Breaking News

ఘన వ్యర్థపదార్ధాలు తరలించి కాలుష్య రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు కృషి చేద్దాం…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రభుత్వ ప్రైవేటు భాగస్వామ్యంతో జిల్లాలో ఘన వ్యర్థపదార్ధాలు తరలించి కాలుష్య రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు కృషి చేద్దామని జిల్లా కలెక్టర్‌ యస్‌ డిల్లీరావు అన్నారు. ఎన్‌టిఆర్‌ జిల్లాలో వ్యర్ధపదార్ధాల నిర్వహణ కేంద్రాల (క్లస్టర్‌) ఏర్పాటు పై ఘన వ్యర్థపదార్థాల నిర్వహణ టాస్క్‌ ఫోర్స్‌ కమిటి చైర్మన్‌, రాజ్యసభ సభ్యులు అళ్ళ అయోద్యరామిరెడ్డి, జిల్లా కలెక్టర్‌ యస్‌ డిల్లీరావు, జిల్లాలోని మున్సిపల్‌ కమీషనర్లతో శుక్రవారం కలెక్టర్‌ కార్యాలయం నందు జిల్లాలో వ్యర్థపదార్ధాల తరలింపు క్లస్టర్ల ఏర్పాటు పై చర్చించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ పట్టణాలతో పాటు గ్రామలలో కూడా సేకరించిన చెత్తను డపింగ్‌ యార్డ్‌లకు తరలించి ప్రైవేటు భాగస్వామ్యంతో వేస్ట్‌ మేనేజ్‌మెంట్‌ పద్దతుల ద్వారా రీసైక్లింగ్‌ చేసేలా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. విజయవాడ నగర పాలక సంస్థతో పాటు నందిగామ, కొండపల్లి, మైలవరం జగ్గయ్యపేట తిరువూరు మున్సిపాలిటిలో సేకరించిన చెత్తను క్లస్టర్లకు తరలించేందుకు క్లస్టర్ల ప్రాంతాలకు గుర్తించాలని విజయవాడ అర్భన్‌ ప్రాంతంలో మరో ఐదు క్లస్టర్‌ ప్రాంతాలను గుర్తించి మ్యాపింగ్‌ చేసేలా చర్యలు తీసుకోవాలన్నారు. రాజ్యసభ సభ్యులు అళ్ళ అయోద్యరామిరెడ్డి మాట్లాడుతూ పర్యావరణ పరిరక్షణలో ఎన్‌టిఆర్‌ జిల్లాను ఒక మోడల్‌ జిల్లాగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలను రూపొందించాలని సంబంధింత అధికారులకు సూచించారు. ప్రైవేటు భాగాస్వామ్యంతో, బివోటి పద్దతిలో గ్రామ స్థాయిలో కూడా చెత్తను సేకరించి మున్సిపాలిటి క్లస్టర్ల ద్వారా రీసైక్లింగ్‌ చేసేందుకు పర్యావరణ పరిరక్షణకు అవకాశలపై గల సాద్యసాద్యాలను గుర్తిస్తు మరో మారు క్షుణంగా చర్చించి చర్యలు తీసుకుందామని అయోద్యరామిరెడ్డి అన్నారు. వ్యర్థపదార్థాల తరలింపుపై మున్సిపల్‌ కమీషనర్లకు పలు సూచనలు ఇచ్చారు. విజయవాడ మున్సిపల్‌ కమీషనర్‌ స్వప్నిల్‌ దినకర్‌ పునకర్‌, జడ్పీ సిఇవో సూర్యా ప్రకాశ్‌, జిల్లాలో మున్సిపల్‌ కమీషనర్లు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *