-క్రీడాకారులను ప్రోత్సహించడంలో జగనన్న ప్రభుత్వం ముందుంటుంది: ఎమ్మెల్యే మల్లాది విష్ణు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
క్రీడాకారులను ప్రోత్సహించడంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ముందుంటుందని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ (SAAP) ఆధ్వర్యంలో ఏప్రిల్ 29 నుంచి మే 1వ తేదీ వరకు రాష్ట్రవ్యాప్తంగా నిర్వహించిన టెన్నీస్ లీగ్ లో పురుషుల విభాగంలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన విజయవాడ యువకుడు విహీత్ ను ఆంధ్రప్రభ కాలనీలోని తన కార్యాలయంలో శనివారం ఘనంగా సత్కరించారు. రాష్ట్రంలో వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పాటు అయ్యాక క్రీడాకారులను ఎంతగానో ప్రోత్సహిస్తున్నట్లు ఈ సందర్భంగా మల్లాది విష్ణు తెలిపారు. నియోజకవర్గ యువతలో ఎంతో క్రీడా నైపుణ్యం దాగి ఉన్నదని.. దానిని వెలికితీసేందుకు తనవంతుగా కృషి చేస్తున్నట్లు పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తున్న అవకాశాలను అందిపుచ్చుకుని యువత క్రీడల్లో రాణించి ఆంధ్రప్రదేశ్ పేరును ప్రపంచ దేశాలకు వ్యాపింపజేయాలని కోరారు. రాబోయే రోజుల్లో విహీత్ మరెన్నో రికార్డులు సొంతం చేసుకోవాలని మనస్ఫూర్తిగా ఆకాంక్షించారు.
Prajavartha Online Telugu News