
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఆంధ్ర ప్రదేశ్ మున్సిపల్ కార్పొరేషన్స్ మినిస్ట్రీరియల్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ మెంబర్లుగా ఎన్నికైన సభ్యులు బి.శ్రీనివాసరావు, జి.అజయ్ కుమార్, బి.గోవిందరావు నగరపాలక సంస్థ నందలి ఇతర సిబ్బందితో కలసి బుధవారం నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి, కమిషనర్ స్వప్నిల్ దినకర్ పుండ్కర్ ఐ.ఏ.ఎస్ లను వారి వారి ఛాంబర్ లలో మర్యాద పూర్వకంగా కలసినారు. ఈ సందర్భంలో రాష్ట్ర స్థాయి అసోసియేషన్ మెంబర్లుగా ఎన్నికైన సందర్భంలో అభినందనలు తెలియజేస్తూ, ఉద్యోగుల సమస్యల పరిష్కారంలో తమ వంతు సహకారాన్ని అందిస్తామని హామీ ఇచ్చారు. కాగా ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్రంలోని 17 మున్సిపల్ కార్పొరేషన్ల మినిస్ట్రీరియల్ సిబ్బంది మే 14వ తేదిన గుంటూరు నందు సమావేశమై ఆంధ్ర ప్రదేశ్ మున్సిపల్ కార్పొరేషన్స్ మినిస్ట్రీరియల్ ఎంప్లాయిస్ వెల్ఫేర్ అసోసియేషన్ గా ఏర్పడి సభ్యులను ఎన్నుకోవటం జరిగింది. సదరు అసోసియేషన్ లో విజయవాడ నగరపాలక సంస్థ నందలి సూపరింటిoడెంట్ బి.శ్రీనివాసరావు జనరల్ సెక్రెటరిగా, జూనియర్ అసిస్టెంట్ జి.అజయ్ కుమార్ సెక్రెటరిగా మరియు జూనియర్ అసిస్టెంట్ బి.గోవిందరావు ఎగ్జిక్యూటివ్ మెంబర్ గా ఎన్నుకోవటం జరిగింది.
Prajavartha Online Telugu News