Breaking News

సంక్షేమానికి అహర్నిశలు శ్రమిస్తున్న ముఖ్యమంత్రి జగన్మోరెడ్డి : దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం పారదర్శకంగా అర్హులైన ప్రతి ఒక్కరికి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేస్తున్న అభివృద్ధి చూసి ఓర్వలేక ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి కి ప్రజలలో పెరుగుతున్న ఆదరణ ను తట్టుకోలేక అక్కసుతో నే ప్రతిపక్షాలు అసత్య ప్రచారాలు చేస్తూ ప్రజలలో అపోహలు సృష్టిస్తున్నారని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ విమర్శించారు. శుక్రవారం గడప గడపకు వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమంలో భాగంగా 20 డివిజన్ లో రణధీర్ నగర్ కరకట్ట ప్రాంతంలో స్థానిక కార్పొరేటర్, రాష్ట్ర కాపు కార్పొరేషన్ ఛైర్మన్ అడపా శేషు తో కలిసి ఇంటి ఇంటికి వెళ్లిన అవినాష్ ప్రభుత్వం చేస్తున్న సంక్షేమం,అభివృద్ధి గురుంచి ప్రజలకు వివరించారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ వైసీపీ నాయకులు వస్తుంటే ప్రజలు ఎదురొచ్చి మరి స్వాగతం పలుకుతున్నారని ప్రభుత్వ పాలన మీద ప్రజలు ఎంత సంతృప్తి గా ఉన్నారో అర్థం అవుతుంది అని సంతోషం వ్యక్తం చేశారు. ఇప్పుడు ఎన్నికలు లేవని, ఎన్నికల సమయం కాదని, స్థానిక ప్రజల సమస్యలను తెలుసుకుని వీలు అయినంత త్వరలో పరిష్కరిరం చూపేందుకే ప్రజల మధ్యకి వస్తున్నాం అని స్పష్టం చేశారు. కృష్ణలంక కరకట్ట ప్రాంత వాసులు కు గత తెలుగేదేశం పార్టీ ప్రభుత్వం పట్టించుకోకుండా షో రాజకీయాలు చేసారు అని ఎద్దేవా చేసారు. మా జగన్మోన్ రెడ్డి ప్రభుత్వం లో నిత్యం ప్రజలలో ఉంటూ,ప్రతి చివర గడప వరుకు అభివృద్ధి కార్యక్రమాలు చేపడుతున్నాం అని అన్నారు. తూర్పు నియోజకవర్గ ప్రజలు ఏదైనా సమస్యలుంటే మా కార్యాలయాల్లో అందజేయాలని సూచించారు. వెంటనే సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని స్పష్టం చేశారు. ప్రతిపక్ష టీడీపీ నేతలు అసత్యాలు ప్రచారం చేస్తూ నీచ రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. వాటిని తిప్పికొడుతూ ప్రజలకు వాస్తవాలు వివరించి పార్టీని ప్రజలకి మరింత చేరువ చేయడానికె ఈ గడప గడప వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్యక్రమం చేపతిన్నట్టు తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, వైస్సార్సీపీ నాయకులు షేక్ సుబాని, మాజీ కార్పొరేటర్ పల్లెం రవి, మాజీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ మీర్ హుస్సేన్, గొల్లపూడి మార్కెట్ యార్డ్ డైరక్టర్ విజయలక్ష్మి, స్టాండింగ్ కమిటీ మెంబర్లు అంబేద్కర్, డివిజన్ నాయకులు పుప్పాల రాజా, మల్లి, కొప్పుల వెంకట్,రఫీ, శాస్త్రి, సాయి మరియు వైస్సార్సీపీ ముఖ్య నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *