద్దంగా పూర్తి చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. 1.5 కిలో మీటర్ల పొడవున 8.9 మీటర్ల ఎత్తుతో కాంక్రీట్ గోడ నిర్మాణం చేపట్టడం జరిగిందన్నారు. 3 అడుగుల వ్యాసంతో 18 మీటర్ల లోతుతో ఫైల్ రాఫ్ట్ పునాదులపైన 2.5 మీటర్ల వెడల్పు 8.9 మీటర్ల ఎత్తున, 1.5 కిలో మీటర్ల పోడవున ఈ కాంక్రీట్ గోడ నిర్మాణం ఇప్పటి వరకు 65 శాతం వరకు పనులు పూర్తి అయిన్నట్లు ఆయన తెలిపారు. మిగిలిన పనులు ఆగస్టు మాసాంతానికి రిటైనింగ్ వాల్ నిర్మాణం పూర్తి చేసేలా ప్రణాళికబద్దంగా పనులను మరింత వేగవంతం చేయాలని అధికారులను కలెక్టర్ డిల్లీరావు గూగుల్ కాన్ఫరెన్స్ ద్వారా ఆదేశించారు.
Prajavartha Online Telugu News