Breaking News

ఇంటింటికి ఇంధన సామర్ధ్య ఫలాలు..

-గృహ వినియోగదారులకు స్టార్ రేటెడ్ ఎలక్ట్రానిక్ గృహోపకరణాలు ..
-పైలట్ ప్రాజెక్ట్ కు విధివిధాలను రూపొందించండి… విద్యుత్ సంస్థలకు ఏపీఈఆర్సి ఆదేశం
-గృహ వినియోగ రంగంలో ఇంధన సామర్థ్యం పెంచడమే లక్ష్యం
-పైలట్ ప్రాజెక్ట్ ప్రారంభించేందుకు ఇంధన శాఖ కార్యదర్శి ఆమోదం
-ప్రతి ఇంటికి ఇంధన సామర్ధ్య ప్రయోజనాలు..
-ఇంధన సామర్థ్యం తో ఇళ్లలో విద్యుత్ వినియోగం తగ్గుదల .. బిల్లుల్లో ఆదా
-మెరుగుపడనున్న జీవన ప్రమాణాలు, పర్యావరణం
-ఇంధన సామర్థ్యంతో కూడిన లైట్లు, ఫ్యాన్లు , ఏసి లు సరఫరాకు విద్యుత్ సంస్థల ప్రతిపాదన
-ఎల్ఈడీ లైట్లు,బీఎల్డీసి ఫ్యాన్లు , స్టార్ రేటెడ్ ఏసిలతో 25 నుంచి 30 శాతం విద్యుత్ ఆదాకు అవకాశం
-ఇంధన సామర్థ్యంతో ఇంధన భద్రత, ఆర్థికాభివృద్ధి , పర్యావరణ పరిరక్షణ
-అన్ని ప్రభుత్వ శాఖలు, సంస్థలతో సమన్వయము చేసుకోండి: విద్యుత్ సంస్థలకు ఏపీఈఆర్సి సూచన
-ఆన్ బిల్ ఫైనాన్సింగ్, అప్ ఫ్రంట్ మోడల్ పై విధివిధానాలు రూపొందించండి
-అల్పాదాయ వర్గాలవారు నెలవారీ వాయిదాల్లో చెల్లించేందుకు వెసులు బాటు కల్పించండి
-ఏపీ ఈఆర్సి చైర్మన్ , జస్టిస్ సి వీ నాగార్జున రెడ్డి

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
గృహ వినియోగదారులకు స్టార్ రేటెడ్ ఎలక్ట్రానిక్ గృహోపకరణాల సరఫరా చేసే ప్రాజెక్ట్ను ప్రారంభించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుంది. తొలుత పైలట్ ప్రాజెక్ట్ గా ప్రారంభించేందుకు రాష్ట్ర ఇంధన శాఖ ఆమోదం తెలిపింది. పైలట్ ప్రాజెక్ట్ విజయవాడ, విశాఖపట్నం , తిరుపతి లో విజయవంతంగా పూర్తయిన తర్వాత, దశలవారీగా ఉపకరణాలను రాష్ట్ర వ్యాప్తంగా సరఫరా చేయడానికి ప్రభుత్వం యోచిస్తోంది. దీనికి సంబంధించి ఆన్ బిల్ ఫైనాన్సింగ్ మోడల్ , అప్ ఫ్రంట్ మోడల్ పై విధివిధానాలను రూపొందించాల్సిందిగా ఏ పీ సీడ్కో , డిస్కాములను ఏపీ ఎలక్ట్రిసిటీ రెగ్యూలేటరీ కమిషన్ (ఏపీఈఆర్సి) ఆదేశించింది.

విద్యుత్ సంస్థలతో జరిగిన వెబినార్ లో ఇంధన సామర్థ్యంతో కూడిన ఎలక్ట్రానిక్ గృహోపకరణాలను సరఫరా చేయటం పై ఏపీఈఆర్సి చైర్మన్ జస్టిస్ సి వీ నాగార్జున రెడ్డి పలు సూచనలు చేసారు . రాష్ట్రం లోని గృహ వినియోగదారులకు స్టార్ రేటెడ్ ఎయిర్ కండీషనర్ లు , ఫ్యాన్లు , ట్యూబ్ లైట్లు వంటి వాటిని సరఫరా చేయడం పై ఏ పీ సీడ్కో, డిస్కాములకు ఆదేశాలు ఇచ్చారు . ఈ స్టార్ రేటెడ్ గృహోపకరణాలు వాడటం వల్ల ఇళ్లలో విద్యుత్ వినియోగం తగ్గడం , తద్వారా నెలవారీ కరెంటు బిల్ కూడా తగ్గుతుంది. అంతేగాక ఈ ఎలక్ట్రానిక్ వస్తువుల వాడకం వల్ల ఇళ్లలో వెలువడే కాలుష్య వాయువులు తగ్గి ఆరోగ్యకరమైన వాతావరణం ఏర్పడుతుంది. అంతిమంగా ఇది పర్యావరణ పరిరక్షణకు దోహదపడుతుందని ఏపీఈఆర్సి చైర్మన్ తెలిపారు.

ఒక అంచనా ప్రకారం రాష్ట్రంలోని మొత్తం విద్యుత్ డిమాండ్ లో 25 శాతం గృహాల్లోనే వినియోగమవుతుంది. గ్రామాల నుండి నగరాల వరకు దాదాపు ప్రతి ఇంట్లో ఎలక్ట్రానిక్ వస్తువుల వినియోగం పెరగటం వల్ల నానాటికి విద్యుత్ డిమాండ్ భారీగా పెరుగుతుంది. ఈ నేపథ్యంలో ఇంధన సామర్థ్యంతో కూడిన స్టార్ రేటెడ్ గృహోపకరణాలు వినియోగించడం వల్ల ఇళ్లలో చేసే విద్యుత్ వినియోగం తగ్గి , కరెంటు బిల్లులు కూడా తగ్గుతాయి. అంతేగాక స్టార్ రేటెడ్ ఉపకరణాలు నాణ్యత కలిగి ఎక్కువ కాలం పని చేయటం వల్ల గృహ వినియోగదారులకు ఆర్థికంగా ప్రయోజనకరంగా ఉంటుంది. ఇది వారి జీవన ప్రమాణాలను మెరుగు పరుస్తుంది.

ఈ దృష్ట్యా ఆసక్తి కలిగిన గృహ వినియోగదారులకు ఈ పైలట్ ప్రాజెక్ట్ ద్వారా స్టార్ రేటెడ్ ఉపకరణాలను పంపిణి చేయాలనీ విద్యుత్ సంస్థలకు ఏపీఈఆర్సి చైర్మన్ సూచించారు . అయితే అల్పాదాయ వర్గాల వారు ఒకేసారి పెద్ద మొత్తం వ్యయం చేసి ఎలక్ట్రానిక్ వస్తువులు కొనే అవకాశాలు తక్కువగా ఉంటాయి. దీనిని దృష్టిలో ఉంచుకొని ఆన్ బిల్ ఫైనాన్సింగ్ మోడల్ ను అమలు చేయాల్సిందింగా సూచించారు . దీనిలో వినియోగదారులు నెల వారి వాయిదా పద్దతిలో కొంత మొత్తం చొప్పన వస్తువుల ధర చెల్లించాల్సి ఉంటుంది. అలాగే ఒకేసారి కొనగలిగిన వారికి అప్ ఫ్రంట్ మోడల్ ను కూడా రూపొందించడం జరిగింది . ఈ రెండు పద్ధతుల్లోనూ కొనేవారికి వస్తువు ధర పై కొంత మేర డిస్కౌంట్ కూడా లభిస్తుంది.

స్టార్ రేటెడ్ గృహోపకరణాల వినియోగం పై పెద్ద ఎత్తున వినియోగదారులలో అవగాహనా కల్పించాలని ఏపీఈఆర్సి చైర్మన్ విద్యుత్ సంస్థలకు సూచించారు. ఈ పథకం అమలు ద్వారా రాష్ట్రములో ప్రతి ఇంటికి ఇంధన సామర్ధ్య ప్రయోజనాలను తీసుకు వెళ్లవచ్చునని తెలిపారు. ఇంధన సామర్థ్యం వల్ల ప్రతి కుటుంబం ఆర్థికంగా, అలాగే కాలుష్యం తగ్గడం వల్ల ఆరోగ్యపరంగా కూడా ప్రయోజనం పొందుతుందని పేర్కొన్నారు.

ఈ పథకానికి సంబందించి ఏ పీ స్టేట్ ఎనర్జీ ఎఫిసిఎన్సీ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ (ఏపీ సిడ్కో) సమర్పించిన ప్రతిపాదనలను ఇంధన శాఖ కార్యదర్శి బీ శ్రీధర్ ఆమోదించారు.ఈ ప్రతిపాదనను ఏ పీ సీడ్కో త్వరలోనే ఏపీఈఆర్సి అనుమతికి సమర్పించనుంది . ఒక అంచనా ప్రకారం దేశం లో కేవలం 35 శాతం గృహ వినియోగదారులకు మాత్రమే స్టార్ రేటెడ్ గృహోపకరణాల పై అవగాహన ఉంది. ఇంధన సామర్థ్యంతో కూడిన ఎల్ఈడీ లైట్లు,బీఎల్డీసి ఫ్యాన్లు , స్టార్ రేటెడ్ ఏసిలతో 25 నుంచి 30 శాతం విద్యుత్ ఆదాకు అవకాశం. ఈ స్టార్ రేటెడ్ ఎలక్ట్రానిక్ వస్తువులను తీసుకునేందుకు స్వచ్చందంగా ముందుకు వచ్చే వినియోగదారులకు ఈ పథకాన్ని అమలు చేస్తారు . అలాగే డిస్కాముల పై ఆర్థిక భారం పడకుండా ఈ పథకాన్ని అమలు చేయడం జరుగుతుంది.

వినియోగదారుల ప్రయోజనాలు పరిరక్షించడంలో ఇంధనం సామర్థ్యం కీలక పాత్ర పోషిస్తుందని ఏపీఈఆర్సి చైర్మన్ తెలిపారు. గృహ వినియోగదారులు విద్యుత్ పై చేసే వ్యయాన్ని తగ్గించేందుకు దోహదపడుతుంది. అలాగే అన్ని రంగాల్లో ఇంధన సామర్ధ్యం కార్యక్రమాలను అమలు చేయడం ద్వారా విద్యుత్ డిమాండ్ ను కొంత మేర తగ్గించేందుకు , వాతావరణ కాలుష్యాన్ని తగ్గించి పర్యావరణ పరిరక్షణకు ఇది దోహదకారి అవుతుంది. రాష్ట్ర ఇంధన భద్రత సాదించేందుకు ఇది దోహదకారి అవుతుంది అని ఏపీఈఆర్సి చైర్మన్ తెలిపారు. ఈ దృష్ట్యా రాష్ట్రంలో అన్ని రంగాలలో ఇంధన సామర్ధ్యాన్ని ప్రవేశ పెట్టేందుకు ఇతర ప్రభుత్వ శాఖలతో సమన్వయం చేసుకోవాలని విద్యుత్ సంస్థలకు ఆయన సూచించారు.

రాష్ట్రం లోని అన్ని రంగాల్లో ఇంధన పరిరక్షణ, ఇంధన సామర్ధ్య కార్యక్రమాలను అమలు చేసేందుకు డిస్కాములు , ప్రభుత్వ సంస్థలు , అందరు భాగస్వాములతో చర్చించి వివిధ కార్యక్రమాలు రూపొందించుకోవాలని ఏపీ రాష్ట్ర ఇంధన పరిరక్షణ మిషన్ కు ఏపీఈఆర్సి చైర్మన్ సూచించారు.

ఏపీఈఆర్సి సభ్యలు , పీ రాజగోపాల్ రెడ్డి , ఠాకూర్ రామ సింగ్ , ఇంధన శాఖ కార్యదర్శి , బీ శ్రీధర్, జెఎండీ ఏపీట్రాన్స్కో , ఐ పృథ్వి తేజ్ , డిస్కామ్ సిఎండీలు , హెచ్ హరనాథ రావు , జె పద్మ జనార్ధన రెడ్డి , కె సంతోష రావు తదితర సీనియర్ అధికారులు పాల్గొన్నారు

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *