Breaking News

నగరపాలక సంస్థ పరిధిలోని లబ్ధిదారులకు కేటాయించిన వణుకూరు, ఉప్పులూరు లేఅవుట్లను పరిశీలించిన జిల్లా కలెక్టర్…

-నిర్మాణ పనులను వేగవంతం చేయండి..
-నిదులకు ఎటువంటి సమస్య లేదు…
-జిల్లా కలెక్టర్ యస్ డిల్లీ రావు

పెనమలూరు/ కంకిపాడు, నేటి పత్రిక ప్రజావార్త :
గృహ నిర్మాణ పనులను వేగవంతం చేయాలని జిల్లా కలెక్టర్ యస్ ఢిల్లీ రావు అధికారులను ఆదేశించారు. నవరత్నాలు పేదలందరికీ ఇండ్లు ఫేస్ 1 లో భాగంగా విజయవాడ తూర్పు నియోజకవర్గ పరిధిలోని లబ్ధిదారులకు కేటాయించిన పెనమలూరు మండలం వణుకూరు, కంకిపాడు మండలం ఉప్పలూరు లే అవుట్లను జిల్లా కలెక్టర్ యస్ డిల్లీ రావు మంగళవారం నగరపాలక సంస్థ, రెవెన్యూ, గృహ నిర్మాణ శాఖ అధికారులతో కలిసి పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ ఆయా లేఅవుట్ల లో జరుగుతున్న పనులను పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేశారు. పెనమమూరు మండలం వణుకూరు లేఅవుట్ లో 102 ఎకరాల విస్తీర్ణంలో నిర్మాణం జరుపుకుంటున్న 4,078 ప్లాట్ల లే అవుట్లను పరిశీలించారు. ఈ లేఅవుట్లలో నవరత్నాలు పేదలందరికీ ఇండ్లు (ఎన్ పి ఐ) లో 3,743 రిజిస్ట్రేషన్ పూర్తయ్యాయని అధికారులు జిల్లా కలెక్టర్ కు వివరించారు. వీటిలో ప్రస్తుతం 3,469 గృహాలు బిలో బేస్మెంట్ లెవెల్ స్థాయిలోనూ,101 గృహాలు బేస్మెంట్ స్థాయిలోనూ, 14 గృహాలు రూప్ లెవెల్ స్థాయిలోనూ, 24గృహాలు రూప్ కాస్టింగ్ స్థాయిలోనూ ఉన్నాయని అధికారులు కలెక్టర్ కు వివరించారు. అన్ని లేఅవుట్లలో గృహ నిర్మాణాలు జరగాలని, ఇంకనూ ప్రారంభంకాని గృహాలను తక్షణమే లబ్ధిదారులతో ప్రారంబింప చేయాలని కలెక్టర్ అధికారులను ఆదేశించారు. గృహ నిర్మాణాలకు అవసరమైన మౌలిక వసతులను అందుబాటులో ఉంచాలన్నారు. ముఖ్యంగా ఇసుక, సిమెంట్ ,ఐరన్ కొరత రానీయరాదని, నిర్మాణం పూర్తయిన గృహ లబ్ధిదారుల ఖాతాలకు నిధులను ఎప్పటికప్పుడు పెండింగ్ లేకుండా జమ చేయాలని గృహ నిర్మాణ శాఖ అధికారులను కలెక్టర్ ఆదేశించారు.

ఉప్పులూరు లేవుట్ ను పరిశీలించిన కలెక్టర్…
కంకిపాడు మండలం ఉప్పలూరులో 25 ఎకరాల్లోని లేఅవుట్ల లో నిర్మాణం జరుపుకుంటున్న గృహ నిర్మాణాలను జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు పరిశీలించారు. ఈ లేఅవుట్ లో 1096 మంది లబ్ధిదారులకు కేటాయించిన గృహ నిర్మాణాలను కలెక్టర్ పరిశీలించి నిర్మాణ పనులలో ఎదురవుతున్న ఇబ్బందులను అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ లేఅవుట్లో 992 మంది ఎన్ పీఐ రిజిస్ట్రేషన్ జరగగా వీటిలో 892 గృహాలు బిలో బేస్మెంట్ స్థాయిలోనూ, 68గృహాలు బేస్మెంట్ స్థాయిలోనూ, 8 గృహాలు రూప్ లెవెల్ స్థాయిలోనూ, 8గృహాలు రూప్ క్యాస్టింగ్ స్థాయిలోనూ ఉన్నాయని అధికారులు కలెక్టర్ కు వివరించారు. ప్రతీ గృహ నిర్మాణానికి ప్రభుత్వం 1.80 లక్షల రూపాయలు మంజూరు చేస్తుందన్నారు. బేస్మెంట్ స్థాయిలో పూర్తిచేస్తే 60వేల రూపాయలు, పై కప్పు వరకు వస్తే మరో 60 వేల రూపాయలు, పైకప్పు వేస్తే 30 వేల రూపాయలు, ప్లాస్టరింగ్ తదితర పనులు పూర్తి చేసుకుని ఇంటి నిర్మాణం పూర్తయిన వెంటనే మరో 30, వేల రూపాయలు లబ్దిదారుల ఖాతాలోకి చేరుతుందన్నారు. ప్రతి ఇంటికి 90 బస్తాల సిమెంట్, 485 కేజీల స్టీల్ల్, 20 టన్నుల ఉచితఇసుక సరఫరా చేస్తారన్నారు. దీనికి అయ్యే ఖర్చు కూడా తీసివేసి విడతలవారీగా వచ్చే మొత్తాన్ని లబ్ధిదారులకు ఇస్తారన్నారు. 50 వేల రూపాయల వరకు డ్వాక్రా లోన్ మంజూరు చేస్తారని దీనిపై లబ్ధిదారులకు అవగాహన కల్పించి నిర్మాణంలో వేగం పెంచాలని కలెక్టర్ కోరారు. లేఅవుట్లలో నీటి సమస్య లేకుండా చూడాలని, ఇంటిని మెరక చేసుకునేందుకు అవసరమైన మట్టిని అందుబాటులో ఉంచాలని, ఇందుకు అవసరమైన అన్ని అనుమతులు మంజూరు చేస్తామని కలెక్టర్ డిల్లీ రావు అన్నారు. కలెక్టర్ వెంట పెనమలూరు తహశీల్దార్ జి భద్రు, కంకిపాడు తహాసిల్దార్ టి. వి సతీష్, హౌసింగ్ డిఇలు విజయబాబు, ఓబుల్ రెడ్డి, ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *