Breaking News

నివాసాలలో ఉత్త్పతి అగు చెత్తను వేరు చేసి విధిగా చెత్త సేకరణ సిబ్బందికి అందించాలి…

-21వ డివిజన్ లో స్థానిక సమస్యల పరిశీలన 
-కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్‌,

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరపాలక కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్‌, క్షేత్ర స్థాయి పర్యటనలో భాగంగా సోమవారం తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్  దేవినేని అవినాష్, డిప్యూటీ మేయర్  బెల్లం దుర్గ, 20వ డివిజన్ కార్పొరేటర్ అడపా శేషు లతో కలసి డివిజన్ పరిధిలోని పలు విధులలో ప్రజలు ఎదుర్కోను సమస్యలను పరిశీలించి సత్వరమే వాటిని పరిష్కరించుటకు తగిన చర్యలు తీసుకుంటామని అన్నారు. డివిజన్ పరిధిలోని APSRM హై స్కూల్ నందలి వాకింగ్ ట్రాక్, నాడు నేడు క్రింద పాఠశాలలో చేపట్టవలసిన నిర్మాణ పనులు, సచివాలయ భవన నిర్మాణం, అర్బన్ హెల్త్ సెంటర్ నందు వైద్య సేవల మెరుగుదల వంటి అంశాలతో పాటుగా డివిజన్ పరిధిలోని ప్రజలకు ఎదురౌతున్న పలు సమస్యలను దేవినేని అవినాష్ కమిషనర్ కు వివరించారు.

డివిజన్ ప్రజలు ఎదుర్కోను సమస్యలను సత్వరమే పరిశీలించుటకు తగిన చర్యలు తీసుకుంటామని, పాడైన డ్రెయిన్లకు కూడా తగిన మరమ్మత్తులు నిర్వహించుట జరుగుతుందని అన్నారు. ప్రదానం పారిశుధ్య నిర్వహణకు సంబందించి ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం క్లాప్ ప్రోగ్రామ్ క్లీన్ ఆంధ్రప్రదేశ్ కార్యక్రమములో భాగంగా నగరపాలక సంస్థ ఇంటింటి చెత్త సేకరణ జరుగుతుందని దీనితో పాటుగా నేరుగా సి.ఎన్.జీ వాహనముల ద్వారా విధులలో ఇళ్ళ నుండి చెత్తను సేకరిస్తున్నట్లు వివరిస్తూ, ప్రజలు తమ నివాసాలలో ఉత్పత్తి అగు చెత్తను తడి మరియు పొడి చెత్తగా వేరు చేసి మీ ఇంటికి వచ్చు చెత్త సేకరణ సిబ్బందికి అందించాలని అన్నారు. అట్లు కాకుండా చెత్తను డ్రెయిన్ లలో పడవేయుట వలన డ్రెయిన్ నందు మురుగునీటి పారుదలకు తీవ్ర అవరోధం ఏర్పడి పారిశుధ్య ఇబ్బందులకు గురగుతుందని, ప్రజలు చెత్త డ్రెయిన్లలో లేదా రోడ్లపై ఎక్కడపడితే అక్కడ చెత్త పడవేయకుండా నగరపాలక సంస్థ వారితో సహకరించాలని కమిషనర్ అన్నారు.

ప్రతి రోజు ఉదయం క్షేత్ర స్థాయిలో డివిజన్ పర్యటనలో ప్రజల సమస్యలను కమిషనర్ గారు స్వయంగా పరిశీలించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవటం అభినందనియమని, ఈ ప్రాంతములలో వివరించిన సమస్యలపై స్పందించి వాటి పరిష్కారానికి చర్యలు తీసుకోవలసినదిగా సంబందిత అధికారులకు ఆదేశాలు ఇవ్వటం జరిగిన దానిపై హర్షం వ్యక్తం చేస్తూ, నగర అభివృద్ధికి తోడ్పాటు అందిస్తామని తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ అన్నారు.

పర్యటనలో కార్పొరేటర్లు కలపాల అంబేద్కర్, చీఫ్ మెడికల్ ఆఫీసర్ డా.జి.గీతబాయి, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ చంద్ర శేఖర్, జోనల్ కమిషనర్ డా.రవిచంద్, హెల్త్ ఆఫీసర్ డా.ఇక్బాల్ హుస్సేన్ మరియు ఇతర అధికారులు సిబ్బంది స్థానికులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *