Breaking News

మత తత్వాలను రేచకొట్టే విధంగా వున్నాయి కోనసీమలో జరుగుతున్న సంఘటనలు… : మాల మహాసేన

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో జరుగుతున్న కులతత్వ రాజకీయాలకు అడ్డాగా మారుతోందని, కోనసీమలో జరిగినా వివాదాస్పద ఘటన ద్వారా రుజువు అవుతున్నదని మాల మహాసేన రాష్ట్ర కోఆర్డినేటర్ పీటర్ జోసెఫ్ అన్నారు. బుధవారం జరిగిన నిరసన కార్యక్రమంలో  పీటర్ జోసెఫ్ మాట్లాడుతూ కోనసీమకు అంబేద్కర్  పేరు ప్రకటించినందుకు వ్యతిరేక నిరసన కార్యక్రమాలు ఒక రాష్ట్ర ప్రభుత్వ ప్రజాప్రతినిధి అయినా ఒక మంత్రి ఇంటిని చుట్టుపక్కల ప్రాంతాల తగలబెట్టడం చాలా బాధాకరమైన విషయం. అంబేద్కర్  పేరు పెట్టినందుకు ఇలాంటి నిరసనలు వెల్లువెత్తడం చాలా బాధాకరం రాష్ట్రమంతటా రాష్ట్ర ప్రజల మనోభావాలు దెబ్బతీసే విధంగా ఉన్నాయన్నారు. రాష్ట్రంలో కుల చిచ్చు పెట్టే విభజన చేసి పాలించాలని రాష్ట్ర ప్రభుత్వం సంకల్పం అనే అర్థం అవుతున్నది ఆ విధంగానే పరిపాలన జరుగుతున్నదన్నారు. కృష్ణా జిల్లా కి ఎన్టీఆర్ పేరు పెట్టినందుకు ఏ ఒక్కరూ వ్యతిరేకించలేదు కడప జిల్లాకు వైయస్సార్ పేరు పెట్టినందుకు నిరసనలు గాని వ్యక్తం చేయలేదు దానిని అందరూ స్వాగతిస్తారు కానీ ఒక భారత రాజ్యాంగం రాసిన మహా మేధావి భారతరత్న డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ పేరు పెట్టినందుకు ఎందుకు ఇలాంటి వ్యతిరేక నినాదాలు ఇస్తున్నారని ఆయన పెట్టిన రాజ్యాంగ భిక్ష పరంగా అందరూ ఎంత సంతోషంగా ఉన్నాం రాజ్యాంగం అడ్డుపెట్టుకొని అధికారాలు, అధికారం చేపడతారు కానీ మహానుభావుడు పేరు పెట్టినందుకు నిరసన కార్యక్రమాలు చేయడం చాలా బాధాకరమన్నారు. మరి ఈ ప్రభుత్వం వీటిని అరికట్టటం పోతే దళితులు చిత్తశుద్ధితో వ్యవహరించకపోతే తీవ్రమైన పరిణామాలు ఎదుర్కొంటారని హెచ్చరించడం జరుగుతుందన్నారు. మరి ఈ ప్రభుత్వం ప్రజల మధ్య కావాలని కుల రాజకీయాలను చేసి ప్రజల చిచ్చుపెట్టి ప్రజలను విడగొట్టి విధంగా రాష్ట్రం తయారవుతుందని దానికి అనుకూలంగా ఈ రాష్ట్ర ప్రభుత్వం పరిపాలన కొనసాగుతోందని అర్థమవుతున్నదన్నారు. మచిలీపట్నానికి ఎన్టీఆర్ జిల్లా పేరు పెట్టకుండా కృష్ణాజిల్లా అని పెట్టి విజయవాడకు ఎన్టీఆర్ జిల్లా పెట్టి ఎక్కడ ప్రజల మనోభావాలను దెబ్బతీసే విధంగా చేయాలని అనుకున్నారు. కానీ ఇక్కడ ప్రజలు ఎంతో మంచి స్వభావం కలిగి ఉండడంతో చాకచక్యంగా వ్యవహరించి ఆ నిర్ణయాన్ని స్వాగతించడం జరిగింది. ఈ విధంగా ప్రభుత్వం వైఫల్యం చెందింది. మొన్న కాకినాడలో జరిగిన దళిత యువకుడు సుబ్రమణ్య హత్యను తప్పుదోవ పట్టించే ఎమ్మెల్సీ అనంత బాబు ని కాపాడుకోడానికి ప్రజలను డైవర్ట్ చేయడానికి ఈ విధంగా కోనసీమ ప్రజలను రెచ్చ గొట్టే ఆ కేసును తప్పుదోవ పట్టించేందుకు రాష్ట్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని అర్థమవుతుంది ఈ నిరసన కార్యక్రమాలు చేసి ప్రజలను రెచ్చగొట్టే విధంగా నిరసన కార్యక్రమాలు చేస్తున్నా వీరి వెనక ఉన్న అదృశ్య శక్తులు ఎవరో పాలకపక్షంమా? లేదా ప్రతిపక్షంమా? తెలియజేయాలని నిరసన కారులను వెంటనే అరెస్ట్ చేయాలని పోలీసు వ్యవస్థ వారిని కోరడం జరుగుతుందన్నారు.ఈ కార్యక్రమానికి పీటర్ జోసెఫ్ మాల మహాసేన రాష్ట్ర కోఆర్డినేటర్, లెనిన్ బాబు కృష్ణ డిస్ట్రిక్ అధ్యక్షులు, పృధ్వీ వైభవ్ విజయవాడ నగర అధ్యక్షులు, బండి ప్రదీప్ కుమార్ విజయవాడ యూత్ అధ్యక్షులు, బాలగోపాల్ యూత్ ఉపాధ్యక్షులు, ఇతర నాయకులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *