-అధికారుల సమన్వయంతో రోడ్డు ప్రమాదాలను అరికట్టండి..
-నిబంధనలు పాటించని వాహనదారులకు జరిమానాలు విధించండి..
-జిల్లా కలెక్టర్ యస్ డిల్లీరావు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రోడ్డు ప్రమాదాల నివారణకు పటిష్టమైన కార్యాచరణ రూపొందించుకొని అమలు చేయాలని, అధికారులు సమన్వయంతో రోడ్డు ప్రమాదాలను ఆరికట్టేందుకు కృషి చేయాలన్నారు. నిబంధనలను పాటించని వాహనదారులపై జరిమానాలు విధించండంలో వెనకాడవద్దని జిల్లా కలెక్టర్ యస్ డిల్లీరావు అన్నారు. రహదారి భద్రతలో భాగంగా జిల్లాలో రోడ్డు ప్రమాదాల నివారణపై శనివారం కలెక్టర్ కార్యాలయం నుండి నేషనల్ హైవే అధికారులు, రవాణా శాఖ అధికారులు, పోలీస్‌లు, ఆర్‌అండ్‌బి అధికారులతో జిల్లా కలెక్టర్ యస్ డిల్లీరావు జూమ్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఇటీవల కాలంలో కంచికచర్ల మండలంలోని పరిటాల, నందిగామ మండలంలోని నందిగామ, కీసర వంటి ప్రాంతాలలో తరచూ రోడ్డు ప్రమాదాలు జరుగుతున్నాయని ఇటువంటి ప్రాంతాలలో అధికారులు ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. బ్లాక్‌జోన్ పై ప్రమాద నివారణ చర్యలలో భాగంగా ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. గత మూడ నెలల కాలంలో జాతీయ రహదారి నెంబరు 16లో కనకదుర్గమ్మ వారది ` గూడవల్లి ల మధ్య 16 రోడ్డు ప్రమాదాలు జరిగి 17 మంది మరణించడం జరిగిందన్నారు. జాతీయ రహదారి నెంబరు 30లో తిరువూరు ` ఇబ్రహీంపట్నం మధ్య 12 రోడ్డు ప్రమాదాలు జరిగి 14 మంది మరణించడం జరిగిందన్నారు. జాతీయ రహదారి నెంబరు 65 లో విజయవాడ ` జగ్గయ్యపేటల మధ్య 19 రోడ్డు ప్రమాదాలు జరిగి 20 మంది మరణించడంతో పాటు ఇతర రహదారులో అనేక మంది క్షతగాత్రులయ్యారన్నారు. వీటిని నివారించవలసిన భాధ్యత ట్రాస్స్‌పోర్టు, పోలీస్ అధికారులపై ఉందన్నారు. వాహనాల వేగాన్ని నియంత్రించడం, మద్యం సేవించి వాహనాలు నడిపే డ్రైవర్లను గుర్తించి వారి లైసెస్స్‌లను స్వాధీనం చేసుకుని జరినామాలు విధించాలన్నారు. ట్రాస్స్‌పోర్టు అధికారులు ఎప్పటికప్పుడు వాహనాలను తనిఖీ చేసి కాలం చెల్లిన వాహనాలు రోడ్లపై తిరగకుండా సీజ్ చేయాలన్నారు. రహదారులను కలిపే జంక్షన్‌ల వద్ద సిగ్నిల్ వ్యవస్థ ఏర్పాటు, జీబ్రా లైస్స్, స్పీడ్ బేకర్స్, హెఛ్చరిక బోర్డులు తప్పనిసరిగా ఏర్పాటు చేయాలన్నారు. వాహనా చోదకులకు ఎదురుగా వచ్చే వాహన కాంతి కళ్లపై పడకుండా జాతీయ రహదారి మధ్య నిర్మించిన రోడ్డు డివైడర్‌లలో మొక్కలు నాటి సంరక్షించేలా నేషనల్ హైవే అధికారులు చర్యలు తీసుకోవాలన్నారు. ట్రాఫిక్, డ్రైవింగ్ నిబంధనలు, హెల్మెట్ వాడకం, రోడ్డు ప్రమాదాలకుగల కారణాల పై కళాశాల విద్యార్థులకు, డ్రైవర్లకు అవగాహన కార్యక్రమాలు నిర్వహించి చైతన్యవంతులను చేయాలని కలెక్టర్ డిల్లీరావు పేర్కొన్నారు. జూమ్ కాన్ఫరెస్స్‌లో నందిగామ శాసనసభ్యులు మొండితోక జగన్మోహన్‌రావు, నేషనల్ హైవే పిడి నారాయణరావు, డిటిసి పురేంద్ర, ఆర్ అండ్ బి ఎస్ ఇ శ్రీనివాస్‌మూర్తి, పోలీస్ ఉన్నతాధిóకారులు, రెవెన్యూ అధికారులు తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News