Breaking News

బంగారం దొంగతనం పై దేవాదాయ శాఖ మంత్రి కొట్టు సత్యనారాయణ, ఎండోమెంట్ కమిషనర్ తక్షణమే స్పందించాలి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జనసేన పార్టీ రాష్ట్ర అధికార ప్రతినిధి విజయవాడ నగర అధ్యక్షులు మరియు పశ్చిమ నియోజకవర్గ ఇన్చార్జి పోతిన వెంకట మహేష్ ఈ రోజు తన కార్యాలయం నుంచి విడుదల చేసిన వీడియోలో స్పందిస్తూ బెజవాడ కనకదుర్గమ్మ ఆలయం లో నిన్న హుండీల లెక్కింపు లో భక్తులు సమర్పించిన బంగారాన్ని మాయం చేసిన వ్యక్తుల పై EO భ్రమరాంబ పోలీస్ కంప్లైంట్ ఎందుకు పెట్టలేదని, పోలీస్ శాఖ వారికి ఫిర్యాదు చేయకపోతే అమ్మవారి భక్తుల మనోభావాలను వమ్ము చేసినట్లేనని, సెక్యూరిటీ సంస్థకు చెందిన ఒక ఉద్యోగి బంగారాన్ని మాయం చేసి బాత్రూం లో దాచారని, ఇప్పటికే అనేకమంది దేవాలయంపైన చర్చించుకుంటున్నారని, ఎస్ పి ఎఫ్ పోలీస్ వారు బాత్రూం లో దాచి ఉంచిన బంగారాన్ని కనిపెట్టి EO భ్రమరాంబ కి అందజేశారని, అయినప్పటికీ పోలీస్ శాఖ వారికి ఎందుకు ఫిర్యాదు చేయలేదో EO  సమాధానం చెప్పాలని, ఇటువంటి ఘటనలు వలన ఆలయ ప్రతిష్ట దిగజారుతున్న దేవాదాయ శాఖ మంత్రి సత్యనారాయణ, ఎండోమెంట్ కమిషనర్ ఎందుకు స్పందించడం లేదని, హుండీల లెక్కింపు లో భాగంగా 12 తులాల 10 లక్షల విలువ గలిగిన బంగారం మాయం చేసిన నా వ్యక్తులపై కేసు పెట్టకుండా ఎందుకు జాప్యం చేస్తున్నారో ఈఓ సమాధానం చెప్పాలని డిమాండ్ చేస్తూ, ఆలయంలో మరొకసారి మ్యాక్స్ సెక్యూరిటీ సంస్థ డొల్లతనం బయటపడిందని, గతంలో కూడా ఈ సంస్థ యొక్క పనితీరు వల్లనే మూడు సింహాలు మాయమయ్యాయి అని, ఈ సంస్థ కు నిబంధనలకు విరుద్ధంగా నేటికీ టెండర్ ఎందుకు కొనసాగిస్తున్నారో దేవాదాయ శాఖ అధికారులు సమాధానం చెప్పాలని, స్థానిక ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్ ఒత్తిడి వల్లనే ఈ సంస్థకు టెండర్ లేకపోయినా కాంట్రాక్టు కొనసాగిస్తూన్నారని, ఈ సంస్థ పై దేవాదాయ శాఖ అధికారులు తక్షణమే టెండర్ రద్దు చేసి, బ్లాక్ లిస్టులో పెట్టాలని, స్థానిక ఎమ్మెల్యే వెలంపల్లి శ్రీనివాస్ మాక్స్ సంస్థను కొనసాగించాలని దేవాదాయ శాఖ అధికారులపై ఒత్తిడి చేయడం వాస్తవం కాదాని, స్థానిక ఎమ్మెల్యే ఒత్తిడికి లోనైతే అమ్మవారి ఆలయ ప్రతిష్ట దిగజారడం ఖాయమని, ఇటువంటి ప్రజాప్రతినిధుల ఒత్తిడికి లోను కావద్దని, భక్తుల మనోభావాలను ఆలయ ప్రతిష్టను కాపాడడాం కోసం జనసేన పార్టీ మరియు జనసేన పార్టీ అమ్మవారి ధార్మిక సేవ మండలి ఎప్పుడూ అందుబాటులో ఉంటాయని తెలియజేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *