Breaking News

మనిషికి అమ్మవలే ఊరికి అంగన్‌వాడీ తల్లిలాంటిది…

-బాల్య సంరక్షణపైనే బాలల భవిష్యత్‌ ఆధారం…
-అంగన్‌వాడీ సూపర్‌వైజర్లకు బాలల సంరక్షణపై సంపూర్ణ శిక్షణ అవసరం…
-జిల్లా కలెక్టర్‌ యస్‌ డిల్లీరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
బాల్యదశనుండే చిన్నారులలో నైపుణ్యాన్ని మరింత పెంపొందించేందుకు అవసరమైన కార్యకలాపాలపై అంగన్‌వాడీ కార్యకర్తలకు పూర్తి అవగాహనతో కూడిన శిక్షణ అవసరం అని జిల్లా కలెక్టర్‌ యస్‌ డిల్లీరావు అన్నారు.
అంగన్‌వాడీ కేంద్రాలలో చిన్నారులకు సృజనాత్మకతతో కూడిన ఆటపాటలతో చదువులను కొనసాగించేందుకు అవసరమైన శిక్షణ అందించేందుకు అజీమ్‌ ప్రేమ్‌జీ పౌండేషన్‌ మాస్టర్‌ ట్రైనర్‌ ఉమామహేశ్వరరావు ఆధ్వర్యంలో జిల్లాకు చెందిన అంగన్‌వాడీ సూపర్‌వైజర్లు, సిడిపివోలకు నగరంలోని కలెక్టర్‌ క్యాంప్‌ కార్యాలయ వీడియోకాన్ఫరెన్స్‌ హాల్‌లో నిర్వహించిన ఒకరోజు శిక్షణ కార్యక్రమాన్ని జిల్లా కలెక్టర్‌ డిల్లీరావు జ్వోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అంగన్‌వాడీ కేంద్రాల్లో బాల్య దశనుండే చిన్నారులకు పటిష్టమైన పునాదివేసి ఆటపాటలతో కూడిన విద్యను అందించడంలో మరింత శిక్షణ అవసరం ఉందన్నారు. కార్పొరేట్‌ పాఠశాలలకు, కాన్వెంట్‌లకు ధీటుగా అంగన్‌వాడీ కేంద్రాలలో అన్ని మౌలిక వసతులు కల్పిస్తున్నామన్నారు. వాటిని సద్వినియోగం చేసుకుని వారిలో నైపుణ్యాన్ని మెరుగుపరచడానికి అజీమ్‌ ప్రేమ్‌జీ పౌండేషన్‌ మాస్టర్‌ ట్రైనర్‌
ఉమామహేశ్వరరావు శిక్షణ ఎంతో దొహాదపడుతుందన్నారు. పిల్లలలో నైపుణ్యాన్ని పెంపొందించేందు కాలమానాన్ని రూపొందించడం జరిగిందని రానున్న జూన్‌ మాసం నుండి నూతన విధానాన్ని అమలోకి తీసుకురావడం జరిగిందన్నారు. ముఖ్యంగా 3 నుండి 6 సంవత్సరాల పిల్లల ఎదుగుదలకు అవసరమైన వాతావరణం సాదారణంగా ఇంటివద్దనే లభిస్తుందని అలాంటి వాతావరణాన్ని అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా కల్పించాలన్నారు. జిల్లాలో 8 ఐసిడిఎస్‌ ప్రొజెక్టుల ద్వారా 1475 అంగన్‌వాడీ కేంద్రాల్లో 3 నుండి 6 సంవత్సరాల వయస్సు గల 21,327 మంది పిల్లలకు సంరక్షణ అందిస్తున్నామని జిల్లా కలెక్టర్‌ వివరించారు.
అంగన్‌వాడీ కేంద్రాల ద్వారా చిన్నారులకు మంచి అలవాట్లు, సంభాషణ, అభినయ గేయాలు, సాంసృతిక కార్యక్రమాలు, సృజనాత్మక అంశాలు, శారీరక సాంఫీుక అభివృద్ధి, మేధోభివృద్ధి భాషాభివృద్ధి, గణితాభివృద్ధి మరియు భావోద్యేగాభివృద్ధి తదితర అంశాలపై ఉమామహేశ్వరరావు అంగన్‌వాడీ సూపర్‌వైజర్లు, సిడిపివోలకు ప్రయోగాత్మకమైన శిక్షణ అందించారు.
శిక్షణా కార్యక్రమంలో జాయింట్‌ కలెక్టర్‌ ఎస్‌ నూపూర్‌ అజయ్‌, జిల్లా శిశు సంక్షేమ అధికారి జి.
ఉమాదేవి, జిల్లాకు చెందిన సిడిపివోలు జి. మంగమ్మ, నాగమణి, రేణుక, గ్లోరి, సత్యవతి, లలిత, దీప్తి, అంగన్‌వాడీ సూపర్‌వైజర్లు ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *