Breaking News

ఆహార భద్రత ప్రమాణాల చట్టం-2006…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
లైసెన్సు లేకుండా అనధికారికంగా నిర్వహిస్తున్న మినరల్ వాటర్ ప్లాంట్లలను (ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ యూనిట్స్) మూసి వేసే విధంగా చర్యలు తీసుకోవాలని జిల్లా కలెక్టర్ యస్ డిల్లీ రావు ఫుడ్ కంట్రోలర్, సేఫ్టీ అధికారులను ఆదేశించారు. ఆహార భద్రత ప్రమాణాల చట్టం-2006 జిల్లాలో అమలు జరుగుతున్న తీరుపై ఆదివారం జిల్లా కలెక్టర్ ఢిల్లీ రావు నగరంలోని కలెక్టరేట్ నుండి ఫుడ్ సేఫ్టీ కంట్రోలింగ్ అధికారులు, మున్సిపల్ కమిషనర్, డిఆర్ఓ, డిపిఓ తో గూగుల్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని ప్యాకేజ్డ్ డ్రింకింగ్ వాటర్ యూనిట్స్ తనిఖీలు నిర్వహించాలని, హైకోర్టు ఉత్తర్వుల మేరకు బిఐఎస్ ప్రమాణాలను పాటించని, లైసెన్సులు లేకుండా అనధికారంగా నిర్వహిస్తున్న వాటిని మూసి వేసే విధంగా చర్యలు తీసుకోవాలన్నారు. స్కూలు న్యూట్రిషన్, ఎడ్యుకేషన్ ప్రోగ్రాం లో భాగంగా విద్యాశాఖ సమన్వయంతో ఈట్ రైట్ స్కూల్,ఈట్ రైట్ క్యాంపస్ పై పాఠశాల విద్యార్థులకు అవగాహన కల్పించాలన్నారు. ప్రతిరోజు ఫుడ్ సేఫ్టీ కంట్రోలింగ్ అధికారులు డైరీ ప్రొడక్ట్స్, హోటల్స్, రెస్టారెంట్, వాటర్ ప్లాంట్లు తప్పనిసరిగా తనిఖీలు నిర్వహించాలని అన్నారు. స్ట్రీట్ ఫుడ్ వెండర్స్ కు నెస్లే కంపెనీ ఆధ్వర్యంలో జూన్ మూడో వారంలో శిక్షణ ఇచ్చేందుకు అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. రెస్టారెంట్లలలో ఆహార పదార్థాల తయారీకి వాడి మిగిలిపోయిన నూనెలలో బయో డీజిల్ తయారీదారులకు మాత్రమే అమ్మకాలు చేయాలన్నారు. ఫుడ్ సేఫ్టీ లైసెన్సులు రిజిస్ట్రేషన్ కొరకు మేళాలు నిర్వహించాలన్నారు. పాలు, ఆయిల్, బియ్యం, గోధుమపిండి, ఉప్పు వంటి ఫోర్టిఫైడ్ ఆహార ఉత్పత్తుల అమ్మ కాలను నిర్వహించేలా చర్యలు తీసుకోవాలని కలెక్టర్ ఢిల్లీ రావు ఆదేశించారు. టెలీ కాన్ఫరెన్స్ లో మున్సిపల్ కమిషనర్ స్వప్నిల్ దినకర్ పునకర్, డిఆర్ఓ కె.మోహన్ కుమార్, డిపిఓ చంద్రశేఖర్, అసిస్టెంట్ ఫుడ్ కంట్రోలర్ పూర్ణచంద్రరావు ఉన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఈగల్ పోస్టర్లను, డ్రగ్స్ వద్దు బ్రో బ్యానర్ ను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్, ఎస్పి లు

-ఆపరేషన్ త్రిశూల్’లో భాగంగా డ్రగ్స్, మహిళల భద్రత, రోడ్డు ప్రమాదాల నియంత్రణకు సమగ్ర కార్యాచరణ -మైక్రో లెవెల్‌లో సమస్యలను గుర్తించి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *