Breaking News

‘గూగుల్ రీడ్ అలాంగ్’ యాప్ డౌన్లోడ్ చేయించండి

-సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు కె.వెట్రిసెల్వి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సమగ్ర శిక్షా – పాఠశాల విద్యాశాఖ, ఆంధ్రప్రదేశ్ సంయుక్తంగా ‘గూగుల్ రీడ్ అలాంగ్’ యాప్ ను ప్రారంభించేందుకు గూగుల్ తో భాగస్వామ్యం కుదుర్చుకున్నట్లు సమగ్ర శిక్షా రాష్ట్ర పథక సంచాలకులు కె.వెట్రిసెల్వి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ‘గూగుల్ రీడ్ అలాంగ్’ యాప్ ఉపయోగాలను వివరించడానికి జిల్లా స్థాయి అధికారులు, ఉపాధ్యాయులతో బుధవారం ఆన్ లైన్ శిక్షణా సమావేశం నిర్వహించారు. వేసవి సెలవుల్లో 1-6 తరగతుల విద్యార్థుల్లో పఠనా సామర్థ్యాన్ని పెంచడం కోసం, వారు వినోదభరితంగా, ఆకర్షణీయంగా నేర్చుకోవడానికి, చదవడానికి ఏర్పాటు చేసిన యాప్ అని పేర్కొన్నారు. ఈ యాప్లో గూగుల్ ఆధునాతన స్పీచ్-టు-టెక్స్ట్, వాయిస్ రికగ్నిషన్ టెక్నాలజీల ఆధారంగా స్నేహపూర్వక అభ్యసన కోసం ‘దియా’ యానిమేటడ్ అసిస్టెంట్ ఉంటుందని తెలిపారు. విద్యార్థులు బిగ్గరగా చదివేసమయంలో దియా విని ప్రతిస్పందిస్తూ కొత్త పదాలు, కష్టమైన పదాలు ఉచ్ఛరించడానికి సహాయపడుతుందని తెలిపారు. ఈ యాప్ ను ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు, విద్యార్థులు డౌన్లోడ్ చేసుకోవాలని సమగ్ర శిక్షా ఎస్పీడీ కె.వెట్రిసెల్వి కోరారు. ఎటువంటి ప్రకటనలు లేకుండా ఉచితంగా, ఆఫ్ లైన్, ఆన్లైన్లో వినియోగించుకోవచ్చన్నారు. తెలుగు ఇంగ్లీషుతో పాటు 11 భాషల్లో వెయ్యికి పైగా బొమ్మలు, కథలు, ఆటలు వంటివి ఇందులో ఉంటాయని తెలిపారు. అలానే పాఠ్య పుస్తకాల్లోని కథలు, తదితర అంశాలు కూడా మున్ముందు అనుసంధానం చేస్తామని తెలిపారు. ఈ యాప్ గురించి ఈ నెల 20 నుండి జూలై 5 వరకు తల్లిదండ్రులకు, విద్యార్థులకు ఉపాధ్యాయులు సరైన అవగాహన కల్పించి, వేసవి సెలవుల్లో పూర్తి స్థాయిలో వినియోగించుకోవాలని కోరారు. వేసవి సెలవుల అనంతరం పాఠశాల పున:ప్రారంభించిన తర్వాత కూడా ఉపాధ్యాయుల సహకారంతో తరగతి గదిలో విద్యార్థులు ఈ యాప్ వినియోగాన్ని కొనసాగిస్తామని తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *