విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
భగీరథ మహర్షి పట్టుదలను నేటి యువత స్ఫూర్తిగా తీసుకోవాలని జిల్లా కలెక్టర్ యస్ డిల్లీ రావు అన్నారు. భగీరథ మహర్షి జయంతిని పురష్కరించుకుని ఆదివారం స్థానిక కలెక్టర్ బంగ్లా సమావేశ మందిరంలో భగీరథుని చిత్రపటానికి కలెక్టర్ డిల్లీ రావు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పట్టుదలకు, త్యాగానికి మారు పేరు భగీరథుడు అని అన్నారు. భగీరథుడు మహా జ్ఞాని అని పరోపకారానికి పెట్టింది పేరు అని అన్నారు.దీక్షకు, సహనానికి ప్రతిరూపం భగీరథుడుఅని ఎంత కష్టాన్నయినా లెక్కచేయకుండా, అనుకున్నది సాధించేవారిని అన్నారు.భగీరథుడు ఎంతో కష్టపడి దివి నుండి గంగను భువికి తీసుకొచ్చిన మహనీయుడు అని కలెక్టర్ పేర్కొన్నారు. నీటి కొరతతో ఇబ్బంది పడుతున్న సమస్థ ప్రాణికోటి కష్టాలు తీర్చిన మహనీయుడు భగీరథ మహర్షి అని కలెక్టర్ డిల్లీ రావు అన్నారు. ఎవరైనా కఠోర పరిశ్రమ చేసి దేన్నయినా సాధిస్తే భగీరథ ప్రయత్నం చేశారని చెప్పుకుంటారని అన్నారు. కృత యుగం నుండి నేటి కలియుగం వరకు ఎవరైనా ఏదైనా పని సాధించే విషయంలో పట్టు వదలకుండా విజయం సాధించిన వారిని భగీరథుని పేరుతో కీర్తిస్తారని కలెక్టర్ డిల్లీ రావు అన్నారు. జిల్లా వెనుకబడిన తరగతుల సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఆశాఖ డిప్యూటీ డైరెక్టర్ సిహెచ్. లక్ష్మీదుర్గ, ఆ శాఖకు చెందిన అధికారులు సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News