Breaking News

అభివృద్ధి పనులకు శంకుస్థాపన

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత ఈ రెండున్నర ఏళ్ళ కాలంలో ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి  అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు,చేస్తున్న అభివృద్ధి పట్ల ప్రజలలో వస్తున్న స్పందన,మద్దతు చూస్తుంటే వారి నాయకత్వం లో పని చేస్తున్నందుకు గర్వంగా ఉందని ఆ పార్టీ తూర్పు నియోజకవర్గ ఇన్ ఛార్జ్ దేవినేని అవినాష్ తెలిపారు.శనివారం తూర్పు నియోజకవర్గ పరిధిలోని స్క్రూ బ్రిడ్జి హై వే పక్కన డిప్యూటీ మేయర్ బెల్లం దుర్గ ఆధ్వర్యంలో దాదాపు 18లక్షల రూపాయల ప్రభుత్వ నిధులతో నిర్మిస్తున్న వర్మీ కంపోస్ట్ ప్రహరీ గోడ నిర్మాణ పనులకు శంకుస్థాపన చేయడం జరిగింది. ఈ సందర్భంలో అవినాష్ మాట్లాడుతూ 15వ డివిజన్ లో వైయస్సార్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన ఈ రెండున్నర ఏళ్ల కాలంలో 5 రోడ్లు, వాటర్ పైప్ లైన్ కొరకు దాదాపు 3కోట్ల రూపాయలు వెచ్చించి అభివృద్ధి కార్యక్రమాలు చేపట్టడం జరిగిందని,స్వర్గీయ దేవినేని నెహ్రూ గారు ఎమ్మెల్యే గా వున్నప్పుడు తప్ప గత టీడీపీ ప్రభుత్వం లో ఈ డివిజన్ లో అభివృద్ధి జరగలేదని విమర్శించారు. శ్మశాన వాటిక అభివృద్ధి కొరకు గత ప్రభుత్వం లో ఎమ్మెల్యే కు ఎన్నిసార్లు మొరపెట్టుకొన్న స్పందించలేదని,ఇప్పుడు వైసీపీ ప్రభుత్వం లో 70 లక్షల రూపాయల ప్రభుత్వ నిధులతో స్మశాన వాటికను అభివృద్ధి చేయడం జరిగిందని అన్నారు. అదేవిధంగా ఈ ప్రాంత వాసుల చిరకాల కోరిక రిటైనింగ్ వాల్ నిర్మాణం కూడా వీలైనంత త్వరగా పూర్తి చేసి వరద ముంపునకు శాశ్వత పరిష్కారం అందిస్తామని భరోసా ఇవ్వడం జరిగిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఫ్లోర్ లీడర్ వెంకట సత్యనారాయణ,మాజీ డిప్యూటీ మేయర్ ఆళ్ల చెల్లారావు,పార్క్ ఈ ఈ ప్రసాద్ మరియు వైస్సార్సీపీ నాయకులు,కార్యకర్తలు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *