Breaking News

మేలు రకమైన వంగడాలు కాకుండా కల్తీ వంగడాలు పంపిణీ జరిగినా ఎరువులు సక్రమంగా పంపిణీ చేయకపోయినా కఠిన చర్యలు…

-జిల్లావ్యాప్తంగా పలు దుకాణాల్లో విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆకస్మిక తనిఖీలు…
-రీజినల్ విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారి టి.కనకరాజు 

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మేలు రకమైన విత్తనాలకు బదులు కల్తీ విత్తనాలు మరియు నకిలీ ఎరువులు విక్రయించినా, అధిక ధరలకు అమ్మినా, పరిమితికి మించి నిల్వచేసినా కేసులు నమోదు చేయడం జరుగుతుందని విజయవాడ యూనిట్ రీజినల్ విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ అధికారి టి.కనకరాజు హెచ్చరించారు. విజిలెన్స్ అండ్ ఎన్ ఫోర్స్ మెంట్ విజయవాడ యూనిట్ రీజినల్ ఆఫీసర్ టి.కనకరాజు ఆధ్వర్యంలో బుధవారం వ్యవసాయ శాఖ సభ్యులు జిల్లాలో నందిగామ, వత్సవాయి, గంపలగూడెం లోని పలు విత్తనాలు మరియు ఎరువుల దుకాణాల్లో ఆకస్మికంగా దాడులు నిర్వహించి సరుకురిజిస్టర్ లను పరిశీలించారు. నకిలీ విత్తనాలు, ఎరువులను విక్రయిస్తే కేసులు నమోదు చేస్తామని దుకాణాల నిర్వాహకులను హెచ్చరిస్తున్నారు. అట్టి వారిపై కేసులు నమోదు చేయటం జరుగుతుందని విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్ టి.కనకరాజు హెచ్చరించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *