Breaking News

సబ్ కలెక్టర్ కార్యాలయంలో స్పందన కార్యక్రమం…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రతీ సోమవారం నిర్వహించే స్పందన కార్యక్రమాన్ని నగరంలోని సబ్ కలెక్టర్ కార్యాలయంలో నిర్వహించడం జరుగుతుందని విజయవాడ సబ్ కలెక్టర్ జి. ఎస్. ఎస్ ప్రవీణ్ చంద్ తెలిపారు. ప్రజా సమస్యల పరిష్కార వేదిక స్పందన కార్యక్రమాన్ని సోమవారం మాంటిస్సోరి మహిళా కళాశాల వద్దగల సబ్ కలెక్టర్ కార్యాలయంలో ఉదయం 10.00 గంటలనుండి నిర్వహించడం జరుగుతుందని సబ్ కలెక్టర్ జి ఎస్ ఎస్ ప్రవీణ్ చంద్ తెలిపారు. ప్రజలు తమ సమస్యలను వినతిపత్రం రూపంలో సమర్పించవచ్చునని సబ్ కలెక్టర్ అన్నారు. ప్రతీ వారం స్పందన కార్యక్రమాన్ని విజయవాడ డివిజన్ పరిధిలోని ప్రతీ మండలంలోని ప్రధాన గ్రామంలో ఒక్కొక్క సోమవారం నిర్వహించడం జరుగుతుందని దీనిలో భాగంగానే స్పందన కార్యక్రమాన్ని విజయవాడలో నిర్వహిస్తున్నట్లు సబ్ కలెక్టర్ జిఎస్ఎస్ ప్రవీణ్ చంద్ తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *