Breaking News

ప్రజల నాడిని పసిగట్టేవి చిన్న పత్రికలే…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజల నాడిని పసిగట్టేవి చిన్న పత్రికలే అని అటువంటి చిన్న పత్రికలను ప్రభుత్వం ఆదుకోవాలని వాణిజ్య ప్రకటనలద్వారా సహకరిచాలని IJU అధ్యక్షులు కె. శ్రీనివాస్ రెడ్డి ఉద్బోధించారు. చిన్న పత్రికలో నైనా, పెద్దపత్రికలో నైనా, సత్యం సత్యమే నని ఆయన నొక్కి వక్కాణించారు. ఆదివారం విజయవాడ ప్రెస్ క్లబ్ లో జరిగిన నీలి మేఘం వారపత్రిక 5 వ వార్షికోత్సవ సభలో IJU ఉపాధ్యక్షులు అంబటి ఆంజనేయులు అధ్యక్షతన వహించారు. IJU అధ్యక్షులు కె. శ్రీనివాస్ రెడ్డి విశిష్ట అతిధిగా హాజరైయ్యారు. ముఖ్య అతిధులుగా సెంట్రల్ నియోజకవర్గ శాసన సభ్యులు మల్లాది విష్ణు, రాష్ట్ర ఫైబర్ నెట్ చైర్మన్ గౌతమ్ రెడ్డి, GSR దత్తు,జర్నలిస్ట్ నాయకులు నిమ్మరాజు చలపతిరావు, SK. బాబు, జయరాజు, దారం వెంకటేశ్వరావు, రామారావు పాల్గొన్న ఈ సభలో నీలి మేఘం వారపత్రిక ప్రధాన సంపాదకులు విన్నకోట శ్రీనివాస్ పాల్గొన్నారు. సభకు హాజరైన అతిధి ముఖ్య అతిధులు, జర్నలిస్ట్ యూనియన్ నాయకులకు సన్మాన కార్యక్రమం నిర్వహించారు. సభ చివరిగా విన్నకోట సాయి కిరణ్ వందన సమర్పణ చేశారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *