-జిల్లాలో ఒకేరోజు 2 లక్షల మంది మహిళలు దిశ యాప్ డౌన్‌లోడ్ లక్ష్యంగా స్పెషల్ డ్రైవ్..
-జిల్లా కలెక్టర్ యస్ డిల్లీరావు, నగర సిపి కాంతిరాణా టాటా
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
మహిళల మొబైల్ ఫోన్‌లో దిశ యాప్ ఉంటే వ్యక్తిగత అంగరక్షకుడు ఉన్నంత భద్రత లబిస్తుందని, అందుకే ప్రతీ ఒక్కరూ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలని నేడు జిల్లా వ్యాప్తంగా మోగా ఈవెంట్ స్పెషల్ డ్రైవ్ నిర్వహించడం ద్వారా 2 లక్షల మంది మహిళలు దిశ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకునేలా చర్యలు తీసుకున్నామని జిల్లా కలెక్టర్ యస్ డిల్లీరావు తెలిపారు.
జిల్లా వ్యాప్తంగా నిర్వహిస్తున్న దిశ యాప్ మోగా ఈవెంట్ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్ డిల్లీరావు శుక్రవారం నగరంలోని ఆయన కార్యాలయం నుండి నగర పోలీస్ కమీషనర్ కాంతిరాణాటాటా, జాయింట్ కలెక్టర్ ఎస్ నూపుర్ అజయ్, మున్సిపల్ కమీషనర్ స్వప్నిల్ దినకర్ పునకర్, సబ్ కలెక్టర్ జి ఎస్‌ఎస్ ప్రవీణ్‌చంద్‌లతో కలిసి లాంచనంగా ప్రారంభించారు. అనంతరం జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ మహిళలపై జరుగుతున్న అత్యాచారలు, హత్యలు, లైంగిక వేదింపులు వంటి వాటి నుండి రక్షణ పొందేందుకు రక్షణ కవచంగా ఏర్పాటు చేసిన దిశ యాప్ మహిళలకు తోడు ఉంటే వ్యక్తిగత భద్రత ఉన్నట్లేనని అందుకే ప్రతి ఒక్కరూ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకోవాలన్నారు. మహిళలు వారి సెల్‌ఫోన్‌లో యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకునేలా జిల్లా వ్యాప్తంగా దిశ యాప్ మోగా ఈవెంట్ నిర్వహిస్తున్నట్లు కలెక్టర్ తెలిపారు. మోగా ఈవెంట్ ద్వారా దాదాపు 2 లక్షల మంది యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకునేలా లక్ష్యంగా నిర్ణయించామన్నారు. అన్ని మండల కేంద్రాల్లో, మండలస్థాయి అధికారులు గ్రామాలలో గ్రామ సచివాలయాల సిబ్బంది, గ్రామ స్థాయి అధికారులు దిశ యాప్ మోగా ఈవెంట్ స్పెషల్ డ్రైవ్ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారన్నారు. ఇందులో విద్యార్థిని విద్యార్థులు, అంగన్‌వాడీ, ఆశా కార్యకర్తలు, స్వయం సహాయక బృందాల సభ్యులు, వాలంటీర్లు, ఏపిఒలు , స్వచ్ఛంద సంస్థ ప్రతినిధులు, మహిళ పోలీస్‌లు బృందాలుగా ఏర్పడి ప్రతి గ్రామం, పట్టణంలో పెద్ద ఎత్తున మహిళలు దిశ యాప్‌ను డౌన్‌లోడ్ చేసేకునేలా కృషి చేస్తున్నారన్నారు. దిశ యాప్ వలన అనేక మంచి ఫలితాలు ఉన్నాయని అన్నారు. అపద సమయంలో 100 మరియు 1098, 181 నెంబర్లకు గాని సమీప పోలీస్ స్ట్రేషన్‌కు గాని కాల్ చేయాల్సివచ్చినప్పుడు వీటన్నిటికి సంబంధించిన ఫీచర్స్ దిశ యాప్‌లో పొందుపరచి, యాప్‌ను రూపొందించినందన యాప్ ద్వారా సంబంధిత వారి నుండి సహయం పొందవచ్చునని కలెక్టర్ వివరించారు.
నగర పోలీస్ కమీషనర్ కాంతి రాణా టాటా మాట్లాడుతూ ప్రతి మహిళ దిశ యాప్‌ను డౌన్‌లోడ్ చేసేకునే లక్ష్యంగా ప్రత్యేక డ్రైవ్‌ను నిర్వహించాలని రాష్ట్ర డిజిపి ఆదేశాల మేరకు ఎన్‌టిఆర్ జిల్లాలో దిశ యాప్ మాస్ క్యాంపైన్‌ను నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ఇతర జిల్లాలలో పోలీస్ యంత్రాంగం మాత్రమే స్పెషల్ డ్రైవ్‌ను నిర్వహిస్తున్నారని ఎన్‌టిఆర్ జిల్లా కలెక్టర్ పిలుపు మేరకు జిల్లా యంత్రాంగం ప్రభుత్వ శాఖల అధికారులు సిబ్బంది వాలంటీర్లు స్వచ్చంద సంస్థల ప్రతినిధులు ముందుకు వచ్చి మోగా ఈవెంట్‌లో భాగస్వామ్యులైనందుకు అభినందిస్తున్నన్నారు. దిశ యాప్ కేవలం మహిళలు మాత్రమే కాదని పురుషులు కూడా వారి మొబైల్‌లో డౌన్‌లోడ్ చేసుకోవల్సిన అవసరం ఉందన్నారు. ముఖ్యంగా రోడ్డు ప్రమాదాలు సంభవించిన్నప్పుడు క్షతగాత్రులు కదలలేని పరిస్థితులో అపద సమయంలో పురుషులు దిశ యాప్‌ను ఉపయోగిచడం ద్వారా ఎదుటి వారికి పోలీస్ వైద్యం వంటి సహయం అందించేందుకు అవకాశం ఉంటుందన్నారు. దిశ యాప్ ఉపయోగించడం వలన వ్యక్తిగత సమాచారం బయటికి పోతుందని కొందరిలో అపోహాలు ఉన్నాయని వాటిని పూర్తిగా తొలిగించవలసిన అవసరం ఉందన్నారు. ఎటిపరిస్థితులో యాప్ కలిగిన వారి వ్యక్తిగత సమాచారానికి రహస్యంగా ఉంటుందని విషయాన్ని విసృత్తంగా ప్రచారం చేసి అపోహలు తొలగించవలిసిన అవసరం ప్రతి ఒక్కరిపై ఉందన్నారు. దిశ యాప్ గురించి ఇప్పటికే మీడియా ప్రజలను చైతన్యవంతులను చేస్తూనే ఉందని మరింత ప్రచారం కల్పించడం ద్వారా మహిళలందరూ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకునేలా కృషి చేయాలన్నారు. ఇటువంటి బృహత్తరమైన కార్యక్రమంలో భాగస్వామ్యులైన ప్రతి ఒక్కరికి పోలీస్ యంత్రాంగం పక్షాన ప్రత్యేక కృతజ్ఞతలు తెలియజేస్తున్నానని సిపి కాంతి రాణా టాటా తెలిపారు.
మున్సిపల్ కమీషనర్ స్వప్నిల్ దినకర్ పునకర్ మాట్లాడుతూ వార్డు వాలంటీర్లు మున్సిపల్ సిబ్బందికి యాప్ డౌన్‌లోడ్‌పై లక్ష్యాలను నిర్థేశించి క్యాంపైన్ నిర్వహిస్తున్నామని రైల్వేస్ట్రేషన్ బస్‌స్టాండ్ మార్కెట్‌లు షాపింగ్ మాల్స్ వంటి రద్దీ ప్రాంతాలలో వాలంటీర్ల ద్వారా ప్రజల మొబైల్స్‌లో దిశ యాప్‌ను డౌన్‌లోడ్ చేసుకునేలా చర్యలు తీసుకున్నట్లు వివరించారు.
అనంతరం దుర్గామల్లేశ్వరస్వామి దేవస్థానం, బస్‌స్టాండ్, లబ్బిపేట, బెంజ్‌సర్కిల్ తదితర ప్రాంతాలలో నిర్వహిస్తున్న స్పెషల్ డ్రైవ్‌లను జిల్లా కలెక్టర్ డిల్లీరావు, పోలీస్ కమీషనర్ కాంతిరాణా టాటా పరిశీలించి మహిళలచే దిశ యాప్‌ను డౌన్‌లోడ్ చేయించారు.
మోగా ఈవెంట్ స్పెషల్ డైవ్ ప్రారంభ కార్యాక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎస్ నూపుర్ అజయ్, సబ్ కలెక్టర్ జి ఎస్ ఎస్ ప్రవీణ్‌చంద్, జడ్పి సిఇవో సూర్యప్రకాశ్, ఐసిడిఎస్ పిడి జి. ఉమాదేవి, సోషల్ వెల్ఫేెర్ డిడి బివి విజయభారతి, జిల్లా మైనారిటి వెల్ఫేర్ రియాజ్ సుల్తానా, సిపివో లతిలదేవి, జిల్లా పౌర సరఫరాల అధికారి కోమలి పద్మా, జిల్లా హౌసింగ్ అధికారి వి.శ్రీదేవి, వివిధ శాఖల జిల్లా అధికారులు, పోలీస్ అధికారులు, అంగన్‌వాడీ సూపర్ వైజర్, ప్రభుత్వ హాస్టల్ విద్యార్థినిలు, పొల్గొన్నారు.
Prajavartha Online Telugu News