Breaking News

జిల్లాలలో భూముల రీసర్వే ప్రక్రియను గడువులోగా పూర్తి చేసేలా చర్యలు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
జిల్లాలలో భూముల రీసర్వే ప్రక్రియను గడువులోగా పూర్తి చేసేలా చర్యలు తీసుకుంటున్నామని జిల్లా కలెక్టర్‌ ఎస్‌. ఢల్లీిరావు సిసిఎల్‌ఏ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి. సాయి ప్రసాద్‌కు వివరించారు. రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లాల కలెక్టర్లు, జాయింట్‌ కలెక్టర్లతో గురువారం సిసిఎల్‌ఏ ప్రధాన కార్యాలయం నుండి జగనన్న శాశ్వత భూహక్కు భూ రక్ష పథకంలో భాగంగా భూముల రీసర్వే ప్రక్రియపై సిసిఎల్‌ఏ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి. సాయి ప్రసాద్‌ వీడియోకాన్ఫరెన్స్‌ నిర్వహించారు. నగరంలోని జిల్లా కలెక్టర్‌ కార్యాలయం నుండి వీడియోకాన్ఫరెన్స్‌ ద్వారా కలెక్టర్‌ ఎస్‌ డిల్లీరావు మాట్లాడుతూ వైఎస్‌ఆర్‌ జగనన్న శాశ్వత భూ హక్కు, భూ రక్ష పథకంలో భాగంగా రీసర్వే పనులు జిల్లాలో చురుగ్గా జరుగుతున్నాయన్నారు. జిల్లాలో భూ సర్వే పూర్తి చేయవల్సినవి 16 గ్రామాలు ఉండగా వాటిలో 10 గ్రామాలను నిర్థేశించిన సమయానికి పూర్తి చేస్తామని తెలిపారు. జిల్లాలో తిరువూరు, విస్సన్నపేట, గంపలగూడెం, ఏ కొండూరు, రెడ్డిగూడెం, జగ్గయ్యపేట, కంచికచర్ల మండలాలలోని 115 గ్రామాలలో రిసర్వే లో భాగంగా డ్రోన్‌ఫైయింగ్‌ చేపట్టడం జరిగిందని, వీటిలో 17 గ్రామాలలో డ్రోన్‌ఫైయింగ్‌ పూర్తి చేయడం జరిగిందన్నారు. వీటిలో కంచికచర్ల మండలం పరిటాల గ్రామంలో గ్రౌండ్‌ వాలిడేషన్‌ పూర్తి అయిందన్నారు. 11 గ్రామాలలో గ్రౌండ్‌ ట్రూతింగ్‌ పూర్తి చేశామని మిగిలి ఐదు గ్రామాలలో గ్రౌండ్‌ ట్రూతింగ్‌ వివిధ దశలలో ఉన్నాయన్నారు. గ్రౌండ్‌ వాలిడేషన్‌లో భాగంగా ఒక గ్రామం పూర్తి చేశామని 10 గ్రామాలు వివిధ దశలో ఉన్నాయని కలెక్టర్‌ డిల్లీరావు సిసిఎల్‌ఏ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జి. సాయి ప్రసాద్‌కు వివరించారు. అనంతరం భూ సర్వేపై సంబంధిత జిల్లా అధికారులకు కలెక్టర్‌ సూచనలు ఇస్తూ జరుగుతున్న భూముల రీసర్వే పనులు వేగవంతం చేయాలని, పెండిరగ్‌లో ఉన్న గ్రామాలపై ప్రత్యేక దృష్టి సారించాలన్నారు. న్యూటేషన్‌ కూడా పూర్తి చేయాలని, అలసత్వం వహించిన వారిపై తగిన చర్యలు తీసుకోవాలని జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌ నూపుర్‌ అజయ్‌కు కలెక్టర్‌ సూచించారు. జరుగుతున్న భూ సర్వే ప్రక్రియపై ప్రతీ రోజు సాయంత్రం 5 గంటలకు నివేదికలు పంపే విధంగా చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ డిల్లీరావు అధికారులను ఆదేశించారు. వీడియోకాన్ఫరెన్స్‌లో జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌ నుపూర్‌ అజయ్‌కుమార్‌, జిల్లా సర్వే అండ్‌ ల్యాండ్‌ రికాడ్స్‌ ఆఫీసర్‌ కె. సూర్యరావు ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *