Breaking News

ఉన్నత విద్యాతోనే పేదరిక నిర్మూలన సాధ్యం… : దేవినేని అవినాష్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్రా లయోలా ఇంజనీరింగ్ కాలేజ్ లో తూర్పు నియోజకవర్గ వ్యాప్తంగా ఏర్పాటు చేసిన జగనన్న విద్యాదివేన కార్యక్రమంలో పాల్గొన్న తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ ఇంచార్జి దేవినేని అవినాష్,డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ, కాపు కార్పొరేషన్ ఛైర్మెన్ అడపా శేషు, స్టాండింగ్ కమిటీ మెంబెర్స్ కలపాలా అంబెడ్కర్, నియోజకవర్గ కార్పొరేటర్లు, ఇంచార్జిలు తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా అవినాష్ మాట్లాడుతూ పేద విద్యార్థులు కూడా ఉన్నత చదువులు చదవాలన్న లక్ష్యం తో మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పనిచేస్తుంది అని, ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి కేవలం ఉన్నతమైన చదవుల వల్లనే పేదరికాన్ని నిర్మూలించడం సాధ్యమని,అందుకే అధికారంలోకి వచ్చిన తర్వాత విద్యార్థులు పట్ల వారి చదువు పట్ల అన్ని రకాలుగా భాద్యతలు తీసుకోవడం జరుగుతుంది అని అన్నారు. అలాగే మన తూర్పు నియోజకవర్గ పరిధిలో 5,690 మంది విద్యార్థులకు 4 కోట్ల 87 లక్షల 16 వేల రూపాయల నగదు తల్లుల ఖాతాలో ఎటువంటి రాజకీయ ప్రమేయం ఎటువంటి దళారీ విధానానికి తావులేకుండా జమ చేయడం జరిగింది అని తెలియజేసారు. ఐటిఐ, పాలిటెక్నిక్, డిగ్రీ, ఇంజనీరింగ్ ఇలా ఏవిధమైన ఉన్నత కోర్సులకు సంబంధించిన ఫీజుల ను ఆ సంవత్సరం ముగిసిన వెంటనే క్రమం తప్పకుండా విద్యార్థులు తల్లిదండ్రులు ఎకౌంటు లో నేరుగా జమ చేయడం జరుగుతుంది,గత ప్రభుత్వం హయాంలో విద్యార్థుల ఫీజులు చెల్లించక యాజమాన్యాలు రోడ్లు ఎక్కి నిరసనలు వ్యక్తం చేసే దుస్థితి అని, కానీ జగన్ మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి అయిన తర్వాత గత ప్రభుత్వం బాకయిలు రూ.1778 కోట్ల తో పాటు,ఇప్పటి వరకు జగనన్న విద్యాదీవేన,జగనన్న వసతి దీవెన కింద రూ.10,994 కోట్ల రూపాయలు కేవలం ఒక బటన్ నొక్కి ముఖ్యమంత్రి  అందచేయడం జరిగింది అని, దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా విద్యార్థులకు మేలు చేస్తున్న ఏకైక ప్రభుత్వం మనదే అని, జగనన్న విద్యాదీవెన,వసతి దీవెన పధకాలలో ఎటువంటి లిమిట్స్ లేవని ఇంట్లో ఎంత మంది పిల్లలు ఉంటే అంతమంది కి పూర్తి ఫీజు రియంబర్స్ మెంట్ వర్తిస్తుంది అని,అలాగే వసతి దీవెన కింద భోజన,వసతి ఖర్చులు కింద రూ.20000 లు ఇవ్వడం జరుగుతుంది అని, ఈ త్రైమాసిక ఏడాది లో ఈ పధకం కింద రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 10.85 లక్షల మంది విద్యార్థులకు నేరుగా తమ తల్లుల ఖాతాలో రూ.709 కోట్ల రూపాయలు జమ చేయడం జరిగింది అని అన్నారు. మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్రంలో చదువుకునే ప్రతి విద్యార్థికి జగనన్న విద్య దీవెన పథకం ద్వారా ప్రతి ఒక్క తల్లుల ఖాతాలో విద్య దీవెన అమౌంట్ జమచెయ్యబడుతున్నాయని, కరోనా ను సైతం లెక్క చేయకుండా సంక్షేమ కార్యక్రమాలు నిర్వహించడం ఒక జగన్ గారికే చెల్లిందని, మిగులు బడ్జెట్ రాష్ట్రాల్లో సైతం కరోనా కి విలవిలాడిన పరిస్థితులు చూసామని కానీ ఎక్కడ మన రాష్ట్రంలో సంక్షేమం అభివృద్ధి కార్యక్రమాలు ఆగలేదని అని తెలియజేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *