విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
విజయవాడ నగరపాలకసంస్థ పరిధిలోని వివిధ వార్డుల యందు సుమారు 196 మంది వార్డ్ వాలెంటిర్ల ఎంపిక కొరకు అర్హులైన నిరుద్యోగయువతీ, యువకుల నుండి ఆన్ లైన్ ద్వారా దరఖాస్తు చేసుకొనవచ్చు నని నగర కమిషనర్, స్వ ప్ని ల్ దినకర్ పుండ్క ర్.,ఐ.ఏ.ఎస్ ఈ ప్రకటన ద్వారా తెలియజేసారు. వార్డ్ వాలెంటీర్ల కొరకు ధరఖాస్తు చేసుకొనే వారు 10 వతరగతి (SSC) ఉతీర్ణులై ఉండవలెనని, 19-05-2022 నాటికి 18 సంవత్సరములు నిండి, 35 సంవత్సరములు లోపు గలవారై నగర పరిధిలో నివసించు అభ్యర్థులు మాత్రమే అర్హులు అని ఆసక్తి గల నిరుద్యోగయువతీ, యువకులు ధరఖాస్తు చేసుకొని ఈ అవకాశాన్ని సద్వి నియోగ పరచుకోవాలని పేర్కొ న్నా రు. దీనికి సంబందించి అర్జిదారులు పూర్తి విద్యా అర్హతల మరియు ఇతర దృవీకరణ పత్రములను జతపరచి http://40.81.241.107/APVOLUNTEER20/apVolunteer090420201049.vt వెబ్ సైట్ ద్వారా 26-05-2022 తేది లోపుగా ధరఖాస్తు చేసుకొనవలెనని తెలియజేసారు. ఇతర వివరాల కొరకు అదనపు కమీషనర్ ( P ) లేదా వార్డు సెక్రటేరియట్ స్పెషల్ సెల్ ఫోన్ నెంబర్ 8185933187 కు సంప్రదించాలని పేర్కొ న్నా రు.
Prajavartha Online Telugu News