విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
నగరపాలక సంస్థ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్, ఐ.ఏ.ఎస్, మరియు నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి శనివారం క్షేత్ర స్థాయి పర్యటనలో భాగంగా 11 వ డివిజన్ పటమట APIIC కాలనీ లో గల లీఫ్ షెడ్డర్ మిషన్ లను సందర్శించారు. నగరంలో ఉన్నటువంటి పార్కులలో ఉండేటువంటి చెట్ల కొమ్మలను మరియు చెత్తను ఆ మిషన్ల ద్వారా కంపౌస్ట్ (పొడిగా) చేసి మొక్కలకు వేయడం జరుగుతంది. అక్కడ ఉన్నటువంటి మిషన్లను ఆధునీకరణ పనుల వివరాలు అధికారులను అడిగితెలుసుకొని వాటిని పరిశీలించి అధికారులకు పలు సూచనలు చేసారు. గ్రీనరి పనులను చేపట్టి ఆహ్లాదకరంగా పచ్చదనంతో అభివృద్ధి పరచాలని ఉద్యాన వనశాఖాదికారులను ఆదేశించారు. పటమట పంటకాలువ రోడ్ నందు పారిశుధ్య నిర్వహణ విధానము మరియు డ్రెయిన్ నందు మురుగునీటి పారుదల తీరును పర్యవేక్షించి శానిటరీ అధికారులకు పలు ఆదేశాలు ఇస్తూ, డ్రెయిన్ లలో వ్యర్ధములను తొలగించి మురుగునీటి పారుదల సక్రమముగా జరిగే విధంగా చూడాలని ఆదేశించారు.
Prajavartha Online Telugu News