Breaking News

శాచ్యురేషన్ పద్ధతిలో సంక్షేమం: ఎమ్మెల్యే మల్లాది విష్ణు

-63 వ డివిజన్ 273 వ వార్డు సచివాలయ పరిధిలో గడప గడపకు మన ప్రభుత్వం

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ప్రజల పెట్టుకున్న నమ్మకాన్ని ఎప్పటికప్పుడు రెట్టింపు చేసుకుంటూ సీఎం వైఎస్ జగన్మోహన్‌రెడ్డి రాష్ట్రంలో సుపరిపాలన అందిస్తున్నారని ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. 63 వ డివిజన్ – 273 వ వార్డు సచివాలయం పరిధిలో సోమవారం జరిగిన గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి ప్రజల నుంచి విశిష్ట ఆదరణ లభించింది. డిప్యూటీ మేయర్ అవుతు శ్రీశైలజారెడ్డి, వైఎస్సార్ సీపీ డివిజన్ కార్పొరేటర్ మోదుగుల తిరుపతమ్మ, పార్టీ శ్రేణులతో కలిసి కార్యక్రమంలో ఎమ్మెల్యే పాల్గొన్నారు. కొత్త రాజీవ్ నగర్ నుంచి పాదయాత్ర ప్రారంభించి 600కి పైగా గడపలను సందర్శించారు. సంక్షేమ పథకాల అమలు తీరుపై ఆరా తీశారు. శాచ్యురేషన్ పద్ధతిలో అమలవుతున్న సంక్షేమ కార్యక్రమాలపై ప్రజలు పూర్తిస్థాయిలో సంతృప్తి వ్యక్తం చేయడం ఎంతో ఆనందాన్ని కలిగించిందన్నారు. 273వ సచివాలయ పరిధిలో ఇప్పటివరకు రూ. 2 కోట్ల సంక్షేమాన్ని పేద ప్రజలకు అందించినట్లు వివరించారు. వైఎస్సార్ పింఛన్ కానుక ద్వారా 290 మందికి ప్రతినెలా రూ. 6.70 లక్షలు అందిస్తున్నట్లు తెలిపారు. అమ్మఒడి ద్వారా 467 మందికి రూ. 52.80 లక్షలు., విద్యాదీవెన ద్వారా 76 మందికి రూ. 9.03 లక్షలు., చేయూత ద్వారా 60 మందికి రూ. 11.25 లక్షలు., వాహనమిత్ర ద్వారా 45 మందికి రూ. 4.50 లక్షలు., కాపు నేస్తం ద్వారా 43 మందికి రూ. 6.45 లక్షలు., ఈబీసీ నేస్తం ద్వారా 24 మందికి రూ.3.60 లక్షల ఆర్థిక సాయం అందించినట్లు వివరించారు. ఈ మొత్తం సాయాన్ని నేరుగా నగదు బదిలీ ద్వారా లబ్ధిదారుల ఖాతాలలో జమ చేసినట్లు తెలియజేశారు.

అలాగే 63వ డివిజన్ లో అభివృద్ధికి సంబంధించి ఇప్పటివరకు రూ. 5.65 కోట్ల పనులు మంజూరైనట్లు మల్లాది విష్ణు వెల్లడించారు. వీటిలో రూ. 2.54 కోట్ల పనులు పూర్తి కాగా.. రూ. 1.04 కోట్ల పనులు జరుగుతున్నట్లు వెల్లడించారు. మరో రూ. 2 కోట్ల పనులు టెండర్ దశలో ఉన్నట్లు పేర్కొన్నారు. ఈ సందర్భంగా గత చంద్రబాబు అవినీతి పాలనకు, సీఎం వైఎస్ జగన్ సుపరిపాలనకు మధ్య వ్యత్యాసాన్ని వివరించారు. ఎన్నికలకు 3 నెలల ముందు ఓట్ల కోసం చంద్రబాబు పింఛన్ పెంచితే.. ఈ ప్రభుత్వం మూడేళ్ల పాటు పెంచిన పింఛన్ ను వృద్ధులు, వితంతువులు, వికలాంగులకు అందించిందని వివరించారు. తెలుగుదేశం హయాంలో నియోజకవర్గంలో 17 వేలు మాత్రమే ఉన్న ఫింఛన్లను.. శాచ్యురేషన్ పద్ధతిలో 25 వేలకు పెంచిన ఘనత జగనన్న ప్రభుత్వానికే దక్కుతుందన్నారు. అవినీతి, వివ‌క్ష లేని పార‌ద‌ర్శక పాల‌న‌కు నాంది పలుకుతూ తీసుకొచ్చిన గ్రామ‌/ వార్డు స‌చివాల‌యాలు, వాలంటీర్ల వ్యవ‌స్థ దేశానికే ఆద‌ర్శంగా నిలిచాయన్నారు. గ్రామ స్థాయి నుంచి రాష్ట్ర స్థాయి వరకు సుస్థిర అభివృద్ధి సాధించేందుకు ప్రణాళికబద్ధంగా పథకాలు అమలు చేస్తూ.. నవరత్నాలతో నవయుగానికి నాంది పలికిన సీఎం జగన్మోహన్ రెడ్డికి అండగా నిలవాలని కోరారు. అనంతరం సీఎం జగనన్న సుపరిపాలన మూడేళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా కేట్ కట్ చేసి శుభాకాంక్షలు తెలుపుకున్నారు. కార్యక్రమంలో జోనల్ కమిషనర్ రాజు, డీఈ(ఇంజనీరింగ్) గురునాథం, ఏఈ (ఎలక్ట్రికల్) కృష్ణారెడ్డి, నాయకులు మోదుగుల గణేష్, పసుపులేటి యేసు, సీహెచ్ రవి, టెక్కం కృష్ణ, లొనగాని నాగు, తిరుపతిరావు, నాగేశ్వరరావు, పార్టీ శ్రేణులు, సచివాలయం సిబ్బంది పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

గణనాధుడిని సందర్శించి పూజా కార్యక్రమంలో పాల్గొన్న మాజీ మంత్రి దేవినేని ఉమా

కంచికచర్ల, నేటి పత్రిక ప్రజావార్త : ఎన్టీఆర్ జిల్లా, కంచికచర్ల పట్టణంలో వినాయక చవితి ఉత్సవాలలో భాగంగా సెంట్రల్ బ్యాంక్ …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *