Breaking News

గరీబ్ కల్యాణ్ సమ్మేళన్ కార్యక్రమాన్ని ప్రారంభించనున్న ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

-దేశ వ్యాప్తంగా ఉన్న కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్దిదారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా ముఖాముఖి సంభాషణ
-విశాఖపట్టణం నుంచి లబ్దిదారులతో పాటు ప్రధానితో వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొననున్న కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్ & జలమార్గాలు మరియు అయుష్ శాఖా మంత్రి  సర్బానంద సోనోవాల్
-రాజమండ్రి నుంచి లబ్దిదారులతో పాటు ప్రధానితో వీడియో కాన్ఫరెన్స్ లో పాల్గొననున్న కేంద్ర నైపుణ్య అభివృద్ధి, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖల సహాయ మంత్రి  రాజీవ్ చంద్రశేఖర్

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
రేపు హిమా చల్ ప్రదేశ్లోని సిమ్లాలో ప్రధానమంత్రి  నరేంద్ర మోదీ గరీబ్ కల్యాణ్ సమ్మేళన్ కార్యక్రమాన్ని ఉదయం గం.11లకు ప్రారంభించనున్నారు. ఇందులో భాగంగా కేంద్ర ప్రభుత్వ పథకాల ద్వారా ప్రత్యక్షంగా లబ్దిదారులతో సంభాషిస్తారు. వీడియో కాన్ఫరెన్స్ ద్వారా జరిగే ఈ జాతీయ స్థాయి కార్య క్రమంలో కేంద్రం అమలు చేస్తున్న 16 పథకాల ద్వారా ప్రయోజనం పొందుతున్న లబ్ధిదారులతో ఆయన ముచ్చ టించనున్నారు. తొమ్మిది మంత్రిత్వ శాఖల ద్వారా ఈ సంక్షేమ పథకాలు అమలవుతున్నాయి. ఈ పథకాల వలన మన దేశంలో పది కోట్ల మంది పైగా లబ్ది పొందుతున్నారు. ఆజాదీ కా అమృత్ మహోత్సవ్ కార్యక్రమంలో భాగంగా ఈ సమావేశాన్ని నిర్వ హించనున్నారు. మన రాష్ట్రానికి సంబంధించి విశాఖపట్టణం, రాజమండ్రి ల్లో ఈ కార్యక్రమం జరగనుంది. విశాఖపట్టణానికి సంబంధించి కళావాణి ఆడిటోరియం (పోర్టు ట్రస్టు) లో 31వ తేదీ మంగళవారం ఉ. 9 గం. నుండి, ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. ఈ కార్యక్రమంలో కేంద్ర ఓడరేవులు, షిప్పింగ్ & జలమార్గాలు మరియు అయుష్ శాఖా మంత్రి  సర్బానంద సోనోవాల్ పాల్గొంటున్నారు. ఈయనతో పాటుగా కేంద్ర మాజీ మంత్రి సురేష్ ప్రభు సైతం పాల్గొంటున్నారు. రాజమండ్రి కి సంబంధించి సెంట్రల్ జైల్ రోడ్ లోని మంజీరా సరోవర్ ప్రీమియర్ లో ఈ కార్యక్రమాన్ని నిర్వహించేందుకు ఏర్పాట్లు పూర్తయ్యాయి. కేంద్ర నైపుణ్య అభివృద్ధి, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ శాఖల సహాయ మంత్రి శ్రీ రాజీవ్ చంద్రశేఖర్ లబ్దిదారులతో పాటు ఈ కార్యక్రమంలో పాల్గొననున్నారు. ఈయనతో పాటుగా మాజీ కేంద్ర మంత్రి శ్రీ. వై. సుజనా చౌదరి పాల్గొంటారు.
ఈ పథకాలన్నీ దేశంలోని పేద ప్రజల సమస్యలను ఉద్దేశించినవి కాబట్టి, ఈ కార్యక్రమానికి “గరీబ్ కళ్యాణ్ సమ్మేళన్” (పేదల సంక్షేమ సమ్మేళనం) అని పేరు పెట్టారు. ఈ కార్యక్రమ ముఖ్య ఉద్దేశం లబ్దిదారులతో ముఖా ముఖి సంభాషణే కాకుండా పథకాల వలన పౌరుల జీవన విధానంలో పొందిన మార్పు, వారి సంతృప్తిని తెలుసుకోవడం కూడా. 2047 సంవత్సరానికి స్వాతంత్ర్యం పొంది 100 సంవత్సరాలు పూర్తి అవుతున్న సందర్భంగా… దేశ పౌరుల ఆకాంక్షను అంచనా వేయడానికి ఈ కార్యక్రమం ఉపయోగపడుతుంది. జిల్లా స్థాయిలో కృషి విజ్ఞాన కేంద్రాల్లో ఉదయం 9.45 గంటలకు ఈ కార్యక్రమం ప్రారంభం కానుంది. ఉదయం 11 గంటలకు దీన్ని జాతీయ కార్యక్ర మంతో అనుసంధానం చేస్తారు.
ఈ సమ్మేళనంలో  ప్రధాన మంత్రి ఒకేసారి పలు జిల్లాలలోని లబ్దిదారులతో గృహనిర్మాణం, త్రాగునీరు, పౌష్టికాహార లభ్యత, ఆరోగ్యం, జీవనోపాధి మరియు ఆర్థిక సాధికారతకు సంబంధించిన విస్తృత పథకాలు/కార్యక్రమాల ప్రభావం గురించి సంభాషిస్తారు. ఈ పథకాలు/కార్యక్రమాలు:
(i) ప్రధాన మంత్రి ఆవాస్ యోజన (గ్రామీణ &పట్టణ)
(ii) ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి
(iii) ప్రధాన మంత్రి ఉజ్వల యోజన
(iv) పోషణ్ అభియాన్
(v) ప్రధాన మంత్రి మాతృ వందన యోజన
(vi) స్వచ్ఛ భారత్ మిషన్ (గ్రామీణ&పట్టలు)
(vii) జల్ జీవన్ మిషన్ & అమృత్
(viii) ప్రధాన మంత్రి స్వనిధి పథకం
(ix) ఒక దేశం – ఒక రేషన్ కార్డ్
(x) ప్రధాన మంత్రి గరీజ్ కళ్యాణ్ అన్న యోజన
(xi) ఆయుష్మాన్ భారత్ PM జన ఆరోగ్య యోజన
(xii) ఆయుష్మాన్ భారత్ – హెల్త్ అండ్ వెల్నెస్ సెంటర్
(xii) ప్రధాన మంత్రి ముద్ర యోజన
అనంతరం, ప్రధాన మంత్రి కిసాన్ సమ్మాన్ నిధి యొక్క 11వ విడతను కూడా విడుదల చేసి, వీడియో కాన్ఫరెన్సింగ్ ద్వారా దేశవ్యాప్తంగా ఉన్న కొంతమంది లబ్ధిదారులతో సంభాషిస్తారు.

ఈ కార్యక్రమం దూరదర్శన్ ద్వారా, జాతీయ మరియు ప్రాంతీయ ఛానెల్లలో ప్రత్యక్ష ప్రసారం అవుతుంది. ఈ జాతీయ కార్యక్రమాన్ని My Gov ద్వారా వెబ్కాస్ట్ చేయడానికి కూడా నిబంధనలు రూపొందించబడ్డాయి. దీనిని యూట్యూబ్, ఫేస్బుక్, ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ మొదలైన ఇతర సోషల్ మీడియా ఛానెల్ల ద్వారా కూడా వీక్షించవచ్చు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *