Breaking News

కలెక్టర్ ను కలిసిన అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ తూర్పు నియోజకవర్గంలో పెండింగులో ఉన్న అభివృద్ధి పనులు త్వరితగతిన పూర్తి చేయడానికి తగు చర్యలు తీసుకోవాలని, అదేవిధంగా రిటైనింగ్ వాల్ నిర్మాణం వలన 16,17,18 డివిజన్లలో నిరాశ్రయులయిన వారికి తక్షణమే నూతన ఇండ్లు మంజూరు చేసి అందజేయాలని ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఢిల్లీరావు ను కోరినట్లు నియోజకవర్గ వైస్సార్సీపీ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు.సోమవారం కలెక్టర్ క్యాంప్ కార్యాలయంలో మర్యాదపూర్వకంగా కలిసిన అవినాష్ ఈ మేరకు వినతిపత్రం అందజేశారు. సానుకూలంగా స్పందించిన కలెక్టర్ గారు వీలైనంత త్వరగా క్షేత్రస్థాయిలో పర్యటించి సమస్యల పరిష్కారానికి కృషి చేస్తానని తెలిపినట్లు చెప్పారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ,ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ, కార్పొరేటర్ తంగిరాల రామిరెడ్డి పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *