విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రతి పేద కుటుంబం యొక్క జీవన ప్రమాణాలు మెరుగవ్వాలనే సదుద్దేశంతోనే జగనన్న సంక్షేమ పథకాలను రూపొందించి అమలు పరుస్తున్నారని తూర్పు నియోజకవర్గ వైసిపి ఇంచార్జ్ దేవినేని అవినాష్ పేర్కొన్నారు. తూర్పు నియోజకవర్గ పరిధిలో చేపట్టిన ‘గడప గడపకూ మన ప్రభుత్వం’ కార్యక్రమంలో భాగంగా శుక్రవారం నాడు స్థానిక కార్పొరేటర్ మేరకనపల్లి మాధురి ఆధ్వర్యంలో వుడ్ పేట ఆర్చ్ నుండి మొదలై దున్న పున్నయ్య స్ట్రీట్, మీసాల యోసేబు స్ట్రీట్, గడ్డం హనుమంత్ స్ట్రీట్, తాళ్లూరి యాకోబు స్ట్రీట్, పి-జాన్ స్ట్రీట్ మరియు సుందరావు స్ట్రీట్ వరకు ఇంటిఇంటికి వెళ్లి వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో ముఖ్యమంత్రి వైయస్ జగన్మోహన్ రెడ్డి అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు, చేస్తున్న అభివృద్ధి గురుంచి వివరిస్తూ,స్థానిక సమస్యలను అడిగి తెలుసుకుని వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని భరోసా ఇచ్చారు. ఈ సందర్భంలో అవినాష్ మాట్లాడుతూ ఎన్నికల మేనిఫెస్టోలో పేర్కొన్న నవరత్నాలనే కాకుండా సమాజం లోని వివిధ వర్గాలకు లబ్ధిని అందించాలనే మంచి ఆలోచన చేసి..అనేక ప్రజా సంక్షేమ పథకాలను ప్రవేశ పెట్టి భారత దేశంలోనే ఇంతకు ముందెన్నడూ లేని విధంగా సంక్షేమ క్యాలెండర్ విడుదల చేసి చచెప్పిన తేదీకి చెప్పిన మొత్తాన్ని లబ్ధిదారుల ఖాతాలకు నేరుగా జమచేస్తున్న ఏకైక ముఖ్యమంత్రి మన జగన్మోహన్ రెడ్డి అని అన్నారు.లబ్ధిదారుల ఎంపికలో కేవలం అర్హత మాత్రమే కొలబద్దగా కుల మత వర్గ వర్ణ ప్రాంత పార్టీ బేధాలు చూపకుండా అర్హులను ఏ ఒక్కరినీ వదలకుండా పధకాలు ఇస్తున్న మనసున్న మారాజు మన నవయువ ముఖ్యమంత్రి ని గడప గడప కు దీవించాలని అన్నారు.గడప గడపకు తిరుగుతూ..వారికి అందిన సంక్షేమం ఆరా తీస్తున్నప్పుడు వారి స్పందన ప్రభుత్వం పట్ల వారికి ఉన్న ప్రేమను స్పష్టం చేస్తుందని అన్నారు. జగన్మోహన్ రెడ్డి మరో ముప్పైయేళ్లు ముఖ్యమంత్రి గా కొనసాగడం ఖాయం అన్నారు. గ్రామసచివాలయ వ్యవస్థ వాలంటీర్ వ్యవస్థతో పాలనను ప్రజల ముంగిటకు చేర్చడం జరిగిందని అన్నారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ,వైస్సార్సీపీ నాయకులు వేగి వెంకటేశ్వర రావు,సొంగా రాజ్ కమల్, కుటుంబరావు, ఉదయ్, ఆనంద్,కొండా,అశోక్,రమేష్,మహిళా నాయకులు సుభాషిణి,సుజాత,సోమ్య,ప్రేమలత తదితరులు పాల్గొన్నారు
Prajavartha Online Telugu News