విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పు నియోజకవర్గం 7వ డివిజన్ లో 39వ సచివాలయ పరిధిలో బందుల దొడ్డి సి.ఎస్.ఐ చర్చ్, జెల్లీవిల్సన్ స్ట్రీట్, ఏజిఎమ్ స్ట్రీట్, పుచ్చనపల్లి సుందరయ్య నగర్, కమిలి బాబా ఆశ్రమము మరియు సీఆర్ నగర్ కొండ పైన వీధులలో స్థానిక కార్పొరేటర్ మేరకనపల్లి మాధురి ఆధ్వర్యంలో “గడప గడపకూ మన ప్రభుత్వం” కార్యక్రమంలో తూర్పు నియోజకవర్గ వైస్సార్సీపీ ఇంచార్జి దేవినేని అవినాష్ కొండ ప్రాంతాల్లో చివరి ఇంటి ఇంటికి వెళ్లి ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న అబివృద్ది పనులు, సంక్షేమ పథకాలు గురించి వివరిస్తూ మరియు ప్రజలు తెలిపిన సమస్యలను త్వరితగతిన పరిష్కరించాలని వార్డ్ సచివాలయ సిబ్బంది,మున్సిపల్ అధికారులుకు అక్కడికక్కడే ఆదేశాలు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంలో అవినాష్ మాట్లాడుతూ ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఈ మూడేళ్ల కాలంలో అందిస్తున్న సంక్షేమ ఫలాలను నేరుగా వారికి వివరించి వారు పొందుతున్న లబ్ధిని గుర్తుచేస్తూ గతంలో ఎన్నడూ లేనివిధంగా తమ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి వచ్చాక తమ ఇంటి పెద్ద కొడుకుగా, కన్న కొడుకు, పెద్ద అమ్మగా మీ అందరినీ సాకుతున్నారని, మీకు అండగా నిలుస్తున్నారు అని తెలుపుతూ మీ అందరి ఆశీర్వాదాలు మన సీఎం జగన్ గారిపై మన వైసీపీ ప్రభుత్వం పై ఎల్లవేళలా ఉండాలని, మంచి మనసుతో దీవించాలని అవినాష్ కోరారు. స్థానిక ఎన్నికల ప్రచారంలో ఇచ్చిన హామీ మేరకు కొండ ప్రాంతం అధికంగా ఉన్న ఈ డివిజన్ అంతటికీ 50 లక్షల రూపాయలతో మంచినీటి సమస్య పరిష్కారం అయ్యేలా పైప్ లైన్ ఏర్పాటు చేయడంతో పాటు పెండింగులో ఉన్న నూతన మెట్ల మార్గాలు,రోడ్డు నిర్మాణాలు శంకుస్థాపన చేసి కొన్ని ప్రారంభించడం కూడా జరిగింది అన్నారు. ప్రజలకు ఏ సమస్య వచ్చిన,అర్హత ఉండి ఏ సంక్షేమ పధకం అందకపోయిన తన దృష్టికి తీసుకువస్తే తక్షణమే పరిష్కారం అయ్యేలా చూస్తానని హామీ ఇచ్చారు. ప్రజలు వద్దకు వెళ్తుంటే జగన్ పాలన గురించి చాలా ఆనందం వ్యక్తం చేస్తున్నారు గత టీడీపీ ప్రభుత్వం లో స్థానిక ఎమ్మెల్యే నిధులు ఇవ్వకుండా అభివృద్ధి ని నిర్లక్ష్యం చేసారని విమర్శించారు. కొండ ప్రాంతం లో టిడ్కో ఇల్లు,పథకాలు ఇస్తాం అని జన్మభూమి కార్యక్రమాలాంటి అబద్దపు కమిటీలు పెట్టి ప్రజలను పిచ్చోళ్ళని చేసి వారి దగ్గర డబ్బులు కట్టించి తెలుగు దేశం ప్రభుత్వం హయాంలో ఒక్కళ్ళకి కూడా ఇచ్చింది లేదు అని విమర్శించారు.స్థానిక ఎమ్మెలే పబ్లిసిటీ కోసం వైస్సార్సీపీ చేసిన మంచి కార్యక్రమాలు ను విమర్శించడం హాస్యాస్పదం గా ఉంది కేవలం షో రాజకీయాలు కోసం,ఫోటులు దిగి పేపర్లు లో పడటం కోసం తప్ప ప్రజానీకానికి చేసిందేం లేదు అని ఆరు. జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వంలో సచివాలయ వ్యవస్థ ద్వారా సంక్షేమ పథకాలు,ఇండ్ల స్థలాలు ప్రజల గడప వద్దకు వద్దకే చేరుస్తున్న ఘనత జగన్ గారిదే అని ఆరు. కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ,సీనియర్ నాయకులు వేగి వెంకటేశ్వర రావు,వైస్సార్సీపీ నాయకులు సంపత్,శ్యామ్, సొంగా రాజ్ కమల్, ఉదయ్,క్లైవ్,శంకర్,మహిళా నాయకులు సుభాషిణి,సుజాత తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News