Breaking News

పొగాకు, గుట్కా, ఖైనీ వంటి మత్తుపదార్థాలను వ్యతిరేకించి ఊపిరితిత్తులు, క్యాన్సర్‌ సంబంధిత వ్యాధులకు దూరంగా ఉండాలి…

-ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం కార్యక్రమంలో జిల్లా కలెక్టర్‌ యస్‌ డిల్లీరావు

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
పొగాకు గుంట్కా, ఖైనీ వంటి మాదకద్రవ్యాలకు యువత దూరంగా ఉండాలని జిల్లా కలెక్టర్‌ యస్‌ డిల్లీరావు పిలుపు నిచ్చారు. మే 31వ తేదీ ప్రపంచ పొగాకు వ్యతిరేక దినోత్సవం సందర్భంగా మంగళవారం నగరంలోని కలెక్టరేట్‌ వీడియో కాన్ఫరెన్స్‌ హాల్‌లో పొగాకు ఉత్పత్తుల వాడకం వల్ల కలిగే అనర్థాలు పై అవగాహన కల్పించే పోస్టర్లను కలెక్టర్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా కలెక్టర్‌ మాట్లాడుతూ పొగాకు ఉత్పత్తులు వాడే వారే కాకుండా వారి సమీపంలో కూడా వాటి ప్రభావం ఉంటుందన్నారు. బహిరంగ ప్రదేశాలలో పొగ తాగడం నిషేదం ఉందని, విద్యాసంస్థలు, కళాశాలలు, దేవాలయాలకు 100 మీటర్ల పరిధిలో పొగాకు, గుట్కా, ఖైనీ వంటి ఉత్పత్తుల అమ్మకాలు జరపకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నామన్నారు. పొగాకు వినియోగంతో ఊపిరితిత్తులు పాడవడం తద్వారా క్యాన్సర్‌కు దారి తీసి ప్రాణాలు కొల్పోయే ప్రమాదం ఉందన్నారు. నోటి క్యాన్సర్‌, ఊపిరితిత్తుల క్యాన్సర్‌ వంటి ప్రమాదకరమైన రోగాలకు దారితీసి ప్రాణాలు కోల్పొవడం జరుగుతుందని అన్నారు. వాడిన సిగిరెట్లు, బీడి, పొగాకులు వాడి పడేయడం వల్ల వాయు కాలుష్యం, జల కాలుష్యం కూడా సంభవిస్తాయని, మట్టిలో కలవకుండా 8 నుండి 10సంవత్సరాల వరకు మట్టి కాలుష్యానికి కారణం అవుతాయి అన్నారు. పొగాకు ఉత్పత్తుల అలవాటు పడిన వారు మానుకునేందుకు జిల్లా ఆసుపత్రి, ప్రాథమిక ఆరోగ్య, కేంద్రాల్లో కౌన్సిలర్స్‌ ద్వారా కౌన్సిలింగ్‌ నిర్వహించడం జరుగుతుందన్నారు. ఆన్‌లైన్‌ ద్వారా కౌన్సిలింగ్‌ ఇవ్వడం జరుగుతుందని ఇందుకు 18004252024 టోల్‌ఫ్రీ నెంబర్‌ను ఏర్పాటు చేశామన్నారు. కోట్పాఆక్ట్‌ జిల్లాలో కట్టుదిట్టంగా అమలు చేసేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామన్నారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతోపాటు స్థానిక ప్రభుత్వం కూడా పొగాకు నిషేద ఉత్పత్తుల అమ్మకాలు జిల్లాలో జరగకుండా కట్టుదిట్టమైన చర్యలు తీసుకుంటున్నట్లు కలెక్టర్‌ తెలిపారు. ప్రముఖ ఆధ్యాత్మిక కేంద్రం తిరుమలలో టోబాకో ఫ్రీ జోన్‌ గా ప్రకటించినట్లుగానే శ్రీ దుర్గామల్లేశ్వర స్వామి వేంచేసియున్న ఇంద్రకీలాద్రిపై కూడా టోబాకో ఫ్రీ జోన్‌గా ప్రకటించే విధంగా నిర్ణయం తీసుకోవడం జరుగుతుందని కలెక్టర్‌ అన్నారు. ఈ సందర్భంగా పొగాకుకు వ్యతిరేకంగా కలెక్టర్‌ యస్‌ డిల్లీరావు అధికారులతో ప్రతిజ్ఞ చేయించారు.
ఈ కార్యక్రమంలో డియంహెచ్‌వో యం సుహసిని, అడిషనల్‌ డియంహెచ్‌వో డా.ఉషారాణి,టోబాకో కంట్రోల్‌ ప్రోగ్రామ్‌ ఆఫీసర్‌ డా. ప్రశాంత్‌, విశ్వ భ్రాహ్మణ కార్పొరేసన్‌ చైర్మన్‌ తోలేటి శ్రీకాంత్‌, గౌడ కార్పొరేషన్‌ చైర్మన్‌ యం శివరామకృష్ణ, భట్రాజు కార్పారేషన్‌ చైర్‌పర్సన్‌ కూరపాటి గీతాంజలిదేవి, కేంద్ర ప్రభుత్వ పథకాల లబ్దిదారులు పాల్గొన్నారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

అగ్రిగోల్డ్ లో పూర్తి డబ్బు చెల్లించి, ప్లాట్లు రిజిస్ట్రేషన్ చేసుకున్న వారికి మొదటి విడతలో న్యాయం

-బాధితుల నుంచి బాండ్ల సేకరణకు 20 ప్రత్యేక బృందాలు ఏర్పాటు -బాండ్ల జిరాక్స్ కాపీలు బాధితులు ప్రత్యేక బృందాలకు అప్పగించాలి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *