Breaking News

ఎలక్ట్రానిక్‌ వ్యర్థ పదార్థాలు వల్ల కలిగే అనర్థాలను ప్రజలకు తెలియజేసి చైతన్యవంతులను చేయాలి…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఎలక్ట్రానిక్‌ వ్యర్థ పదార్థాలు వల్ల కలిగే అనార్థాలను ప్రజలకు తెలియజేసి చైతన్యవంతులను చేయాలని జిల్లా కలెక్టర్‌ యస్‌ డిల్లీరావు అధికారులను ఆదేశించారు. ఎలక్ట్రానిక్‌ వ్యర్థ పదార్థాల్లో భారీ లోహాలు, అర్గానిక్‌ వంటి రసాయన పదార్థాలు ప్రజల ఆరోగ్యం పై తీవ్ర ప్రభావం చూపుతాయని, వాడుకలో లేని ఎలక్ట్రానిక్‌ వస్తువులను రీసైక్లింగ్‌ చేయడం ద్వారా పర్యావరణ పరిరక్షణతో కాలుష్య రహిత సమాజానికి సమిష్టిగా కృషి చేయవలసి ఉందని జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు అన్నారు. ఇ- వ్యర్థాలతో కలిగే ఇబ్బందులు, ఎలక్ట్రానిక్‌ వ్యర్థ పదార్థాలు సేకరణ ( ఇ- వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ రూల్స్‌ -2016) అమలు పై బుధవారం స్థానిక కలెక్టర్‌ కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు, మున్సిపల్‌ కమీషనర్‌, పర్యావరణ పరిరక్షణ సంస్థ, పరిశ్రమలు, స్టేక్‌ హోల్డర్స్‌, యూనివర్సిటి ప్రోఫెసర్స్‌, చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ప్రతినిధులు, సంబంధిత అధికారులతో గూగుల్‌ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ కాన్ఫరెన్స్‌ ద్వారా కలెక్టర్‌ మాట్లాడుతూ ప్రజలు ఉపయోగించే ఎలక్ట్రానిక్‌ ఉపకరణాలైన టివి, ట్యాబ్‌, మొబైల్‌, ఎసి, కంప్యూటర్స్‌, బ్యాటరీలు వంటివి పాడైనప్పుడు సాదారణంగా రోజువారి చెత్తతో బయటపారవేయడం వలన అవి భూమిలో కలిసి విషపూరితమై కాలుష్యానికి కారణాలవుతున్నాయన్నారు. ఎలక్ట్రానిక్‌ పరికరాలలో ఉపయోగించే బ్యాటరీలలో ఉండే హనికరమైన కెమికల్స్‌ను కాల్వలలో వదలడం వలన అవి నీటి వనరులలో కలిసి ప్రజలు ఆనారోగ్యానికి గురై కాన్సర్‌ వంటి రోగాల బారిన పడే ప్రమాదం ఉందన్నారు. ప్లాస్టిక్‌, బయోమెట్రిక్‌, ఘన వ్యర్థాలతో పర్యావరణం తీవ్రంగా దెబ్బతింటుందన్నారు. ఈ వ్యర్థాల ఉత్పత్తి రోజురోజుకు పెరుగుతున్న దృష్ట్యా భారత ప్రభుత్వం 2016 లో ఇ- వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ను నోటిఫై చేసి నియమావళిని రూపొందించడం జరిగిందన్నారు. విషపూరితమైన లోహాలు, అర్గానిక్‌లు భూమిలో కలవకుండా సమిష్టిగా కృషి చేయవలసి ఉందన్నారు. ఇబ్రహీంపట్నం మండలం కొండపల్లి లో ఇ- వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ ఎజెన్సీని ఏర్పాటు చేయడం జరిగిందని గ్రామాలు, పట్టణాలలో తడి పొడి చెత్తను సేకరిస్తున్న విధానంవలే ఎలక్ట్రానిక్‌ వ్యర్థాలను కూడా ప్రత్యేకంగా సేకరించి నిర్వహణ భాధ్యతను ఎజెన్సీకి అప్పజెప్పడం జరిగిందని కలెక్టర్‌ వివరించారు. ఎలక్ట్రానిక్‌ వ్యర్థాలు భూమిలో కలిసిపోవడం వలన కలిగే అనార్థాలను ప్రజలకు వివరించి వారిని చైతన్యవంతులను చేయడం ద్వారా ఇ` వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ పద్దతి అవలంభించేలా చర్యలు తీసుకోవాలన్నారు. ముఖ్యంగా పారిశ్రామిక ప్రాంతాలపై మరింత దృష్టి సారించి ఇ- వేస్ట్‌ను సేకరించేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. ఎలక్ట్రానిక్‌ వస్తువుల అమ్మకందారులు విక్రయించే సమయంలో కొనుగోలు దారులు తప్పనిసరిగా వారు కొన్న ఎలక్ట్రానిక్‌ వస్తువులు పాడైపోయిన అనంతరం తిరిగి ఇ-వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌కు అప్పగించడం తప్పనిసరి చేయాలని ఈ విధంగా వ్యాపార సంస్థలో బోర్డులను పదర్శించేలా చర్యలు తీసుకోవలసిన అవసరం ఉందన్నారు. వాటాదారులు ప్రజలను చైతన్యవంతులను చేయాలన్నారు. ఇంజనీరింగ్‌ కళాశాలలో ఇ-వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ పై విద్యార్ధులకు బోదనలు తప్పనిసరి చేయవల్సిన అవసరం ఉందన్నారు.ఎలక్ట్రానిక్‌ ఉత్పత్తులను విరివిగా ఉపయోగించే ప్రాంతాలను గుర్తించి ఆయా ప్రాంతాలలో వ్యర్థాపదార్థాలను సేకరించేందుకు కలక్షన్‌ పాయింట్లను ఏర్పాటు చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. స్థానిక, నగరపాలక సంస్థలు, ఇ`వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ నిర్వహణపై ప్రణాళికను రూపొందించి అమలు చేయాలన్నారు. అడియో లఘు చిత్రాలు, వాట్సాప్‌, ఫేస్‌బుక్‌, ప్రసార మాద్యమాలు ద్వారా ఇ`వేస్ట్‌ కలక్షన్‌, డిస్పోజల్‌ పై ప్రజలను చైతన్యవంతులగా చేయాలని కలెక్టర్‌ డిల్లీరావు కోరారు. గూగుల్‌ కాన్ఫరెన్స్‌లో మున్సిపల్‌ కమీషనర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పునకర్‌, ఏపిపిసిబిఇ ఇఇ టి. ప్రసాద్‌రావు, డిఐఎస్‌సి జనరల్‌ మేనేజర్‌ బి. శ్రీనివాస్‌రావు, ఏపిఐఐసి జోనల్‌ మేనేజర్‌ డి.శ్రీనివాస్‌, డిపివో చంద్రశేఖర్‌, గుడ్లవలేర్లు ఇంజనీరింగ్‌ కళాశాల ప్రోఫెసర్‌ డా. కామరాజు, కెఎల్‌ యూనివర్సిటి హెచ్‌వోడి డా. యం రాఘవరావు, విఆర్‌ సిద్ధార్థ ఇంజనీరింగ్‌ కళాశాప్రోఫెసర్‌ డా. యం.వి రామకృష్ణ, చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ అధ్యక్షులు కె. విద్యాధరరావు, ఎఫ్‌ట్రానిక్స్‌ యండి. దాసరి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఈగల్ పోస్టర్లను, డ్రగ్స్ వద్దు బ్రో బ్యానర్ ను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్, ఎస్పి లు

-ఆపరేషన్ త్రిశూల్’లో భాగంగా డ్రగ్స్, మహిళల భద్రత, రోడ్డు ప్రమాదాల నియంత్రణకు సమగ్ర కార్యాచరణ -మైక్రో లెవెల్‌లో సమస్యలను గుర్తించి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *