Breaking News

సెంటినీ హాస్పిటల్స్‌ జర్నలిస్ట్‌ హెల్త్‌ కార్డ్‌ పధకం ప్రారంభం….


-జర్నలిస్ట్‌ హెల్త్‌ కార్డ్‌ పధకాన్ని ప్రారంభించిన విజయవాడ నగర పోలీస్‌ కమీషనర్‌ క్రాంతి రాణా టాటా

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
సెంటినీ హాస్పిటల్స్‌ జర్నలిస్ట్‌ ప్రివిలేజ్‌ కార్డ్‌ వైద్య సేవలను విజయవాడ నగర పోలీస్‌ కమీషనర్‌ క్రాంతిరాణా టాటా నేడు తన కార్యాలయంలో ప్రారంభించారు. ఎ.పి. ఎడిటర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు, రాజకీయ విశ్లేషకుడు వి.వి.ఆర్‌. కృష్ణంరాజు అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో పలువురు ప్రముఖులు జర్నలిస్ట్‌ ప్రివిలేజ్‌ కార్డ్‌ను ఆవిష్కరించారు. ఈ సందర్భంగా నగర పోలీస్‌ కమీషనర్‌ క్రాంతిరాణా టాటా మాట్లాడుతూ జర్నలిస్టులకు ఉచిత, రాయితీతో కూడిన వైద్య సేవలు అందించడానికి సెంటినీ హాస్పిటల్‌ ముందుకు రావడం హర్షణీయమని అన్నారు. ఎ.పి. ఎడిటర్స్‌ అసోసియేషన్‌, బెజవాడ ప్రెస్‌క్లబ్‌ ప్రతినిధులను ఈ సందర్భంగా ఆయన అభినందించారు.

సెంటినీ హాస్పిటల్‌ సి.ఇ.వో డాక్టర్‌ సి.ఎల్‌.ఎన్‌. రెడ్డి మాట్లాడతూ విజయవాడ నగర పరిధిలోని జర్నలిస్టులు, వారి కుటుంబ సభ్యులందరూ ప్రివిలేజ్‌ కార్డులు పొందడానికి అర్హులేనన్నారు. ఎ.పి. ఎడిటర్స్‌ అసోసియేషన్‌ , బెజవాడ ప్రెస్‌క్లబ్‌ సంయుక్త ఆధ్వర్యంలో ప్రారంభమైన ఈ పధకంలో భాగంగా జర్నలిస్టులకు వారి కుటుంబ సభ్యులకు ఉచిత, రాయితీలతో కూడిన వైద్య సేవలు లభిస్తాయని చెప్పారు. ఒ.పి. ఇన్వెస్టిగేషన్లు, హెల్త్‌ చెకప్‌లపై కూడా 20 శాతం వరకూ రాయితీలు ఇవ్వబోతున్నట్లు డాక్టర్‌ రెడ్డి తెలిపారు.

ఎ.పి. ఎడిటర్స్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు వి.వి.ఆర్‌. కృష్ణంరాజు మాట్లాడుతూ కోవిడ్‌ సమయంలో కూడా తమ అసోసియేషన్‌ అనేక సేవా కార్యక్రమాలు చేసిందని చెప్పారు. ప్రివిలేజ్‌ హెల్త్‌ కార్డ్‌ నగరంలోని జర్నలిస్టులకు ఉపయుక్తంగా ఉంటుందన్నారు. జూన్‌ మొదటి వారంలో జర్నలిస్టుల కుటుంబాలకు ఉచిత క్యాన్సర్‌ స్క్రీనింగ్‌ టెస్ట్‌ల శిబిరాన్ని నిర్వహిస్తామని కృష్ణంరాజు చెప్పారు. ఈ కార్డులు కావలసిన వారు 8897 22 9366 కి ఫోన్‌ చేసి వాటిని పొందవచ్చని బెడవాడ ప్రెస్‌క్లబ్‌ అధ్యక్షుడు చందన మధు తెలిపారు. ఇతర ప్రాంతాల్లోని గర్తింపు పొందిన జర్నలిస్టులు కూడా ఈ కార్డులు పొందడానికి అర్హులేనని ఆయన చెప్పారు.

ఈ కార్యక్రమంలో సెంటినీ హాస్పిటల్‌ జనరల్‌ మేనేజర్‌ ( మార్కెటింగ్‌) వి.ఎన్‌.వి. కిషోర్‌, అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్‌ ఎం. హనుమంతరావు (ఆపరేషన్స్‌), బెజవాడ ప్రెస్‌క్లబ్‌ సభ్యలు డి.జోసఫ్‌, ఎం. పూర్ణ, సదారావు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *