Breaking News

రైల్వేలో ఉద్యోగ అవకాశాల పేరుతో వంచిస్తున్న మోసగాళ్ల పట్ల జాగ్రత్త

విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
భారతీయ రైల్వేలోని వివిధ కార్యాలయాల్లో ఉద్యోగాలు ఇప్పిస్తామని అమాయక ఉద్యోగ ఆశావహులను కొందరు మోసగాళ్లు మోసగిస్తున్న ఘటనలు మా దృష్టికి వచ్చాయి. రైల్వేలో ఉద్యోగాలు ఆర్‌ఆర్‌బీ మరియు ఆర్‌ఆర్‌సీ ద్వారా ఉద్యోగ ప్రకటనలు ప్రచురించిన తర్వాత నిర్వహించే పరీక్షలలో ఉత్తీర్ణులయిన అభ్యర్థులను మాత్రమే ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు. రైల్వే ఉద్యోగాలు ఆశించే అభ్యర్థులు డబ్బుకు ఆశపడి మోసగించే ఇటువంటి నేరగాళ్లను ఆశ్రయించవద్దని హెచ్చరించడమైనది. ఉద్యోగాలకు సంబంధించిన సరైన సమాచారమంతా ఎప్పటికప్పుడు ఆర్‌ఆర్‌బీ/ఆర్‌ఆర్‌సీ/ఎస్‌సీఆర్‌ వైబ్‌సైట్లలో తెలియజేబడుతుంది. ఈ నియామకాలలో ఎటువంటి మధ్యవర్తిత్వాలకు అవకాశాలు ఉండవని స్పష్టంగా తెలియజేయబడుతుంది. రైల్వే ఉద్యోగం నేరుగా పొందడానికి ఎలాంటి దగ్గర దారులు ఉండవని ఆశావహులు గమనించాలి. ఇటువంటి మోసాలకు పాల్పడేవారి బారిన పడవద్దని మరియు వారిని నమ్మి మోసపోవద్దని సాధారణ ప్రజలకు సూచించడమైనది. రైల్వేలో అన్ని ఉద్యోగాల నియామకాలను పారదర్శక పద్థతిలో ఆర్‌ఆర్‌బి / ఆర్‌ఆర్‌సి ద్వారా మాత్రమే నిర్వహిస్తారని దక్షిణ మధ్య రైల్వే జనరల్‌ మేనేజర్‌ (ఇన్‌చార్జి) శ్రీ అరుణ్‌ కుమార్‌ జైన్‌ ఈ సందర్భంగా తెలియజేశారు. మోసగించే దళారుల పట్ల జాగ్రత్తగా ఉండాలని మరియు రైల్వే అధికారులు, సిబ్బంది వలే మోసపూరితంగా ప్రవరిస్తూ వాగ్ధానాలు చేసే వారిని నమ్మవద్దని ఆయన ఉద్యోగ ఆశావహులకు సూచించారు.

అతి తక్కువ ఖర్చుతో న్యూస్ వెబ్సైట్.. ఈ పేపర్ స్టార్ట్ చేయండి

Check Also

ఈగల్ పోస్టర్లను, డ్రగ్స్ వద్దు బ్రో బ్యానర్ ను ఆవిష్కరించిన జిల్లా కలెక్టర్, ఎస్పి లు

-ఆపరేషన్ త్రిశూల్’లో భాగంగా డ్రగ్స్, మహిళల భద్రత, రోడ్డు ప్రమాదాల నియంత్రణకు సమగ్ర కార్యాచరణ -మైక్రో లెవెల్‌లో సమస్యలను గుర్తించి …

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *