Breaking News

చారిత్రాత్మక రైల్వే సమ్మెకు 48 ఏళ్ళు…


విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
1974 మే 08, రైల్వే కార్మికులకు బోనస్ ను సాధించి పెట్టిన సమ్మె మొదలైన రోజు , కార్మికోద్యమాలలో సువర్ణాక్షరములతో లిఖించబడిన సమ్మె. ఆల్ ఇండియా రైల్వే మెన్ ఫెడరేషన్ ఆధ్వర్యంలో 1974 లో జరిగిన రైల్వే సమ్మె రైల్వే కార్మికులకు బోనస్ ను అందించింది. క్యాజువల్ లేబర్ రద్దు, DA ఫార్ములా వంటి ఎన్నో కార్మికుల డిమాండ్స్ కు పరిష్కారం లభించింది. ఈ సమ్మె ఫలితాల వెనుక నలుగురు రైల్వే ఉద్యోగుల ప్రాణ త్యాగం , 10,329 ఉద్యోగుల ఉద్వాసన మరియు వేల కొలది రైల్వే కార్మికుల అరెస్టులు వున్నాయి. జార్జ్ ఫెర్నాండేజ్ నేతృత్వములోని రైల్వే కార్మికులు ప్రభుత్వ దమన నీతికి ఎదురొడ్డి నిలిచి సాధించిన ఫలాలు ఈ రోజు రైల్వే కార్మికులు అనుభవిస్తున్నారు. వారి పోరాటాలను స్మరిస్తూ నేటి కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై పోరాటాన్ని ప్రకటిస్తూ సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ రైల్వే మజ్దూర్ యూనియన్ జోన్ వ్యాప్తముగా ఈ రోజు అన్ని రైల్వే కార్యాలయముల ముందు ప్రదర్శనలు నిర్వహించటం జరిగింది. అమర వీరుల త్యాగాలను ప్రస్తుతిస్తూ, నేడు రైల్వే కార్మికులు ఎదుర్కొంటున్న సమస్యలపై సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ నేతృత్వములో కార్మికులు సమర శంఖం పూరించారు. ఈ సందర్భముగా సౌత్ సెంట్రల్ రైల్వే మజ్దూర్ యూనియన్ డివిజనల్ సెక్రటరీ జీ ఎన్ శ్రీనివాసరావు మాట్లాడుతూ ఏక పక్షముగా అమలుకు ప్రతిపాదించిన నాలుగు లేబర్ కోడ్ లను రద్దు చేయాలని ,రైల్వే కార్మికులందరికి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని ,కరోనా సమయములో 18 నెలలపాటు నిలిపి వేసిన DA ను రైల్వే కార్మికులకు, పెన్షనర్లకు తిరిగి చెల్లించాలని, నైట్ డ్యూటీ లు చేసిన అందరికీ నైట్ డ్యూటీ అలవెన్సును చెల్లించాలని,సీనియర్ సూపెర్వైజర్ లకు 4800, 5400 గ్రేడ్ పే చెల్లించాలని,10, 20 ,30 సంవత్సరాలు పూర్తీ చేసిన వారందిరికి MACP అమలు చేయాలని, సేఫ్టీ విభాగములో పని చేసే అందరికి రిస్క్ అలవెన్సులు చెల్లించాలని, యూనిఫామ్ అలవెన్సు అందరికి ఇవ్వాలని, ఇంటర్ డివిజన్ మరియు ఇంటర్ రైల్వే ట్రాన్స్ఫర్లు వెంటనే పూర్తీ చేయాలని , ఎనిమిది గంటల పని విధానాన్న్ని అన్ని విభాగాలలో అమలు చేయాలని , మాన్ పవర్ ప్లానింగ్ క్రింద ప్రతి ఏటా 1% పోస్టులు సరెండర్ ఆపాలని డిమాండ్ చేశారు.ఈ కార్యక్రమాలలో గూడూరు నుంచి అనకాపల్లి వరకు వున్న అన్ని రైల్వే కార్యాలయముల ముందు పెద్ద సంఖ్యలో రైల్వే కార్మికులు నిరసన తెలిపి ఈ కార్యక్రమము విజయవంతం చేసారని ఈ సందర్భముగా జోనల్ వైస్ ప్రెసిడెంట్ శ్రీమతి లీల గారు పేర్కొన్నారు. రైల్వే ఉన్నతాధికారులు వెంటనే స్పందించి రైల్వే కార్మికుల న్యాయమైన కోర్కెలను తీర్చనట్లయితే ఈ పోరాటం తీవ్ర తరం చేస్తామని డివిజనల్ సెక్రటరీ శ్రీనివాస రావు హెచ్చరించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *