Breaking News

వేదాద్రి శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహ స్వామి కళ్యాణం

వేదాద్రి, నేటి పత్రిక ప్రజావార్త :
యన్.టి.ఆర్ జిల్లా, జగ్గయ్యపేట మండలం వేదాద్రి గ్రామంలో వేంచేసిన శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహ స్వామి దేవాలయంలో స్వామి వారి బ్రహ్మోత్సవాలు ది:11/05/2022 నుండి ది:18/05/2022 వరకు జరుగుతున్నాయని ఆలయ కార్యనిర్వహణాధికారి కానూరి సురేష్ బాబు తెలియజేసారు. ఈ సమయంలో స్వామి వారిని పెండ్లి కుమారుని చేయడం, అంకురార్పణ, ధ్వజారోహణ, శేషవాహన సేవ, మహనుమంత సేవ,సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించటం జరిగిందని ఆయన తెలియజేశారు. ది:15/05/22 ఆదివారం ఉదయం 7 గంటల నుండి దీక్షా స్వాముల యిరుముడి సమర్పణ, రాత్రి 11 గంటలకి శ్రీ స్వామి వారి అమ్మవార్ల ఎదురు కోలోత్సవం,రాత్రి 12 గంటల కు సర్వాంగ సుందరముగా అలంకరించబడిన పరిమళ పుష్పాలంకృతమై శోభిల్లు, కళ్యాణ మండపం నందు శ్రీ భూనీళా సమేత శ్రీ యోగానంద లక్ష్మీ నరసింహ స్వామి వారి కళ్యాణ మహోత్సవం కార్యక్రమం అంగరంగ వైభవంగా జరుగుతుందని ఆయన తెలియజేసారు. స్వామి వారిని దర్శించి, కళ్యాణ మహోత్సవాని తిలకించడానికి భక్తులకు సకల ఏర్పాట్లను చేయడం జరిగిందని, భక్తులు సాంప్రదాయ వస్త్రధారణతో విచ్చేసి స్వామి వారి కృపకు పాత్రులు కాగలరని ఆలయ కార్యనిర్వహణాధికారి కానూరి సురేష్ బాబు భక్తులకు తెలియజేశారు

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

తుఫానుపై ఆర్టీజీఎస్ అప్ర‌మ‌త్తం

-నిరంత‌ర ప‌ర్య‌వేక్ష‌ణ‌ -ప్ర‌భావిత జిల్లాల యంత్రాంగంతో స‌మ‌న్వ‌యం -తుఫాను గ‌మ‌నంపై ఎప్ప‌ప‌టిక‌ప్పుడు స‌మాచారం చేర‌వేత‌ అమరావ‌తి, నేటి పత్రిక ప్రజావార్త …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *