విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
తూర్పు నియోజకవర్గ పరిధిలోని స్థానిక 22వ డివిజన్ గంగానమ్మ గుడి వద్ద వైస్సార్ కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్ తాటిపర్తి కొండారెడ్డి ఆధ్వర్యంలో జరిగిన రూ.70,00,000 నిధులతో నూతనంగా నిర్మిస్తున్న వాటర్ పైప్ లైన్,డ్వాక్రా మీటింగ్ హాల్ మరియు దోభీ ఖానా ప్రహరీ గోడ శంకుస్థాపన కార్యక్రమంలో నగర మేయర్ రాయన భాగ్యలక్ష్మి తో కలిసి పాల్గొన్న తూర్పు నియోజకవర్గ ఇంఛార్జ్ దేవినేని అవినాష్,ఈ సందర్బముగా అవినాష్ మాట్లాడుతూ మున్సిపల్ ఎన్నికల ప్రచారంలో ప్రజలకు హామీ ఇచ్చిన మేరకు ఈ డివిజన్ లో మూడు కోట్లు తో అభివృద్ధి కార్యక్రమమాలకి శంకుస్థాపన చేసి ప్రారంభించటం జరిగింది. గత ప్రభుత్వంలో నిర్లక్ష్యంతో తవ్వి వదిలేసిన ఐదు రోడ్లు, మోడల్ స్కూల్,స్వర్గపురి రోడ్డు,నూతన రైతు బజార్ ఏర్పాటు,మ్యాన్ హోల్స్, నాడు నేడు క్రింద మోడల్ స్కూల్,అర్బన్ హెల్త్ సెంటర్ లను పూర్తి చేసి స్థానిక ప్రజలకి ఆందుబాటులోకి తీసుకురావడం జరిగింది అన్నారు.ఈ రోజు శంకుస్థాపన చేసిన అబివృద్ది పనులను ఎలాంటి నాణ్యత లోపం లేకుండా వీలైనంత త్వరగా పూర్తీ చేసి ప్రజలకి అందుబాటులోకి తీసుకొస్తాం అని తెలియజేసారు.తూర్పు నియోజకవర్గ అబివృద్దే లక్ష్యం గా బాధ్యత తీసుకుని పని చేస్తున్నాం అని అన్నారు.ప్రజలకి ఏ సమస్య ఉన్న ఎప్పటికప్పుడు కార్పొరేటర్లు,ఇంచార్జిలు నా దృష్టికి తీసుకువస్తున్నారు అని సంబంధిత అధికారులతో మాట్లాడి ఎప్పటికప్పుడు సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నామని అన్నారు.మాది మాటలు ప్రభుత్వం కాదు చేతల ప్రభుత్వం అని తెలిపారు.ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ,ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ,గాంధీ కోపరేటవ్ బ్యాంక్ డైరక్టర్ జోగా రాజు,వైస్సార్సీపీ నాయకులు,ఫజలుద్ద్దీన్,అసిఫ్,టీపీ రెడ్డి,చెన్నారెడ్డి,దర్గా,సురేష్ తదితరులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News