Breaking News

రాజ్ భవన్ లో గవర్నర్ ను కలిసిన కాంగ్రెస్ పార్టీ నేతలు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రాష్ట్రంలో జరుగుతున్న పలు సంఘటనలపై ఆదివారం విజయవాడ రాజ్ భవన్ లో కాంగ్రెస్ పార్టీ ముఖ్య నేతలు గవర్నర్ బిశ్వ భూషణ్ హరిచందన్ ను కలిశారు. ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఉపాధ్యక్షులు జంగా గౌతమ్, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ ఆర్గనైజేషన్ ఇంచార్జి రాజీవ్ రతన్, విజయవాడ నగర కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు నరహరిశెట్టి నరసింహారావు, ఆంధ్రప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అడ్మినిస్ట్రేషన్ ఇంచార్జి నూతలపాటి రవికాంత్, ఆర్ టీ ఐ చైర్మన్ పి.వై కిరణ్ కుమార్ తదితరులు ఉన్నారు. కోనసీమలో ఇటీవల జరిగిన పరిణామాలతో పాటు ఇటీవల జరిగిన డ్రైవర్ సుబ్రహ్మణ్యం హత్య కేసులో ఎంఎల్సీ అనంతబాబు పాత్ర, ప్రశాంతంగా ఉండే పచ్చని కోన సీమ జిల్లాలో అసాంఘిక శక్తుల అరాచకాలు తదితర అంశాలను వారు గవర్నర్ కు వివరించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *