-సబ్ కలెక్టర్ జి.ఎస్ఎస్ ప్రవీణ్‌చంద్
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
స్పందనలో ఆర్జీదారుల నుండి స్వీకరించిన ధరఖాస్తులను నిర్ణీత గడువులోగా పరిష్కరించేలా చర్యలు తీసుకుని నివేదికలు సమర్పించాలని సబ్ కలెక్టర్ జి. సూర్యసాయి ప్రవీణ్‌చంద్ సంబంధిత అధికారులను ఆదేశించారు. సోమవారం నిర్వహించిన స్పందన కార్యక్రమంలో భాగంగా సబ్ కలెక్టర్ కార్యాలయంలో వివిధ సమస్యల పరిష్కరం కోసం ఆర్జీదారులు సమర్పించిన వినతులను సబ్ కలెక్టర్ జి ఎస్ ఎస్ ప్రవీణ్చద్ స్వీకరించారు. అనంతరం అధికారులతో మాట్లాడుతూ స్పందన ఆర్జీలను నిర్ణీత గడువులోగా పరిష్కరించాలని సంబంధిత అధికారులను ఆదేశించారు. స్పందనలో వివిధ సమస్యల పరిష్కారానికి 25 ఆర్జీలు అందాయని సబ్‌కలెక్టర్ తెలిపారు. వీటిలో రెవెన్యూ 9, పిఎల్‌సిఎఫ్ 7, వివిధ శాఖలకు సంబంధించి 9 సమస్యలపై ఆర్జీలు స్పందన ద్వారా అందాయన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్జీలకు సంబంధించి సంబంధిత శాఖల అధికారులు గడువులోగా పరిష్కారం చూపాలని, పరిష్కారం కాని వాటికి తగిన కారణాలను ఆర్జీదారులకు తెలపాలని సబ్ కలెక్టర్ అన్నారు. ఆర్జీలను క్షుణంగా పరిశీలించి పరిష్కరించే విధంగా అధికారులు దృష్టి పెట్టాలన్నారు. ఈ కార్యక్రమంలో వివిధ శాఖలకు చెందిన అధికారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News