-యం.డి హజీరాబేగం, రాష్ట్ర ఉపాధ్యక్షురాలు
విజయవాడ, నేటి పత్రిక ప్రజావార్త :
ఉద్యోగుల ఎంతగానో పదకొండవ పిఆర్ సి పై ఆశలు పెట్టుకుని రావలసిన రాయితీలు నాయకులు సాధిస్తారని, ఆశలతో ఉంటే ఆ పి ఆర్ సి లో రావలసిన నటువంటివి సాధించలేక, ఉద్యోగుల హక్కులుకాలరాసి పోతున్న,నాయకులు ఓడీల కోసం ప్రత్యేక సెలవులకోసం అర్రులు సాస్తూ, స్వప్రయోజనాల కోసం ప్రభుత్వ కనుసన్నల్లో పడ్డానికి నాయకులు చేసుకున్న ప్రయత్నం లో సఫలమైనారని పి ఆర్ సి లో సాధించినవి చెప్పలేనటు వంటి నాయకులు నేటికీ మీటింగులు పెట్టి గత పిఆర్.సి లోని అంశాలను మాట్లాడుతూ వాటిని సాధించలేక చతికిలపడ్డ ఉద్యోగ సంఘ నాయకులు నైతిక బాధ్యత వహించి ఉద్యోగులకు క్షమాపణలు చెప్పవలసిన వారు ప్రభుత్వానికి క్షమాపణలు చెప్పడం రాజ్యాంగ విరుద్ధమని ఉద్యోగులకు క్షమాపణ లు చెప్పాలని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగుల సర్వీస్ అసోసియేషన్ రాష్ట్ర ఉపాధ్యక్షురాలు ప్రకాశం జిల్లా కార్యవర్గ నాయకుల విలేకరుల సమావేశం ముఖ్యఅతిథిగా పాల్గొని డిమాండ్ చేశారు.
జిల్లా అధ్యక్షుడుటి విజయ్ కుమార్ మాట్లాడుతూ ఉద్యోగుల హక్కుల కోసం నిరంతర శ్రామికుడు గా హక్కుల కోసం శ్రమించే హక్కుల గొంతుక రాష్ట్ర అధ్యక్షుడు వినుకొండ రాజారావు ఆధ్వర్యంలో బాధిత ఉద్యోగులకు ప్రకాశం జిల్లాలో భరోసా కల్పించాలని అన్ని తాలూకాలలో కార్యవర్గం ఏర్పాటు చేసి సంఘం బలోపేతానికి కృషి చేయనున్నామని జిల్లా అధ్యక్షుడు టి. విజయ్ కుమార్ తెలియజేశారు.
జిల్లా ప్రధాన కార్యదర్శి జి ఆశాజ్యోతి మాట్లాడుతూ ఇప్పుడు ఉద్యోగ లోకమంతా పటిష్టమైన నాయకత్వం కోసం ఎదురు చూస్తున్నారని అలాగే మెరుగైన చికిత్స కోసం ఇ.హెచ్ యస్ ఉద్యోగుల కాంట్రిబ్యూషన్ తో వైద్య ఆరోగ్య సేవలు అందాలని ప్రభుత్వం ఉద్యోగులకు ఇ.హెచ్.యస్. కార్డు ద్వారా చికిత్స చేయాలనే లక్ష్యంనకు విఘాతం. కలుగుతుందని, అనేక కార్పొరేట్ ఆసుపత్రులు చికిత్స చేయకుండా నిరాకరిస్తూ, మహిళా ఉద్యోగుల అనారోగ్య విషయాలలో మెరుగైన వైద్యం కోసం చికిత్సలకోసం ఇ.హెచ్ ఎస్ కార్డు తీసుకొని వెళితే మెరుగైన చికిత్స అందించే విధంగా ప్రభుత్వం ప్రత్యేక చట్టం చేయాలని,తిరస్కరించే కార్పొరేట్ ఆసుపత్రుల గుర్తింపును రద్దు చేయాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షుడు వినుకొండ రాజారావు,యం.డి.హజీరాబేగం,టి.విజయ్ కుమార్,జి.ఆశాజ్యోతి, మాకినేని మురళి,యం.వి నరసయ్య పాల్గొన్నారు.
Prajavartha Online Telugu News