విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరంలో ప్రజల రక్షణ కోసం ప్రత్యేకంగా మహిళల రక్షణ కోసం నగర పోలీస్ ఎల్లవేళలా అప్రమత్తంగా ఉంటుంది. దిశా యూజర్ ఫ్రెండ్లీ యాప్. దిశా యాప్ పటిష్ట అమలుకోసం నగరంలోని 11 పోలీస్ స్టేషన్ లకు ఒకొక్క దిశా వాహనాన్ని కేటాయించడం జరిగింది. ఆ వాహనంలో ఒక ఆర్ ఎస్.ఐ. మరియు ముగ్గురు సిబ్బందితో కలిసి ఒక ప్రత్యేక బృందంగా ఏర్పడినది. దిశా ప్రత్యేక బృందాలు పోలీస్ స్టేషన్ పరిధిలోని నేర ప్రభావిత ప్రాంతాలలో గస్తి నిర్వహిస్తూ అంతే కాకుండా అనుమానిత వ్యక్తులకు కౌన్సిలింగ్ ఇస్తూ, వాహనాల తనిఖీ కూడా నిర్వహిస్తున్నారు. ఈ దిశా బృందాలు ఆయా ప్రజలతో సమావేశాలు నిర్వహిస్తూ దిశా యాప్ రిజిస్ట్రేషన్స్ మరియు వినియోగం పై అవగాహన కల్పిస్తున్నారు. వివిధ పోలీస్ స్టేషన్ల పరిదిలలో ఈ మధ్య కాలంలో నమోదైన మిస్సింగ్ కేసులను దిశా బృందాలు త్వరితగతిన చేధించడం జరిగింది.
దిశా బృందాలు చేదించిన వాటిల్లో కొన్ని:
ది.05.05.2022న సుర్యరావుపేట పోలీస్ స్టేషన్ లో నమోదైన మిస్సింగ్ కేసులోని మహిళను కేవలం ఫిర్యాదు అందిన గంట లోపు సదరు మిస్సింగ్ మహిళను గుర్తించడం జరిగింది.
ది.13.05.2022 న సత్యనారాయణపురం పోలీస్ స్టేషన్ పరిధిలో కర్నాటకకు చెందిన మహిళా తన కుటుంబంతో కలిసి విజయవాడ పెళ్ళికి వచ్చిన సమయంలో తన కుటుంబంలో సభ్యులతో గొడవపడి చనిపోతానంటూ వెళ్లిపోయినట్లు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేవలం 35 నిముషాల వ్యవధిలో సదరు మహిలను దిశా పోలీస్ బృందాలు గుర్తించి కుటుంబసభ్యులకు అప్పగించడం జరిగింది.
అంతే కాకుండా 11 దిశా వాహన బృందాలు డి.29.04.2022 నుండి 17.05.2022 వరకు కేవలం 20 రోజులలో నగరంలోని మహిళలకు దిశా యాప్ వలన కలుగు ఉపయోగాల గురించి అవగాహన కలిగించి వారి ద్వార సుమారు 80000 దిశా యాప్ లను డౌన్లోడ్ చేయించడం జరిగింది.
ది.18.05.2022న నగర పోలీస్ కమీషనర్ కాంతి రాణా టాటా, ఐ.పి.ఎస్ విధి నిర్వహణ లో మంచి ప్రతిభ కనబరిచినందుకు ఈ 11 దిశా వాహనాల సిబ్బందికి నగదు రివార్డులను ప్రకటించి వారికి అందించడం జరిగింది.
ఈ కార్యక్రంలో నగర పోలీస్ కమీషనర్ మాట్లాడుతూ మీరందరు ఇదేవిధంగా పనిచేయాలని, నేర ప్రభావిత ప్రాంతాలు, రైల్వే ట్రాక్ సమీపాలలో గస్తి నిర్వహిస్తూ అనుమానితులపై గట్టి నిఘా పెట్టి ఎటువంటి అవాంచనీయ సంఘటనలు జరుగకుండా చూడాలని, సిబ్బంది అందరికి విధి నిర్వహణ లో సూచనలు మరియు సలహాలను అందించారు.
ఈ కార్యక్రమం లో డి.సి.పి. మేరి ప్రశాంతి ఐ.పి.ఎస్, ఏ.డి.సి.పి.లు సిహెచ్ లక్ష్మీపతి, కొల్లి శ్రీనివాసరావు, సి.ఏ.ఆర్. ఏ.సి.పి. చెంచు రెడ్డి, మరియు సిబ్బంది పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News