అమరావతి, నేటి పత్రిక ప్రజావార్త :
అతి పురాతనమైన ఆయుర్వేదంలో సకల వ్యాధులకు ఆయుర్వేద మందులను మరింత చేరువ చేసేందుకు ది ఇండియన్ మెడికల్ ప్రాక్టీషనర్స్ కో-ఆపరేటివ్ ఫార్మశీ & స్టోర్స్ (ఇంప్కాప్స్) చెన్నైవారి 2వ మ్యాన్యుఫ్యాక్చరింగ్ యూనిట్ గుంటూరు జిల్లా, తాడేపల్లి పోలకంపాడులో ఏప్రిల్ 28 ప్రారంభించినట్లు ఇంప్కాప్స్ డైరెక్టర్ డాక్టర్ వేముల భానుప్రకాష్ తెలిపారు. ఈ సందర్భంగా నగరంలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో డాక్టర్ వేముల భానుప్రకాష్ మాట్లాడుతూ ఇంప్కాప్స్ 1944లో చెన్నైలో, 1983లో తాడేపల్లి పోలకంపాడులో ప్రారంభమయ్యాయి. ఈ కంపెనీ వారు ఆయుర్వేద సిద్ధ యునాని మందులను తయారుచేస్తున్నారు. ఇది మల్టీ స్టేట్ కో`ఆపరేటివ్ సొసైటీగా నడుపబడుతోందన్నారు. ఇందులో దేశీయ వైద్య విధానంలో నిష్ణాతులైన వైద్యులు సభ్యులుగా వుంటూ వారే బోర్డ్ ఆఫ్ డైరెక్టర్లుగా ఈ సంస్థను నడుపుతున్నారన్నారు. ఆరోగ్య, కుటుంబ సంక్షేమ శాఖా మంత్రి విడదల రజని యూనిట్‌ను ప్రారంభించగా, మత్స్య, పశుసంవర్థక, పాడి పరిశ్రమాభివృద్ధి మంత్రి సీదిరి అప్పలరాజు సంస్థ తయారుచేస్తున్న పశువైద్యానికి సంబందించిన మందులను విడుదల చేశారన్నారు. శాసనసభ్యులు మల్లాది విష్ణు సంస్థ తయారుచేయు ఆయుర్వేద మందులను తెలియజేయు వైద్యయోగ రత్నావళి అను తెలుగు పుస్తకము14వ సంపుటమును ఆవిష్కరించారని తెలిపారు. ఆయుష్ శాఖ కమీషనర్, కల్నల్ రాములు, ఎన్.టి.ఆర్ యూనివర్శిటీ వైస్ ఛాన్సలర్, పి.శ్యామ్‌ప్రసాద్, కేంద్ర ప్రభుత్వ ఆయుష్ శాఖకు సంబంధించిన అడ్వైజర్ ఆయుర్వేద హెడ్ డ్రగ్పాలసీ సెక్షన్ డాక్టర్ ఆనంద్, డిప్యూటీ డైరెక్టర్ జనరల్ సెంట్రల్ కౌన్సిల్ ఆఫ్ రీసెర్చ్ ఇన్ ఆయుర్వేద సైన్సెస్ డాక్టర్ నారాయణం శ్రీకాంత్, డిప్యూటీ మెడికల్ కమీషనర్ ఇ.ఎస్.ఐ. డాక్టర్ జి.ప్రభాకర్, ఎస్.వి.ఆయుర్వేద కళాశాల ప్రిన్సిపాల్ పరాంకుశం మురళీకృష్ణ, డా.ఎన్.ఆర్.ఎస్.ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల ప్రిన్సిపాల్ డాక్టర్ పి.సాయిసుధాకర్, ఎన్.ఆర్.ఎస్.ప్రభుత్వ ఆయుర్వేద కళాశాల అల్యూమినీ ఛైర్మన్ డాక్టర్ చల్లా హరికుమార్లు పాల్గొనగా, ఇంప్కాప్స్ ప్రెసిడెంట్ డాక్టర్ ఆర్.కణ్ణన్, ఇంప్కాప్స్ డైరెక్టర్ డాక్టర్ వేముల భానుప్రకాష్, ఇంప్కాప్స్ సెక్రటరీ డాక్టర్ కె.ఖాదిర్ మొహిద్దీన్‌లు కార్యక్రమాన్ని పర్యవేక్షించగా ఈ కార్యక్రమంలో డాక్టర్ ఎం.ఆదర్శ్, సంస్థ సిబ్బంది, వివిధ ప్రాంతాల నుండి వచ్చిన డాక్టర్లు తదితరులు పాల్గొన్నట్లు తెలిపారు.
Prajavartha Online Telugu News