విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలో భూముల రీసర్వే ల్యాండ్ రికార్డు ప్రక్రియను నిర్థేశించిన గడువులో పూర్తి చేయాలని ఏపిసేవా సర్వీసులను వార్డు సచివాలయంలో మాత్రమే రిజిస్ట్రర్ చేయాలని పెండిరగ్‌లో ఉన్న జగనన్న శాశ్వత భూ హక్కు రిజిస్ట్రేషన్లపై ప్రత్యేక దృష్టి సారించాలని జిల్లా కలెక్టర్ ఎస్ డిల్లీరావు తహాశీల్థార్లను ఆదేశించారు. జిల్లాలో భూముల రీసర్వే ల్యాండ్ రికార్డు ప్రక్రియ జగనన్న శాశ్వత భూ హక్కు రిజిస్ట్రేషన్లు, ఏపిసేవా సర్వీసులపై శుక్రవారం జిల్లా కలెక్టర్ తన కార్యాలయంలో జాయింట్ కలెక్టర్ ఎస్ నూపుర్ అజయ్‌లతో కలిసి జిల్లాలోని తహాశీల్థార్లతో వీడియోకాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ పిఒఎల్‌ఆర్ ప్రోఫార్మా ఒకటి నుండి 4వ వరకు 29 గ్రామాల్లో ల్యాండ్ రికార్డు ప్రక్రియలు పూర్తి చేయవలసి ఉందని ఇందుకు సంబంధించిన ప్రక్రియను ఈనెల 26వ తేది నాటికి పూర్తి చేయాలన్నారు. ప్రోఫార్మా 5 ద్వారా 20 గ్రామాల్లో రికార్డు ప్రక్రియకు పూర్తి చేయవలసి ఉందని వీలైనంత త్వరతో పూర్తి చేయాలన్నారు. మ్యూటేషన్, కరెక్షన్, డెటాఎంట్రీ, జూన్ 20 తేది నాటికి డ్రాప్టు ల్యాండ్ రిజిస్ట్రేషన్ (డిఎల్‌ఆర్) సిద్దంగా ఉంచాలన్నారు. భూముల రీసర్వే ల్యాండ్ రికార్డు ప్రక్రియలో ప్రోఫార్మాలను అనుసరించి తహాశీల్థార్, జాయింట్ కలెక్టర్, కలెక్టర్ పరిధిలో పరిష్కరించగలిగినవి వెంటనే పరిష్కరించాలని ఇతర శాఖలకు సంబంధించిన భూముల విషయంలో ఆయా శాఖల ద్వారా ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపవలసి వుంటుందని కలెక్టర్ తెలిపారు. సర్వే పనులు పూర్తి చేసేందుకు చర్యలు తీసుకోవాలన్నారు. జగనన్న శాశ్వత భూ హక్కు పథకం ద్వారా జిల్లాలో 6,200 ధరఖాస్తులు పెండిరగ్‌లో ఉన్నాయని తహాశీల్థార్లు వీటిపై ప్రత్యేక శ్రద్ద వహించాలన్నారు. సమస్యలు లేని భూముల రిజిస్ట్రేషన్ వెంటనే చేపట్టాలని, రిజిస్ట్రేషన్ కాని వాటికి సంబంధించి వ్యక్తులు మరణించడం, వలసవెళ్ళడం, అభ్యతరాలు ఎదురవడం వంటి కారణాలు ఉన్నట్లయితే అటువంటి వాటిని వెంటనే రెండు మూడు రోజుల్లో తిరస్కరించి నివేదికలను సమర్పించాలన్నారు. ఏపిసేవా సర్వీసులకు సంబంధించి ధరఖాస్తులను వార్డు సచివాలయలలో మాత్రమే తప్పనిసరిగా రిజిస్ట్రేషన్ చేసేలా తహాశీల్థార్లు చర్యలు తీసుకోవాలన్నారు. మ్యూటేషన్, కరెక్షన్లు, టైటిల్‌డీడ్స్ వంటి గుర్తించేటప్పుడు తగు జాగ్రత్తలు తీసుకుని దుర్వినియోగం కాకుండా తహాశీల్థార్లు భాధ్యత వహించాలని కలెక్టర్ తెలిపారు.
వీడిమోకాన్ఫరెన్స్‌లో జాయింట్ కలెక్టర్ ఎస్ నూపుర్ అజయ్, డిఆర్‌వో కె మోహన్‌కుమార్, సబ్ కలెక్టర్ జి ఎస్‌ఎస్ ప్రవీణ్‌చంద్,జిల్లాలోని ఆర్‌డివోలు తహాశీల్థారులు పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News