Breaking News

ఫ్రీ మెట్రిక్‌ స్కాలర్‌షిప్‌ల కొరకు జూన్‌ 10వ తేదీ లోగా ధరఖాస్తులు…

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
స్కావెంజర్స్‌, టెన్నర్స్‌, వేస్ట్‌పిక్కర్స్‌ కుటుంబాల వారికి చెందిన విద్యార్థులకు ఫ్రీ మెట్రిక్‌ స్కాలర్‌షిప్‌ల కొరకు జూన్‌ 10వ తేదీ లోగా ధరఖాస్తులు చేసుకోవాలని జిల్లా సాంఫీుక సంక్షేమ శాఖ అధికారి బి. విజయభారతి ఒక ప్రకటనలో తెలిపారు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల నిధుల నుండి స్కావెంజర్స్‌, టెన్నర్స్‌, వేస్ట్‌పిక్కర్స్‌ చెందిన విద్యార్థులకు ఫ్రీ మెట్రిక్‌ స్కాలర్‌షిప్‌ల ద్వారా ఆర్థిక సహాయం అందించే కార్యక్రమంలో భాగంగా స్కాలర్‌షిప్‌ల మంజూరు కొరకు అర్హులైన విద్యార్థులు జూన్‌ 10వ తేదీ లోగా వారి ధరఖాస్తులను అన్‌లైన్‌ ద్వారా ధరఖాస్తు చేసుకోవాలని బి.విజయభారతి తెలిపారు. స్కావెంజర్స్‌, టెన్నర్స్‌, వేస్ట్‌పిక్కర్స్‌ చెందిన పిల్లలకు ఆర్థిక సహాయం అందించడమే లక్ష్యంగా, (డ్రాప్‌అవుట్స్‌) బడిమానకుండా ప్రొత్సహించేలా ప్రాధమిక స్థాయి నుండి 10వ తరగతి చదువుతున్న రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలలో సెట్రల్‌ బోర్డు ద్వారా గుర్తింపు పొందిన పాఠశాలలో చదివే వారికి ఈ పథకం వర్తిస్తుందన్నారు. స్కావెంజర్స్‌, టెన్నర్స్‌, వేస్ట్‌పిక్కర్స్‌, క్లీనింగ్‌ గల పిల్లలకు ఈ పథకం వర్తిస్తుందన్నారు. ఈ పథకం ద్వారా డేస్‌కాలర్‌ ద్వారా చదివేవారికి ఏడాదికి 3 వేల రూపాయలు, వసతి గృహాల్లో ఉంటూ చదివేవారికి ఏడాదికి 8 వేల రూపాయలు అందిస్తామన్నారు. దీనిలో 60 శాతం కేంద్రప్రభుత్వం, మిగిలిన 40 శాతం రాష్ట్ర ప్రభుత్వం నుండి ఆర్థిక సహాయం అందిస్తారన్నారు. ధరఖాస్తు చేసుకునే విధ్యార్థులు సంబంధిత ప్రోఫార్మా పూర్తి చేసి తల్లిదండ్రుల సంతకాలు చేయించి గ్రామ వార్డు సచివాలయాల్లో అందజేయాలన్నారు. ధరఖాస్తు ఫారం కొరకు WEA /WEDPS. ద్వారా అన్‌లైన్‌లో డౌన్‌లోడ్‌ చేసుకుని జూన్‌ 10వ తేది లోపు పూర్తి చేసిన ధరఖాస్తులను సమర్పించాలని బి. విజయ భారతి ఆ ప్రకటనలో తెలిపారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఈగల్ పోస్టర్లను, డ్రగ్స్ వద్దు బ్రో బ్యానర్ ను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్, ఎస్పి లు

-ఆపరేషన్ త్రిశూల్’లో భాగంగా డ్రగ్స్, మహిళల భద్రత, రోడ్డు ప్రమాదాల నియంత్రణకు సమగ్ర కార్యాచరణ -మైక్రో లెవెల్‌లో సమస్యలను గుర్తించి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *