Breaking News

‘నాడు-నేడు’పాఠశాలలు జాతికి అంకితం చేసిన ఎమ్మెల్యే పేర్ని నాని

మచిలీపట్నం, నేటి పత్రిక ప్రజావార్త :
నాడు-నేడు కార్యక్రమాల్లో భాగంగా ప్రభుత్వ పాఠశాలలు సర్వాంగ సుందరంగా రూపుదిద్దుకొన్నాయని, చదువుల్లో నాణ్యత ప్రమాణాలను పెంపొందించి అంతర్జాతీయ స్థాయిలో మన విద్యార్థులు రాణించేలా ప్రభుత్వం కార్యాచరణ రూపొందించిందని మాజీ మంత్రి, మచిలీపట్నం శాసన సభ్యులు పేర్ని వెంకట్రామయ్య ( నాని ) పేర్కొన్నారు. మనబడి నాడు- నేడు కార్యక్రమంలో భాగంగా ఫేజ్-1 కింద అభివృద్ధి చేసిన పాఠశాలలను మంగళవారం జాతికి అంకితం చేసే కార్యక్రమంలో ముఖ్య అతిధిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, రాష్ట్ర అభివృద్ధి విద్యతోనే ముడిపడి ఉందని గుర్తించిన ముఖ్యమంత్రి విద్యకు పెద్దపీట వేస్తున్నారని చెప్పారు. మనబడి నాడు- నేడు కార్యక్రమం ద్వారా పాఠశాలల రూపురేఖలను ముఖ్యమంత్రి జగన్మోహన్రెడ్డి మార్చుతున్నారని, కార్పొరేట్ పాఠశాలలకు దీటుగా అన్ని సౌకర్యాలు కల్పించారన్నారు. మన బడి –నాడు నేడు స్కీమ్ 2019-20 నుంచి ప్రారంభం అయ్యిందని మూడేళ్ల వ్యవధిలో దశల వారీగా పాఠశాలల్లో మౌలిక సదుపాయాలను ఏర్పాటు చేస్తారని వివరించారు.పంచాయత్ రాజ్, మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్, సాంఘిక సంక్షేమం, బీసీ సంక్షేమం, గిరిజన సంక్షేమం, మైనారిటీ సంక్షేమం, జువైనల్ వెల్ఫేర్, ఫిషరీస్ డిపార్ట్మెంట్లు అన్ని మేనేజ్మెంట్లు నిర్వహిస్తున్న (రెసిడెన్షియల్ పాఠశాలలు సహా) మొత్తం 44,512 స్కూళ్లను ఈ ప్రాజెక్ట్ కవర్ చేస్తుందని ఫేజ్-1లో 15,715 పాఠశాలలలో ఈ కార్యక్రామాన్ని అమలు చేశారన్నారు. ప్రభుత్వం దాదాపు రూ. 3700 కోట్లు ఖర్చు చేసిందని ఎమ్మెల్యే పేర్ని నాని వివరించారు.
మచిలీపట్నం రైల్ పేట లోని స్పెషల్ మునిసిపాలిటీ అప్పర్ ప్రైమరీ పాఠశాలకు 25. 01 లక్షలతో చేపట్టిన నాడు నేడు పనుల శిలాఫలకం ప్రారంభోత్సవం చేశారు. ఈ బడి భవనం ఆధునీకరణ,ఆర్ ఓ ప్లాంట్ , మరుగుదొడ్ల నిర్మాణం వంటి తొమ్మిది వసతులు ఇక్కడ సమకూర్చడం జరిగింది, అనంతరం ఆయన మల్కాపట్నంలోని నగరపాలక ప్రాథమిక పాఠశాలను సందర్శించారు.ఈ పాఠశాలలో మనబడి నాడు- నేడు కార్యక్రమం ద్వారా 23 లక్షల 50 వేల 206 రూపాయల ఖర్చుతో పలు సౌకర్యాలు విద్యార్థిని విద్యార్థుల కోసం ఏర్పాటుచేశారు. ప్రారంభోత్సవ కార్యక్రమంలో మచిలీపట్నం శాసనసభ్యులు పేర్ని నాని పాల్గొన్నారు
ఈ కార్యక్రమంలో మచిలీపట్నం నగరపాలక సంస్థ మేయర్ మోకా వెంకటేశ్వరమ్మ, డిప్యూటీ మేయర్ తంటిపూడి కవితా థామస్ నోబుల్, కమీషనర్ జి. చంద్రయ్య, 13 వ డివిజన్ కార్పొరేటర్ గాజుల శ్రీదేవి భగవాన్, 11 వ డివిజన్ ఇంచార్జ్ ,కృష్ణాజిల్లా సాఫ్ట్ బాల్ అసోసియేషన్ అధ్యక్షులు గూడవల్లి నాగరాజు, 19 వ డివిజన్ ఇంచార్జ్ బూరగ జయశ్రీ , రైల్ పేట స్పెషల్ మునిసిపాలిటీ అప్పర్ ప్రైమరీ పాఠశాల ప్రధానోపాధ్యాయులు మత్తి శివలక్ష్మి బందరుకోట మునిసిపల్ హై స్కూల్ ప్రధానోపాధ్యాయులు తోట రఘుకాంత్ ( చిన్నా), జి. వంకటేశ్వరావు, 13 వ , 19 వ డివిజన్ సచివాలయ సిబ్బంది, పాఠశాల సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

విజయవాడ ఆయుర్వేద కళాశాలలో ఘనంగా 11వ జాతీయ ఆయుర్వేద దినోత్సవ వేడుకలు

-ధన్వంతరి హోమం నిర్వహణ -సిసిఆర్ఎసి – స్పార్క్ స్కాలర్‌షిప్ చెక్కుల పంపిణీ -ప్రతిభావంతులైన విద్యార్థులకు అవార్డులు విజయవాడ, నేటి పత్రిక …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *