Breaking News

నాటక రంగాన్ని ప్రోత్సహించి పూర్వ వైభవాన్ని తీసుకురావాలి…

-కలెక్టర్‌ యస్‌ డిల్లీరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
కళాకారులను ప్రోత్సహించి మన సంస్కృతిని సంప్రదాయాలను అద్దంపట్టే నాటక రంగం అంతరించి పోకుండా కాపాడుకోవాలసిన భాధ్యత అందరిపై ఉందని జిల్లా కలెక్టర్‌ యస్‌ డిల్లీరావు పేర్కొన్నారు. నాటకరంగం అభివృద్ధికి పూర్వ వైభవాన్ని తీసుకువచ్చేందుకు చేపట్టావలసిన చర్యలుపై జిల్లాలోని వివిధ కళాకారుల సంఘాలు, నాటక రంగం సంస్థల ప్రతినిధులు, టూరిజం, యువజన సంక్షేమ అధికారులతో శనివారం కలెక్టర్‌ కార్యాలయం నుండి జిల్లా కలెక్టర్‌ యస్‌ డిల్లీరావు గూగుల్‌ కాన్ఫరెన్స్‌ నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ మన సంస్కృతి సంప్రదాయాలను తెలియజేసే విధంగా పద్య, గేయ నాటికలు సత్య హరిచంద్ర, శ్రీ కృష్ణపాండవీయం, కురుక్షేత్రం వంటి నాటకాలు ప్రదర్శించే అద్భుతమైన కళాకారులు కూచిపూడి, భరతనాట్యం కళాకారులు మన జిల్లాకు చెందిన వారు ఉన్నారన్నారు. ప్రతీ ఏటా ఏప్రిల్‌ 16వ తేదీ నాటక రంగానికి ఆద్యుడు కీర్తశేషులు కందుకూరి వీరేశలింగం పంతులు గారి జయంతి రోజున నాటక రంగ దినోత్సవం జరుపుకుంటున్నామన్నారు. గతంలో నాటక రంగం ఎంతో ఆదరణతో ఉండేదని ప్రస్తుత సమాజంలో నాటకాలు కనుమరుగవుతున్నాయన్నారు. కళాకారుల సంఘ ప్రతినిధుల సూచనల మేరకు నగరంలోని తుమలపల్లి కళాక్షేత్రాన్ని మరింత అభివృద్ధి చేసి నెలలో రెండు రోజులు నాటకల ప్రదర్శనకు కేటాయించడానికి చర్యలు తీసుకుంటామన్నారు. నాటకరంగ సంస్థలు కళాక్షత్రంలో వారోత్సవాలు జరుపుకుని నాటకాలు ప్రదర్శించదలచుకుంటే అద్దె చెల్లింపులో రాయితీ కల్పించేలా కృషి చేస్తామన్నారు. నాటకరంగం పై యువతలో అవగాహన కల్పించేందుకు అవగాహన సదస్సులు యూత్‌ ఫె˜స్టవల్‌ నిర్వహించేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. కళారంగానికి సిఎస్‌ఆర్‌ నిధులు కేటాయించేలా ప్రభుత్వానికి తగు ప్రతిపాదానలు పంపేందుకు చర్యలు తీసుకుంటామన్నారు. గూగుల్‌ కాన్ఫరెన్స్‌లో డిఆర్‌వో కె.మోహన్‌కుమార్‌, జిల్లా టూరిజం ఆఫీసర్‌ రామలక్ష్మి, జిల్లా యూత్‌ వెల్పేర్‌ ఆఫీసర్‌ శ్రీనివాస్‌, కళారంగ ప్రతినిధులు యం ప్రసాద్‌, వాసు, యంఎస్‌ చౌదరి, పివిపి కృష్ణ, సిహెచ్‌ చిట్టిబాబు తదితరులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *